అదను చూసి చార్జీలు బాదుతారు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ చార్జీలు పెంచ ట్లేదని గొప్పలకు పోతున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యానే ఇలా చెబుతున్నారు. ఎన్నికలు ముగి సిన తర్వాత ఆదాయ లోటును పూడ్చుకోడానికి ఒక్కసారిగా విద్యుత్ చార్జీలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తారు’ అని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లపై విద్యుత్ రంగ నిపుణులు, రైతు సంఘాల నేతలు, వక్తలు మండిపడ్డారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితి పైపైన బాగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పెచ్చురిల్లిన అవినీతితో రైతు లు, ప్రజలు తీవ్ర ఇబ్బందు లు గురవుతున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి విద్యుత్ అధికారులు, సిబ్బంది అవినీతి, నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తే ‘మేమేమీ చేయలేం, ఏసీబీకి ఫిర్యాదు చేసుకోండి’ అని డిస్కంల ఉన్నతాధికారులు పేర్కొనడం సరికాదని తప్పుబట్టారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీ డీసీఎల్) 2017–18కి సంబంధించి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్), విద్యుత్ టారీఫ్ ప్రతిపాదనలపై మంగళవారం హైదరాబాద్‌లో ని ఫ్యాప్సీ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) నిర్వహించిన బహి రంగ విచారణ వాడివేడీగా జరిగింది. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీని వాస్‌ల సమక్షంలో కార్యక్రమం జరిగింది.
చేతులు తడపనిదే పని జరగదు..
క్షేత్రస్థాయి అధికారుల చేతులు తడిపితేకాని ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు, కొత్త స్తంభాల ఏర్పాటు, కొత్త వ్యవసాయ కనెక్షన్ల జారీ కావడం లేదని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల అమాయక రైతులు, పౌరులు విద్యుదాఘాతాలు, ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా బహిరంగ విచారణలో ఈ అంశాలపై ఫిర్యాదు చేస్తున్నా డిస్కంల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఏకంగా 11,303 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండనుందని అంచనాల్లో చూపారని, యూనిట్‌కు రూ.1.97 చొప్పున స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సి వస్తుందని, దీంతో ప్రజలపై రూ.2,226 కోట్ల అనవసర భారం పడనుందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్‌రావుతో పాటు ఎం.తిమ్మారెడ్డి, దొంతి నర్సింహారెడ్డి తప్పు బట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, స్తంభాల ఏర్పాటు కోసం క్షేత్రస్థాయి అధికారులు రైతులను దోచుకుంటున్నారని, ఈ అవినీతికి చెక్‌పెట్టాలని పలువురు కోరారు.
ఓపెన్ యాక్సెస్‌కు అనుమతించండి
తెలంగాణలో రైల్వే ట్రాక్షన్ కేటగిరీ విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.7.10 ఉండగా, ఏపీలో రూ.4.74 మాత్రమే వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు ఉండటంతో రాష్ట్రంలో కొత్త రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులను ప్రారంభించలేకపోతున్నాం. ఏపీ తరహాలో రైల్వేకు విద్యుత్ చార్జీలను రూ.4.74కు తగ్గించాలి. లేకుంటే ఓపెన్ యాక్సెస్ విధానంలో బయట నుంచి విద్యుత్ కొనేందుకు అనుమతించాలి. –ఎల్‌ఎల్ మీనా, చీఫ్ ఇంజనీర్, ద.మ«.రైల్వే
ఛత్తీస్‌గఢ్‌కు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్
కాస్ట్ ఆఫ్ సర్వీస్ గతేడాది యూనిట్‌కు రూ.5.47 కాగా.. ఈ ఏడాది రూ.6.71కు పెంచుతూ ప్రతిపాదించడం సరికాదు. ఒక్కసారిగా 15 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుంది. ఏపీ, తెలంగాణ జెన్‌కోల విద్యుత్ ధరలు అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్ డిస్కంలు రూ.50 కోట్ల ట్రేడింగ్ మార్జిన్‌ను తెలంగాణ నుంచి రాబట్టుకుంటామని ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలిపాయి. ఇది కూడా ప్రజలపై భారం కానుంది.
–సౌరభ్ కుమార్ శ్రీవాస్తవ, ఫ్యాప్సీ