రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం | Appointment Of Ysrcp Incharges For Mylavaram And Penamaluru Constituency | Sakshi
Sakshi News home page

రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం

Published Wed, Aug 28 2024 5:16 PM | Last Updated on Wed, Aug 28 2024 6:51 PM

Appointment Of Ysrcp Incharges For Mylavaram And Penamaluru Constituency

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగింది.

వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.

కాగా, ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు.

జగన్ కీలక నిర్ణయం
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement