సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేవు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు కోతలు లేవు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందుతోంది. అయినా ఈనాడు పత్రిక ‘రైతులకు జగన్ షాక్’ అంటూ ఓ పసలేని కథ అచ్చేసింది. రైతులను అనవసర ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు.
వ్యవసాయానికి 9 గంటల పాటు కచ్చితంగా ఉచిత విద్యుత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈనాడు గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గ్రామాల్లో రోజుకి నాలుగైదు గంటలు మించి కరెంటు అందడంలేదన్నది పచ్చి అబద్ధమని, అనధికార కోతలు విధిస్తున్నారన్నదీ అవాస్తవమేనని తెలిపారు. అన్నదాతలకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి రాజీ లేదని,. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే అదే రోజు మరొక సమయంలో భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ‘సాక్షి’ ప్రతినిధికి సీఎండీలు వెల్లడించిన వివరాలు..
► గ్రిడ్ లో ఏర్పడే ఫ్రీక్వెన్సీ హె చ్చు తగ్గులను అదుపు చేయడానికి దక్షిణ భారత లోడ్ డిస్పాచ్ సెంటర్ (బెంగళూరు) ఆదేశాలతో ఆటోమాటిక్ లోడ్ షెడ్డింగ్ విధానం అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంటుంది. వెంటనే సంబంధిత విద్యుత్ సంస్థల ఇంజనీర్లు పరిస్థితిని అదుపు చేసి సరఫరాలో అంతరాయంలేకుండా చేయడానికి కృషి చేస్తున్నారు.
► ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అక్టోబర్ నెలలో రోజుకు 210 నుంచి 215 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన విద్యుత్ వినియోగం దాదాపు 245 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి సరాసరి రోజువారీ వినియోగం 170 నుంచి 180 మిలియన్ యూనిట్లు ఉండేది. బుధవారం రాష్ట్రంలో 234 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. తక్కువ వర్షపాతం వల్ల తగినంత సాగు నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరిగిపోయింది.వాతావరణ మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణాలతో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది.
► ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా నిలకడగా ఉంది. ఏ విధమైన ఒడిదొడుకులు ఏర్పడినా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా స్వల్పకాలిక మార్కెట్‌లో విద్యుత్ కొని, సరఫరా చేయడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని విద్యుత్ కొరత ఏర్పడే సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్తున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం యూనిట్ సగటు రేటు రూ.8.963 చొప్పున రూ.62.554 కోట్లతో 69.789 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి.
► మన రాష్ట్రంలో విద్యుత్ కొరత పరిస్థితులు లేవు. బీహార్‌లో 7.60 మిలియన్ యూనిట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5.73 మిలియన్ యూనిట్లు, కర్ణాటకలో 4.40 మిలియన్ యూనిట్లు, రాజస్థాన్‌లో 3.10 మిలియన్ యూనిట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో 47.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ లోటు సున్నాగా ఉంది.
Fact Check: కరెంటుంది.. కోతల్లేవు
Published Fri, Oct 13 2023 4:48 AM | Last Updated on Fri, Oct 13 2023 10:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment