సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ పదకొండవ జాబితా విడుదల అయ్యింది. రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ శుక్రవారం సాయంత్రం అధిష్టానం ఒక ప్రకటన విడుదల చేసింది.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్‌ను నియమించింది. అలాగే.. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఇటీవలె పార్టీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఛాన్స్ ఇచ్చింది.
ఇప్పటివరకు విడుదలైన 11 జాబితాల వారీగా చూస్తే.. 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిల జాబితాల్ని వైఎస్సార్‌సీపీ విడుదల చేసింది . ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ మొదటి నుంచి పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment