2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి | AP Government Speeds Up Polavaram Project Work | Sakshi
Sakshi News home page

2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

Published Tue, Oct 22 2019 8:05 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖను ఆదేశించింది. మే నాటికి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తి చేయాలని, 41.5 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్దేశించింది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌ అధ్యక్షతన సంస్థ సర్వ సభ్య సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుత సీజన్‌లో పూర్తి చేయాల్సిన పనులు, నిపుణుల కమిటీ నివేదిక, నిర్వాసితులకు పునరావాసం కల్పన తదితర అంశాలపై ఇందులో సమగ్రంగా చర్చించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement