Reverse Tendering
-
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో ఖజానాను అప్పటి ప్రభుత్వ పెద్దలు దోచేశారు. ప్రజా ధనాన్ని ఇలా దోపిడీ చేయకుండా అడ్డుకట్ట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను తెచ్చింది. ఈ చట్టం ద్వారా టెండర్లలో పారదర్శకత, సూచనలు చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రవేశ పెట్టింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసింది. కానీ, ఇటీవలి ఎన్నికల్లో 2014–19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ దోపిడీ పర్వానికి తెర తీస్తూ చంద్రబాబు కూటమి జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన ప్రతిపాదనను బుధవారం మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జ్యుడిషియల్ ప్రివ్యూ అడ్డునూ తొలగించుకుంది. మళ్లీ 2014–19 తరహాలోనే అడ్డగోలుగా అంచనాలు పెంచేసి.. కమీషన్లు ఎక్కువ ఇచ్చే కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్లు పిలిచి, కోరుకున్న కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి, కమీషన్లు వసూలు చేసుకునేందుకు మళ్లీ సిద్ధమయ్యారని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.జ్యుడిషియల్ ప్రివ్యూకు నీతి అయోగ్ ప్రశంసలురాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్ట్రాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఇప్పటిలానే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్లాది రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. 2014 – 19 మధ్య బాబు సర్కారు దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన తన సన్నిహితుడైన సి.ఎం. రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు.»హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.99 లక్షల విలువైన పనులు, 3–బి ప్యాకేజిల్లో రూ.రూ.8.69 కోట్ల విలువైన పను మిగిలాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. 2–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేశారు. 3–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. ఈ రెండింటినీ సి.ఎం. రమేష్‌కే అప్పగించారు. ఇలా 2–బి ప్యాకేజీలో రూ.114.09 కోట్లు, 3–బి ప్యాకేజీలో 140.45 కోట్లు పెంచేసి, సి.ఎం.రమేష్‌కు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. »హంద్రీ–నీవా రెండో దశ 4–బి ప్యాకేజీలో 2014 నాటికి రూ.1.34 కోట్లు, 5–బీ ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటి కాంట్రాక్టర్లను కూడా 60–సీ నిబంధన కింద చంద్రబాబు తొలగించారు. 4–బి ప్యాకేజీ పనుల వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, తన సన్నిహితుడైన ఆర్.మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.»వెలిగొండ రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. వాటిని చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సీ నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. జీవో 22, జీవో 63ను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. వాటిని సి.ఎం. రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి, సి.ఎం. రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కాVŠ జీవో 22, జీవో 63ను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం బాబు అవినీతికి తార్కాణం.» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » ఇప్పుడూ అదే రీతిలో ఖజానాను కొల్లగొట్టేందుకు జ్యుడిషియల్ ప్రివ్యూను ప్రభుత్వం రద్దు చేసిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
శ్రీవారి నిధుల దోపిడీకి బాబు సర్కారు స్కెచ్
సాక్షి, అమరావతి: ధర్మో రక్షతి రక్షితః.. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే.. ఆ ధర్మమే మనల్ని సంరక్షిస్తుందన్న ఆర్యోక్తి తిరుమల కొండల్లో కనుమరుగైపోతోంది. ధర్మాన్ని రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే దానికి పాతరేశారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోని ముఖ్యులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఖజానాను కాంట్రాక్టర్లతో కలిసి దోచేసిన తరహాలోనే ఇప్పుడూ దోపిడీకి తెరతీశారు. ఇందుకోసం అత్యంత పారదర్శకమైన, ప్రజా ధనాన్ని ఆదా చేసే రివర్స్ టెండరింగ్‌ను టీటీడీలో రద్దు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టు 16న రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వం గత నెల 15న రద్దు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ఉత్తర్వులను టీటీడీలోనూ అమలు చేస్తూ.. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.దీనిద్వారా 2019 ఆగస్టు 16కు ముందు టీటీడీలో అమల్లో ఉన్న పాత పద్ధతి ప్రకారమే నెయ్యి, ముడిసరుకుల కొనుగోలు, నిర్మాణ పనులు తదితర పనులకు టెండర్లు నిర్వహించడానికి మార్గం సుగమమైంది. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లతో టెండర్లకు ముందే కుమ్మక్కై, అంచనా వ్యయాన్ని పెంచేసి, ఆపై అధిక ధరలకు కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానాను మళ్లీ దోచేయడానికి స్కెచ్ వేసినట్లు బాబు సర్కారు తాజా చర్యలు చెబుతున్నాయి. రివర్స్ టెండరింగ్‌తో శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా రాష్ట్ర విభజన తర్వాత జనసేన, బీజేపీతో కూటమి కట్టి 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అప్పట్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా శ్రీవారి ఖజానా నుంచి రూ.వందలాది కోట్లు, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోటుŠల్ ఆ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, పలువురు కాంట్రాక్టర్లు దోచేశారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దోపిడీ వ్యవస్థకు తెరదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. చట్టం చేసి మరీ జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రూ. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఖర్చయ్యే పనుల టెండర్ ముసాయిదాను జ్యుడిíÙయల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. దానిపై జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ముసాయిదా మార్పులు ఉంటే సూచిస్తారు. లేదంటే యథాతధంగా ఆమోదిస్తారు. జడ్జి ఆమోదించిన ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. రూ.కోటి అంత కంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 ఆగస్టు 16న జీవో 67 జారీ చేసింది. దీని ద్వారా టెండర్ల వ్యవస్థను వైఎస్ జగన్ అత్యంత పారదర్శకంగా మార్చారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం దోపిడీలో భాగంగా అనుసరించిన కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చే నిబంధనను కూడా వైఎస్ జగన్ తొలగించారు. ఇలా రివర్స్ టెండరింగ్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. 2019–24 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకు పైగా ఆదా చేశారు. శ్రీవారి ఖజానాకు రూ.వందలాది కోట్ల రూపాయలు మిగిల్చారు.రివర్స్ టెండరింగ్ ఇలా.. » టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా ఖరారు చేస్తారు. » ఎల్–1 కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. ఆన్లైన్లో 2.30 గంటలపాటు రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. » రివర్స్ టెండరింగ్ సమయం ముగిసేసరికి అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. » 2016 ఆగస్టు 16 నుంచి శుక్రవారం వరకూ టీటీడీలో ఇదే విధానం ప్రకారం టెండర్లు నిర్వహించారు. » టెండర్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన ముడిసరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని తక్కువ ధరకే కొనుగోలు చేసి శ్రీవారి ఖజానాను పరిరక్షించారు. » టెండర్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ముడిసరుకులు, నెయ్యి లేనట్లు పరీక్షల్లో తేలితే ఆ సరుకులు తెచ్చిన లారీ, నెయ్యి తెచ్చిన ట్యాంకర్‌ను సరఫరా సంస్థకే వెనక్కి పంపేశారు. » తద్వారా అత్యంత నాణ్యమైన ముడి సరుకులు, స్వచ్ఛమైన నెయ్యిని కాంట్రాక్టు సంస్థలు టీటీడీకి సరఫరా చేశాయి. -
ఖజానా దోపిడీకి లైన్ క్లియర్
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. సీబీఎస్ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ప్రతిపాదన దశలోనే బేరసారాలు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్‌కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు. 7,500కోట్లు ఆదా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు. అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.– సాక్షి, అమరావతి -
ఖజానాకు కన్నం!
ఇలాంటి దోపిడీకి మళ్లీ రాచమార్గంపట్టిసీమ టెండర్లలో రూ. 257.45 కోట్ల లూటీ..2017–18లోనే కడిగేస్తూ కాగ్ నివేదికవైకుంఠపురం బ్యారేజ్ పనుల వ్యయాన్ని రూ.400 కోట్లు పెంచేసి 13.19 శాతం అధిక ధరలకు నవయుగకు ధారాదత్తంపోలవరం హెడ్‌వర్క్స్‌లో జల విద్యుత్ కేంద్రం పనులను నవయుగకు 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు అప్పగించిన బాబు మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో కాంట్రాక్టర్లతో కలిసి ఖజానా దోచేసేందుకు సిద్ధంనీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకతకాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడి అధిక మొత్తం కోట్ చేయకుండా ఉంటారు.ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు.రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతారు.ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా నిర్ణయిస్తారు. రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదంకంచే చేను మేస్తే?.. ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు గేట్లెత్తితే? రివర్స్ టెండరింగ్ విధానం రద్దుతో ఇప్పుడు అదే పునరావృతమవుతోంది!! ఖజానాకు టెండర్ పెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్‌తో టెండర్ల వ్యవస్థలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పులకు మంగళం పాడింది. రివర్స్ టెండరింగ్ విధానం రద్దుకు రాష్ట్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. 2014–19 మధ్య ఉన్న పాత టెండర్ విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనుల అంచనా వ్యయాన్ని లెక్కకట్టక ముందే కమీషన్ ఎక్కువ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై తర్వాత అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం.. ఆ కాంట్రాక్టర్‌కే పనులు దక్కే నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ .. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు అప్పగింత.. ఆ తర్వాత ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల సంతర్పణ.. వాటినే కమీషన్లుగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. – సాక్షి, అమరావతిఖజానాపై రూ.20 వేల కోట్ల భారం..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఖజానా లూటీకి టెండర్ విధానాలను ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అంచనా వ్యయాన్ని పెంచడం.. అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నోటిఫికేషన్ జారీ చేయడం.. సగటున 4.85 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టి ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.⇒ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 2015 మార్చిలో రూ.1,170.25 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 21.999 శాతం అధిక ధరలకు అంటే రూ.1,427.70 కోట్లకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు పనులు అప్పగించేశారు. దేశ చరిత్రలో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు అత్యధికంగా అప్పగించిన టెండర్ ఇదే కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే అధిక ధరలకు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. అయితే చంద్రబాబు మాత్రం ఐదు శాతం అధిక ధరలు, ఏడాదిలో ఎత్తిపోతల పూర్తి చేస్తే 16.999 శాతం బోనస్‌గా ఇస్తామంటూ టెండర్ ఆమోదించేశారు. 2016 మార్చి నాటికి ఆ పథకం పూర్తయినా అప్పుడు గోదావరిలో ప్రవాహం లేనందున ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటినేవి పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా 21.999 శాతం అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రూ.257.45 కోట్ల భారం పడింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు పది శాతం నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా అప్పగించి కమీషన్లు రాబట్టుకున్నారు. పట్టిసీమ టెండర్లో నాటి చంద్రబాబు సర్కార్ ఖజానాను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టిందని కాగ్ 2017–18లో ఇచ్చిన నివేదికే ఇందుకు నిదర్శనం.⇒ ప్రకాశం బ్యారేజీకి 21 కి.మీ. ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 13.19% అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు అప్పగించారు. అంచనాలు పెంచడం, అధిక ధరలకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీ సిపార్సు మేరకు వైకుంఠపురం బ్యారేజీ పనుల టెండర్‌ను రద్దు చేయడంతో నవయుగ దోపిడీకి బ్రేక్ పడింది.⇒ 2014–19 మధ్య వివిధ శాఖల్లో మొత్తం రూ.3.51 లక్షల కోట్ల విలువైన పనులకు చంద్రబాబు సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం 2018–19లోనే రూ.1.27 లక్షల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. అధిక ధరలకు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం ద్వారా ఖజానాపై రూ.20 వేల కోట్ల మేర భారం వేసి ఆ మేరకు కమీషన్ల రూపంలో చంద్రబాబు తన జేబులో వేసుకున్నారు.⇒ 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ 2014–19 తరహాలోనే కాంట్రాక్టర్లతో కలిసి ఖజానాను దోచేసేందుకు సిద్ధమైనట్లు తాజాగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు నిర్ణయంతో స్పష్టమవుతోంది.రివర్స్ టెండరింగ్ ఇదీ..బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ (బీవోసీఈ) నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌పై 2019 ఆగస్టు 16న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబరు 67 జారీ చేసింది. ఈ విధానంలో జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన కాంట్రాక్టు విలువను ఖరారు చేస్తూ టెండర్ షెడ్యూలు ముసాయిదాతోనే నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనివల్ల ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. టెండర్లో ఆర్థిక బిడ్ తెరిచాక తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా ఖరారు చేస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తానే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆన్లైన్లో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు పనులు అప్పగిస్తారు. గత ప్రభుత్వం 59 నెలల పాటు ఇదే పద్ధతిలో టెండర్లు నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా చేసింది.రివర్స్ టెండరింగ్‌తో పగిలిన అక్రమాల పుట్ట..2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టెండర్ల వ్యవస్థను సంస్కరించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థను ప్రవేశపెట్టారు. రూ.వంద కోట్లు అంతకంటే అధిక వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపాలని ఆదేశించారు. దీనిపై జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేలా విధాన నిర్ణయం తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని టెండర్ ముసాయిదా షెడ్యూలులో మార్పుచేర్పులను జడ్జి సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే ముసాయిదా షెడ్యూల్‌ను యథాతధంగా ఆమోదిస్తారు. జ్యూడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూలుతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపట్టారు. ఇక రూ.కోటి అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించేలా విధానాన్ని రూపొందించారు. దీనిద్వారా టెండర్ల వ్యవస్థను అత్యంత పారదర్శకంగా మార్చారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే నిబంధనను తొలగించారు.⇒ రాష్ట్రంలో 2014–19 మధ్య సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌కు వైఎస్ జగన్ ఆదేశించారు. తొలుత పోలవరం ఎడమ కాలువ అనుసంధానం (ప్యాకేజీ–65) పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 2018లో రూ.278 కోట్ల అంచనా వ్యయంతో టీడీపీ సర్కార్ నిర్వహించిన టెండర్లలో 4.8 శాతం అధిక ధరలకు అంటే రూ.292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.14.09 కోట్ల భారం పడింది. చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్‌కు అప్పగించిన పనుల విలువ మొత్తం రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా పరిగణించి వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఆరు సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. టీడీపీ హయాంలో రూ.292.09 కోట్లకు పనులను దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థే రివర్స్ టెండరింగ్‌లో రూ.231.47 కోట్లకే పనులు చేయడానికి ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా చంద్రబాబు సర్కార్ అక్రమాలు బట్టబయలయ్యాయి.⇒ పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు చంద్రబాబు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఇందులో 2019 మే 30 నాటికి రూ.1,771.44 కోట్ల విలువైన పనులు మిగిలాయి. హెడ్ వర్క్స్‌కు అనుసంధానంగా 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను కూడా నవయుగకే 4.8 శాతం అధిక ధరలకు రూ.3,216.11 కోట్లకు చంద్రబాబు అప్పగించారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్ జగన్ ఈ రెండు పనులను రద్దు చేశారు. నవయుగకు అప్పగించిన విలువనే కాంట్రాక్టు విలువగా పరిగణించి రెండింటినీ కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.4,987.55 కోట్లతో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ పనులను 12.6 శాతం తక్కువ ధరలకు అంటే రూ.4,358.11 కోట్లకే చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629.44 కోట్లు ఆదా అయ్యాయి. చంద్రబాబు సర్కార్ గతంతో జలవిద్యుత్కేంద్రం పనులను 4.8 శాతం అధిక ధరలకు అప్పగించడం వల్ల ఖజానాపై రూ.154 కోట్ల భారం పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే రివర్స్ టెండరింగ్ వల్ల రూ.783.44 కోట్లు ఆదా అవడంతో చంద్రబాబు అక్రమాలు మరోసారి నిరూపితమయ్యాయి.⇒ ఒక్క సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్లకుపైగా ఆదా చేసింది. రహదారులు, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల్లో మొత్తం రూ.3,60,448.45 కోట్ల విలువైన 4,36,164 పనులకు టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.7,500 కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యాయి. దేశ చరిత్రలో ఇదో రికార్డు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పారదర్శకమైన టెండర్ల విధానం అమల్లో ఉందని, ఇది దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని నాడు నీతి అయోగ్ ప్రశంసించడం గమనార్హం. -
Fact Check: ఎందుకీ ‘తొందరపాటు’?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది. ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు. పైగా, గత ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు. ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు.. ♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్‌లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్కో ఈ టెండరును ఆమోదించింది. ♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్‌ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్కో నిర్ణయించింది. ♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్‌లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం. ♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు. ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది. ♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది. -
రామోజీ మార్కు స్మార్ట్ బ్లండర్!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి రివర్స్ టెండర్లు కూడా నిర్వహించాకే ఖరారు చేస్తే అదేదో ఘోరమైనట్లుగా ఈనాడు రామోజీ చిత్రీకరిస్తున్నారు. కడప జిల్లా వాసులు అసలు వ్యాపారాలే చేయకూడదన్నట్లుగా స్మార్ట్ మీటర్ల టెండర్ దక్కించుకున్న సంస్థపై ఈనాడు పదేపదే విషం గక్కుతోంది. ఈనాడు కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు స్పష్టం చేశారు. కోవిడ్‌లో అధిక ధర.. అందుకే రద్దు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు ఉచిత విద్యుత్ అందించడం, ప్రమాదాలకు తావు లేకుండా, మీటర్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ల భద్రతని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ లేదా ఐఆర్డీఏ మీటర్లను రక్షణ పరికరాలతో అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టెండర్ రూపొందించిన డిస్కమ్‌లు న్యాయ సమీక్షకు పంపించాయి. 15 రోజుల సలహాలు, అభ్యంతరాలను సేకరించిన అనంతరం ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా డిస్కమ్‌లు టెండర్లను పిలిచాయి. ఎల్1 గా నిలిచిన బిడ్డర్‌కు టెండర్ అప్పగించాయి. అయితే ఈ ప్రక్రియ కోవిడ్ సమయంలో జరిగినందువల్ల సంస్థలు, ఫ్యాక్టరీలు మూతపడి ఉండడం, టెండర్ విలువ అధికంగా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రక్రియను రద్దు చేసింది. మళ్లీ పిలవడంతో ఆదా.. ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నది అక్షర సత్యమే. రీ టెండరింగ్ ద్వారా ధర మొదటి సారి కంటే 15.75% తగ్గింది. ఏర్పాటుకు 27 నెలలు, నిర్వహణకు 93 నెలలుగా కేంద్ర ప్రభుత్వం వ్యవధి పెంచింది. దీనివల్ల మీటర్ గ్యారంటీ పీరియడ్ 10 ఏళ్లకు పెరిగింది. నిర్వహణ సమయం పెరగడం డిస్కమ్‌లకు వ్యయంలో 2 శాతం ఆదా అవుతుంది. షిరిడీ సాయి, అదాని లాంటి పెద్ద సంస్థలు పోటీ పడటం వల్ల ఈ ప్రాజెక్టుకు సరైన ధర వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోలికలా?.. హవ్వ! స్మార్ట్ మీటర్ల విధానాన్ని దేశంలో మొదటిగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లను పట్టణ ప్రాంతాల్లోని స్మార్ట్ మీటర్ విధానంతో పోల్చడం, ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు చేయడం ‘ఈనాడు’ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఏదైనా ఓ వ్యవస్థను మరో సమానమైన దానితో పోల్చడానికి అవి రెండూ ఒకే వ్యవస్థలు అయి ఉండాలి కదా? ఆ మాత్రం కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు సంబంధించి రైతులపై బిల్లులు, ట్రూఅప్ లాంటి భారమేదీ మోపట్లేదు. రక్షణ పరికరాలతో సహా మొత్తం ఉచితంగానే ప్రభుత్వం అందచేస్తోంది. -
పూర్తవని ఈ–టెండర్‌పై.. ఈ తప్పుడు రాతలేంటి.!
సాక్షి, అమరావతి: వెన్నంటి ఉండేవారిని సన్నిహితులంటారు. వదిలేసి వెళ్లిపోయిన వారిని సన్నిహితులని ఈనాడు రామోజీరావు మాత్రమే అనగలరు. న్యాయ సమీక్షను తప్పుబట్టగలరు. రివర్స్ టెండరింగ్ చెడ్డదని రాయగలరు. ఆయన అనుకున్నది సాధించడానికి ఏదైనా అచ్చేయగలరు. నిస్సిగ్గుగా అబద్ధాలను జనంపై రుద్దేయగలరు. అంతమాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటే. అసలు ఈనాడు రామోజీరావు దృష్టిలో అవినీతి అంటే ఏమిటి? ఎక్కడా లేని రీతిలో రూ.2.28 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అవినీతా? లేక గత ప్రభుత్వంలా దోచుకోవడం పంచుకోవడం అవినీతా? సీఎం స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టాలనే ఆరాటంలో పత్రిక విలువలను దిగజార్చి, జర్నలిజం నియమాలను తుంగలో తొక్కి, సొంత అజెండాతో కథనాలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైంది. ఇదే ధోరణితో ఇంకా పూర్తి కాని భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్లపై ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఆ రాతల వెనుక అసలు నిజాలు ఇలా ఉన్నాయి.. ఆరోపణ: అది జగన్‌కు అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ వాస్తవం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు అయితే వైఎస్సార్సీపీని ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? జగన్ మీద రాజకీయ ప్రతీకారంగా కేసులు పెట్టి, జైల్లోకి పంపిన కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా సన్నిహితుడని చెప్తారు? అసలు ఎవరు ఎవరికి సన్నిహితులో ఈనాడుకు తెలియంది కాదు. రామోజీ వియ్యంకుడు నవయుగ వారికి చెందిన సంస్థ కాదా? ఆర్వీఆర్ అనే సంస్థ వారికి చెందిన వారిది కాదా? సుధాకర్ యాదవ్ యనమలకు వియ్యంకుడు కాదా? అందుకే పోలవరంలో నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టు దక్కలేదా? సీఎం రమేష్ మీవాడు కాదా? వారి సంస్థ రిత్విక్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టలేదా? నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్‌రావు మీ వాళ్లు కాదా? రామోజీరావు ఓన్ చేసుకోవాలంటే వీళ్లని ఓన్ చేసుకోవాలి. ఆరోపణ: ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంస్థల్లో దేనికి ఏ కాంట్రాక్టు వెళ్లాలో ముందే ఖరారైపోతుంది. వాస్తవం: రాష్ట్రంలోని జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందుగా టెండర్లు తీసుకుని 2 వారాల సమయం ఇచ్చి పబ్లిక్ డొమైన్లో వాటిని పెట్టి అభ్యంతరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి స్వీకరిస్తారు. ఆ మేరకు మార్పులు చేస్తారు. మళ్లీ టెండర్లు పిలుస్తారు. టెండర్లు ఖరారు చేశాక రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ దేశంలో ఎక్కడాలేదు. మరి భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల టెండర్ల ప్రక్రియలో రామోజీరావు ఎందుకు పాల్గొనలేదు? ఆరోపణ: టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో అధికారులకు ఆయనే నిర్దేశిస్తారు. వాస్తవం: ‘ఆర్డీఎస్ఎస్’ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుళ్లు అమర్చాలని ప్రణాళిక రూపొందించారు. రూ..1,165.41 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నివేదికను 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.699.25 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ పీఎఫ్సీ ఆమోదించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌కి అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దీని నిబంధనలను ఎవరో ఒకరు మార్చేసే అవకాశం లేదు. ఆరోపణ: పనులు అవే.. అంచనాలు పెంచేయడం వల్ల అదనంగా ఖర్చు వాస్తవం: భూగర్భ విద్యుత్ పనుల్లో అధికంగా వినియోగించే కేబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా టెండర్ ధర అధికంగా వచ్చింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2021లో తయారు చేశారు. ఆ సమయంలో కేబుల్ ధరలు 2018–19 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్కం కొనుగోలు చేసిన ధరలకు అనుగుణంగా తీసుకున్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తెచ్చిన సంక్షోభం, విధించిన ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ముడిసరుకులైన అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి వాటి ధరలు బాగా పెరిగాయి. కవర్ కండక్టర్, ఎక్స్ఎల్పీఈ కేబుల్స్, 33 కేవీ, 11 కేవీ ఆర్‌ఎంయూలు మొదలైనవి, అలాగే లేబర్ రేట్లు కూడా పెరిగాయి. వీటి ఆధారంగా మంజూరైన ధరతో పోలిస్తే బిడ్డర్లు కోట్ చేసిన రేట్లలో సహజంగానే పెరుగుదల ఉండవచ్చు. ఆరోపణ: పోటీలో ఆ రెండు కంపెనీలే వాస్తవం: రింగ్ మెయిన్ యూనిట్లు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో బీహెచ్ఎల్, ఏబీబీ, సీమెన్స్, స్పైడర్ వంటి తయారీ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఆసక్తి కలిగిన గుత్తేదారులందరూ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ సాధారణ ప్రక్రియలో కనీస ధర ప్రతిపాదించి ఎల్ 1గా అర్హత పొందిన గుత్తేదారుకు మాత్రమే పనులు దక్కించుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటును పొందడానికి టెండర్‌ను నిర్ణీత వ్యవధిలో ఖరారు చేయవలసి ఉంది. ఈ కారణంగా టెండర్ వివరాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పరిశీలనకు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్డగోలుగా కట్టబెట్టేశారని రామోజీ గగ్గోలు దేనికో..!! ఆరోపణ: రివర్స్ టెండరింగ్ ఓ బూటకం వాస్తవం: 2022 డిసెంబర్ 9న జ్యుడిషియల్ ప్రివ్యూ ఇచ్చిన ఆమోదం మేరకు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా 2022 డిసెంబర్ 12న మొదటి టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ బిడ్ నెం.09/2022–23లో ఇద్దరు గుత్తేదార్లు పాల్గొన్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం షిర్డీ సాయి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీల బిడ్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రైస్ బిడ్స్‌లో ఎల్ 1 బిడ్డర్‌గా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్సీఐఎల్ అర్హత సాధించింది. గుత్తేదార్లు కోట్ చేసిన రేటు అధికంగా ఉండటం వల్ల రివర్స్ టెండర్ ప్రక్రియ కొనసాగించారు. గుత్తేదార్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. తిరిగి ఏప్రిల్‌లో రెండోసారి టెండర్ ఆహ్వానించారు. ఈ రీ టెండరీంగ్ సమయంలో రింగ్ మెయిన్ యూనిట్ల పరికరాలను టెండర్ నుంచి మినహాయించారు. ఈ పరికరాల నాణ్యత, దీర్ఘకాల గ్యారెంటీ సౌకర్యం కోసం వాటిని డిస్కం ప్రత్యేకంగా కొనాలని నిర్ణయించింది. రింగ్ యూనిట్లు మినహాయించిన ఈ టెండర్లలో నలుగురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అర్హత సాధించగా సంబంధిత ధర నిర్ణయం కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ధరల ప్రకారం 2022–23 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) ఆధారిత అంచనాలకు మించి 8 శాతం అధికంగా ఎల్1 బిడ్డర్ ఆర్సీఐఎల్ దాఖలు చేసింది. ఇంత పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో బూటకం ఏముంది? -
సీఎం జిల్లా వారైతే అనర్హులా.!
సాక్షి, అమరావతి: విదేశీయులు మన దేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది దేశ, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేదు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా అర్హత ఉన్న ఎవరైనా చట్టం, నిబంధనల మేరకు ఏదైనా చేయవచ్చు. దీనిని విశ్యవ్యాప్తంగా ఎవరూ కాదనరు. కానీ ఈనాడుకు మాత్రం సీఎం సొంత జిల్లా వారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, టెండర్లు దక్కించుకోకూడదన్న అభిప్రాయం నరనరానా జీర్ణించుకుపోయింది. అందుకే వారు వ్యాపారాలకు అనర్హులనేలా కథనాలు అల్లుతోంది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చ డానికి సీలేరులో రెండు అదనపు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా బిడ్లు ఆహ్వానించి, రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరు ఖరారు చేసింది. కానీ ఇదంతా తప్పన్నట్టు ‘ఈనాడు’ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక అధినేత రామోజీరావు పచ్చళ్లు అమ్ముకోవచ్చు.. పత్రికనూ నడుపుకోవచ్చు.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు టెండర్ ఇవ్వకూడదు. వారికి, వారు కొమ్ముకాస్తున్న వారికి ఒక న్యాయం.. సీఎం సొంత జిల్లా వారైతే మరో న్యాయం.. ఇదేం రామోజీ జర్నలిజం. ఏపీ జెన్కో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ టెండర్లలో వాస్తవాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించినది కావడమే దానికి ఉన్న ఏకైక అర్హత. వాస్తవం: ఏపీ జెన్కో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఇందులో ఏపీ జెన్కో, ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఈ కన్సార్టియం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రతిష్టాత్మక బీహెచ్ఈఎల్తో ఈ ప్రాజక్టు యంత్ర పరికరాల సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్లకు కూడా బీహెచ్ఈఎల్ యంత్ర పరికరాలు సరఫరా చేసింది. కన్సార్టియంలోని మరో కంపెనీ పీఈఎస్‌కు ఇదివరకే ఈ ప్రాజక్టులో సివిల్ పనులు చేసిన అనుభవముంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. ఈ ప్రాజక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2024కల్లా పూర్తవుతాయి. ఆరోపణ: దిగువ సీలేరులో రెండు అదనపు యూనిట్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, జీఎస్టీ, ఆలస్యానికి అయ్యే వడ్డీతో కలిపి రూ. 571 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్ఈసీ) నుంచి ప్రభుత్వం తీసుకుంది. వాస్తవం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం తీసుకో వడం సర్వసాధారణం. ఇందులో తప్పేముంది? ఆరోపణ: ఇప్పటికే షిర్డీ సాయి, దాని అనుబంధ సంస్థలకు రూ. 92 వేల కోట్ల విలువైన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: ఏపీ జెన్కోగానీ, డిస్కంలు గానీ నామినేషన్ పద్ధతిలో ఏ పనులూ ఎవరికీ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పారదర్శకంగా టెండర్లు నిర్వహించాయి. అర్హతల మేరకు పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని ఏ సంస్థ అయినా పనులు దక్కించుకోవచ్చు. ఆరోపణ: ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ (గ్లోబల్ టెండర్లు– ఇ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం) ద్వారా ఏపీ జెన్కో టెండర్లు పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ కూడా సమీక్షించి ఈ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపింది. రాఘవ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, పీఈఎస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిపి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్లు దాఖలు చేసింది. టెండర్లలో కోట్ అయిన అతి తక్కువ మొత్తాన్ని గరిష్టంగా తీసుకుని ఏపీజెన్కో రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ తక్కువ మొత్తానికి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కాంట్రాక్టు దక్కించుకుంది. రెండు దశల (సాంకేతిక, ఆర్ధిక) బిడ్డింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు సంస్థను ఎంపిక చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల ఏపీ జెన్కోకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయ్యింది. ఆరోపణ: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతులు రాకముందే హడావుడి చేసింది. వాస్తవం: విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి ముందే చెప్పారు. ప్రతిపాదనను పరిశీలించి డిస్కంలు, జెన్కో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుని కమిషన్ అనుమతి కోసం అప్పుడు పంపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఈ నెల 7న వచ్చింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1000 కోట్లు దాటనందున కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) అనుమతి అవసరం లేదు. ఆరోపణ: రెండు కొత్త యూనిట్లు నిర్మించడం వల్ల దిగువ సీలేరు ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. వాస్తవం: జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మన గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు 115 మెగావాట్ల యూనిట్లు ఏటా దాదాపు 1100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం మొట్టమొదట నిర్మించినప్పుడే ఆరు యూనిట్ల ఏర్పాటుకు కావలసిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో అదనంగా మరో రెండు 115 మెగావాట్ల యూనిట్లు నిర్మించాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. కొత్త యూనిట్లు నెలకొల్పడం వల్ల ఈ విద్యుత్ కేంద్రం గరిష్ట లోడ్ సామర్ధ్యం పెరుగుతుంది. దాంతో మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనవలసిన అవసరం తగ్గుతుంది. ప్రతి 115 మెగావాట్ల యంత్రం పీక్ డిమాండ్ సమయంలో సగటున 175 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల డిస్కంలకు ఏటా 350 మిలియన్ యూనిట్లు విద్యుత్ మార్కెట్లో కొనాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు లాభం చేకూరుతుంది. పీక్ సమయాల్లో మార్కెట్ రేటు యూనిట్‌కు దాదాపు రూ.10 ఉంటోంది. సరాసరి పీక్ లోడ్ విద్యుత్ ధర రూ.8.0 అనుకున్నా ఈ రెండు యూనిట్ల వల్లా ఏటా దాదాపు రూ .280 కోట్లు ఆదా అవుతుంది. -
రివర్స్ టెండరింగ్‌తో రూ.44.15 కోట్లు ఆదా
బి.కొత్తకోట: జలవనరుల శాఖలో రివర్స్ టెండరింగ్‌తో కోట్లు ఆదా అవుతున్నాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో సాగే ఏవీఆర్ హంద్రీ–నీవా సాగునీటి ప్రాజెక్టు రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల ప్రారంభంలో ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈనెల 20న ప్రాజెక్టు మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించగా సోమవారం కంపెనీలు దాఖలుచేసిన ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ రివర్స్ టెండరింగ్‌లో లెస్‌కు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె నుంచి హంద్రీ–నీవా పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)పై కిలోమీటరు 79.600 నుంచి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలో కిలోమీటరు 220.350 వరకు కాలువను విస్తరించే పనులకు ప్రభుత్వం రూ.1,219,93,02,150 అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులు దక్కించుకునేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేశాయి. తొలుత టెండర్లను దాఖలు చేసిన కంపెనీల సాంకేతిక అర్హత, అనుభవం, సామర్థ్యంపై డాక్యుమెంట్లను ఈనెల 20న పరిశీలించగా రెండింటీకి అర్హత ఉన్నట్లు నిర్ధారౖణెంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రైస్‌బిడ్‌ను తెరిచారు. ఇందులో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అంచనాకంటే 3.42 శాతం అదనంతో రూ.1,261,65,18,283.53కు టెండర్ దాఖలు చేసింది. అనంతరం దీనిపై ఎస్ఈ రాజగోపాల్ రివర్స్ టెండరింగ్ ప్రారంభించి సా.5.30 గంటలకు ముగించారు. ఇందులో రెండు కంపెనీలు పోటీపడినా చివరికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రభుత్వ అంచనా విలువకంటే 0.1997 శాతం తక్కువకు అంటే..రూ.1,217,49,40,146.53తో టెండర్ దాఖలుచేసి ఎల్–1గా నిలిచింది. ఈ రివర్స్ టెండర్ నిర్వహణవల్ల ప్రభుత్వానికి రూ.44,15,78,137 ఆదా అయ్యింది. ఇక ఎల్–1గా నిలిచిన కంపెనీకి పనుల అప్పగింత కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. -
263 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) మరో 263 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్టీసీ ‘ఈ’ కామర్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని టెండర్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని ఆర్టీసీ ఈడీ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేటగిరీల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు ఏసీ స్లీపర్ 4, నాన్ ఏసీ స్లీపర్ 6, సూపర్ లగ్జరీ 12, అల్ట్రా డీలక్స్ 15, ఎక్స్‌ప్రెస్ 30, అల్ట్రా పల్లె వెలుగు 95, పల్లె వెలుగు 72, మెట్రో ఎక్స్‌ప్రెస్ 27, సిటీ ఆర్డినరీ 2. జిల్లాల వారీగా టెండర్లు పిలిచిన అద్దె బస్సులు శ్రీకాకుళం జిల్లా 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పుగోదావరి 2, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పల్నాడు 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్య 5, నంద్యాల 3, అనంతపురం 8, శ్రీసత్యసాయి జిల్లా 11. బస్సు రూట్లు, టెండరు నిబంధనల కోసం సంప్రదించాల్సిన ఆర్టీసీ వెబ్సైట్: https:// apsrtc.ap.gov.in -
హంద్రీ–నీవా సామర్థ్యం పెంపునకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులతో కృష్ణా నదికి వరద ప్రవాహం వచ్చే రోజులు తగ్గినందున.. గతం కంటే తక్కువ రోజుల్లో శ్రీశైలం నుంచి హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వర్షాభావ ప్రాంతమైన రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో –4.806 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు హంద్రీ–నీవా ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 2,450 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచబోతోంది. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా కాలువ విస్తరణ, 8 చోట్ల ఎత్తిపోతలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఈనెల 1న టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. –4.806 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు రూ.2,487.02 కోట్లు, 88 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు చేయాల్సిన పనులకు రూ.2,165.46 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ విధానంలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు నెలాఖరులోగా పనులు అప్పగించి.. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 73 రోజుల్లోనే ఒడిసిపట్టేలా.. శ్రీశైలానికి వరద వచ్చే 120 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించేలా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో హంద్రీ–నీవా పనులు చేపట్టారు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో కృష్ణా నదికి వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. అనేకసార్లు వరద ఒకేసారి గరిష్ట స్థాయిలో వస్తోంది. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టేలా కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం లేకపోవడంతో ఏటా వందలాది టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే 73 రోజుల్లోనే హంద్రీ–నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను తరలించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ప్రధాన కాలువ సామర్థ్యం పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. -
పేదల ఇళ్ల సామగ్రిలో రూ.5,120 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ సామగ్రిలో (మెటీరియల్) రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా గృహ నిర్మాణశాఖ భారీగా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసింది. తొలిదశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు ఇసుకను మినహాయించి మిగతా 12 రకాల మెటీరియల్‌కు రివర్స్ టెండర్లను నిర్వహించగా ఏకంగా రూ.5,120 కోట్ల మేర ఆదా అయింది. సిమెంట్, స్టీలు, డోర్లు, శానిటరీ, పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, టాయిలెట్ సామాన్లు, నీటి సరఫరా తదితర 12 రకాల మెటీరియల్‌కు జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం అనంతరం టెండర్లను ఆహ్వానించడమే కాకుండా అనంతరం రివర్స్ టెండర్లను గృహ నిర్మాణ శాఖ నిర్వహించింది. ఈ రివర్స్ టెండర్లు సత్ఫలితాలనిచ్చాయి. ఐఎస్ఐ మార్కు కలిగిన నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకే లభ్యమయ్యాయి. 12 రకాల మెటీరియల్‌కు ఒక్కో ఇంటికి రివర్స్ టెండర్‌కు ముందు రూ.1,31,676 చొప్పున వ్యయం కానుండగా రివర్స్ టెండర్ల ద్వారా రూ.98,854కే లభించాయి. అంటే ఒక్కో ఇంటికి 12 రకాల మెటీరియల్‌లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. తొలిదశలో నిర్మించనున్న 15.60 లక్షల ఇళ్లను పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.5,120 కోట్లు ఆదా అయింది. లబ్ధిదారుల ఐచ్ఛికమే మన ఇంటికి ఎలాంటి నాణ్యమైన మెటీరియల్ వినియోగిస్తామో పేదల ఇళ్లకు కూడా అలాంటి మెటీరియలే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా నాణ్యమైన మెటీరియల్ తక్కువ ధరకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నాం. 12 రకాల మెటీరియల్‌కు రివర్స్ టెండర్లు నిర్వహించగా ఒక్కో ఇంటి మెటీరియల్‌లో రూ.32,822 చొప్పున ఆదా అయింది. ప్రభుత్వం సరఫరా చేసే నాణ్యమైన, తక్కువ ధరకు దొరికే మెటీరియల్‌ను తీసుకోవాలా వద్దా అనేది ఇళ్ల లబ్ధిదారుల ఇష్టమే. వలంటీర్లు లబ్ధిదారుల వద్దకు వెళ్లి ప్రభుత్వం సరఫరా చేసే మెటీరియల్ వివరాలను తెలియచేస్తారు. లబ్ధిదారులు కోరిన మెటీరియల్ సరఫరా చేస్తాం. 12 రకాల మెటీరియల్‌లో ఒకటి లేదా రెండు కావాలన్నా కూడా అంతవరకే సరఫరా చేస్తాం. ఇది పూర్తిగా లబ్ధిదారుల ఐచ్ఛికమే. ఎక్కడా బలవంతం లేదు. – అజయ్‌జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
ఏపీ గృహ నిర్మాణశాఖ రివర్స్ టెండరింగ్‌తో భారీగా ఆదా
సాక్షి, అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో చేపట్టిన రివర్స్ టెండరింగ్ సత్పాలితాలనిస్తోంది. తాజాగా వెల్లడైన నివేదికల్లో భారీగా ఆదా అయినట్టు గృహ నిర్మాణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం తొలివిడతలో 6500 కోట్ల రూపాయలు మిగలనున్నాయి. ఒక్కో ఇంటి వ్యయంపై రూ.32,821 ఆదా అవుతున్నాయి. ఒక్కో ఇంటికి 14 వస్తువులకు రూ. లక్షా 31 వేల 676 ఖర్చు అవుతుండగా.. రివర్స్ టెండరింగ్‌లో రూ. 88 వేల 854కు భారం తగ్గింది. లబ్ది దారులు కోరుకున్న ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులే ఏపీ ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఉచిత ఇసుక సరఫరాతో కలిపి లబ్ధిదారులకు 6500 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. ఇసుక కాకుండా 14 రకాల వస్తువులపై 5 వేల 120 కోట్ల రూపాయలు ఆదా అవనుంది. చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో 20న మొహర్రం సెలవు -
2 Years YSJagan ane nenu: ‘రివర్స్’లో అదుర్స్
వెబ్‌డెస్క్: సాగునీటి ప్రాజెక్టులంటే అవినీతికి ఆనవాళ్లు అనే పేరు. గత ప్రభుత్వం ఆ నానుడిని నిజం చేసి చూపింది. అవినీతికి కేరాఫ్ అడ్రస్ పోలవరం పనులు అనేట్టుగా మార్చేసింది. ఇకపై కూడా అదే పంథా కొనసాగుతుంది.. ప్రజా ధనాన్ని దోచేసుకుందాం.. అనుకులే వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది జగన్ సర్కారు. పారదర్శకతకు పెద్ద పీట ప్రాజెక్టులు, పనులు, కాంట్రాక్టుల్లో అత్యంత పారదర్శక విధానాన్ని ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అక్రమార్కుల తప్పుడు అంచనాలకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా రివర్స్ టెండరింగ్ ద్వారా రెండేళ్ల కాలంలో రూ. 5,070 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా నిలువరించ గలిగారు. ప్రజా ధనానికి కాపలా జాతీయ ప్రాజెక్టయిన పోలవరంతో రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టి ఇతర సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు మున్సిపల్, విద్య, వైద్య, విద్యుత్, హౌసింగ్, పంచాయతీరాజ్ సహా పలు శాఖల్లో అమలు చేశారు. కాంట్రాక్టుల్లో పారదర్శక విధానాలు అమలు చేయడం ద్వారా భారీగా ప్రజా ధనాన్ని ఆదాచేయగలిగారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలో 26 పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.1824.65 కోట్ల ప్రజాధనాన్ని ఏపీ ప్రభుత్వం ఆదా చేయగలిగింది. ఇళ్ల నిర్మాణంలో రూ. 1203 కోట్లు రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కా గృహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధిక రేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అంతేకాదు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు. అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ దీనిపై దృష్టి సారించారు. ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (టిడ్కో) లో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీంతో గృహనిర్మాణశాఖ (ఏపీ టిడ్కో)లో చేపట్టిన 12 పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 392.23 కోట్ల రూపాయల ఆదా అయ్యింది. మరోవైపు గహనిర్మాణశాఖలో గ్రామీణ ప్రాంతాల్లో 5 పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌టెండరింగ్‌లో రూ.811.32 కోట్లు మిగులు వచ్చేలా చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకదాని వెంట ఒకటి పంచాయితీరాజ్ శాఖకు సంబంధించి 7 పనులకు గాను రివర్స్ టెండరింగ్ నిర్వహించగా రూ.605.08 కోట్ల ప్రజాధనం ఆదా అయింది. ఏపీ జెన్కోలో 4 పనులకు గాను రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.486.46 కోట్ల ప్రజా ధనం పక్కదారి పట్టకుండా ఆపగలిగారు. విద్యాశాఖలో కూడా గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా కాగా వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 పనులుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించగా ఏకంగా రూ. 325.15 కోట్లు ఆదా అయ్యాయి. వైద్యశాఖకు రివర్స్ చికిత్స వైద్య ఆరోగ్య శాఖలో కూడా గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ మెడికిల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎంఎస్ఐడీసీ)లో చేపట్టిన 34 పనులకు రివర్స్ టెండర్లు నిర్వహించారు. వీటి ద్వారా రూ.625.54 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. మొత్తంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.5070.43 కోట్లు ప్రజాధనం ఆదా అయింది. రివర్స్ టెండర్ ఫలితాలు శాఖల వారీగా 1. పోలవరం ప్రాజెక్టు సహా జలవనరులశాఖ : రూ.1824.65 కోట్లు 2. ఏపీ టిడ్కో : రూ.392.23 కోట్లు 3. గృహనిర్మాణశాఖ (రూరల్) : రూ.811.32 కోట్లు 4. పంచాయతీరాజ్‌శాఖ : రూ. 605.08 కోట్లు 5. ఏపీ జెన్కో : రూ. 486.46 కోట్లు 6. విద్యాశాఖ : రూ. 325.15 కోట్లు 7. APMSIDC : రూ. 625.54 కోట్లు ............................................................................................. మొత్తం రూ.5070.43 కోట్లు -
రివర్స్ టెండరింగ్‌లో మరో మైలురాయి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో మరో మైలు రాయి నమోదైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) డిజైన్లలో డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన మార్పుల మేరకు చేపట్టిన అదనపు పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకతను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు చాటి చెప్పింది. మొత్తంగా ఒక్క పోలవరం ప్రాజెక్టు పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లోనే ఖజానాకు రూ.843.53 కోట్లు ఆదా అయినట్లయింది. కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను ప్రభుత్వం అదనంగా చేపట్టడానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను జల వనరుల శాఖ మార్చి 2న జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.683 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూల్‌తోనే జల వనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం తెరిచారు. మేఘా, హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఆర్థిక బిడ్‌లో రూ.676.24 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ గడువు ముగిసే సమయానికి రూ.669.47 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ టెండర్‌ను ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ (రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ) పరిశీలించి, ఆమోదించింది. దాంతో ఈ టెండర్లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. పారదర్శకతకు గీటురాయి ► పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్)ను గోదావరి ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి తీరానికి అవతల కుడి వైపున స్పిల్‌వే నిర్మిస్తున్నారు. ► అత్యంత పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించేందుకు డీడీఆర్పీ ప్రతిపాదనల మేరకు సీడబ్ల్యూసీ పలు డిజైన్లను మార్చింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను కొత్తగా చేపట్టడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టమైన హామీ ఇచ్చింది. ► దీంతో సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు అదనంగా చేపట్టాల్సిన పనులకు రూ.683 కోట్లతో ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక ప్రాజెక్టులో అదనంగా చేపట్టాల్సిన పనులకూ రివర్స్ టెండరింగ్ విధానం పాటించడం పారదర్శకతకు గీటురాయిగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ► 2018 సెప్టెంబర్ 18న చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచినప్పుడు అదనంగా చేపట్టాల్సిన రూ.563.4 కోట్ల విలువైన పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు నామినేషన్‌పై కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ► పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల్లో రూ.7,984.93 కోట్ల విలువైన పనులను టీడీపీ హయాంలో నామినేషన్‌పై అప్పగించడాన్ని ఉదహరిస్తున్నారు. -
రివర్స్ టెండర్స్.. అదుర్స్
సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని రీతిలో విప్లవాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జ్యుడీషియల్ ప్రివ్యూ.. రివర్స్ టెండరింగ్ నిర్ణయం కారణంగా భారీ ఎత్తున ప్రజా ధనం ఆదా అవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తద్వారా ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ.3885.47 కోట్లు ఆదా అయినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. పది లక్షల రూపాయలకు మించి ప్రభుత్వ కొనుగోళ్లు, పనులకు సంబంధించి ఈ విధానాన్ని అమలు చేయాల్సిందిగా 2019లో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీంతో గత ఆర్థిక (2020–21) ఏడాదిలో వివిధ పనులకు సంబంధించి 271 టెండర్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 1,838.67 కోట్ల ప్రభుత్వ ధనం ఆదా అయిందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొనసాగుతున్న పనులతో పాటు కొత్త పనులకు టెండర్ కమ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. పనులకు సంబంధించి తొలుత టెండర్లలో ఎల్–1గా నిలిచిన ఏజెన్సీ కోట్ చేసిన ధరపై తిరిగి రివర్స్ టెండరింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఎల్–1 ఏజెన్సీ కోట్ చేసిన ధర కన్నా తక్కువ కోట్ చేసిన ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లలోనూ ఇదే విధానం – రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల అవసరాలకు వస్తువులు, ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర కొనుగోళ్లకు కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా రివర్స్ టెండరింగ్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. – గత ఆర్థిక ఏడాది (2020–21)లో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సేవలకు సంబంధించి రూ.32,777 కోట్ల విలువగల 45,500 టెండర్లకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేశారు. తద్వారా రూ.2,046.80 కోట్లు ఆదా చేసినట్లు సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. – గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, ఫర్నీచర్, ఫోన్లు, సిమ్ కార్డులు, ఇతర కొనుగోళ్లకు కూడా ఇదే విధానం అమలు చేసినట్లు సర్వే పేర్కొంది. ప్రభ్వుత్వ స్కూళ్లలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు, ఫర్నీచర్, టీవీలు, అల్మారాలు తదితర పరికరాల కొనుగోళ్లకు కూడత్వీ విధానం అమలు చేశారు. – ఎక్కడా టెండర్ల ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ సర్కారు హయాంలో నామినేషన్ దందా – గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముందుగానే ఏ టెండర్ ఎవరికి ఇవ్వాలో నిర్ధారించేసుకుని, వారికి టెండర్ వచ్చేలా నిబంధనలు రూపొందించే వారు. కొన్ని పనులను గత సీఎం చంద్రబాబు చెప్పిన కంపెనీకి టెండర్లు పిలవకుండానే నామినేషన్‌పై కట్టబెట్టేశారు. – నోటి మాటతో, ఎటువంటి పరిపాలన అనుమతులు లేకుండానే నామినేషన్‌పై ఆరీ్టజీఎస్లో టెండర్‌ను కట్టిబెట్టిన వైనం కూడా గత సర్కారు హయాంలో చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నీరు–చెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా 13 వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్‌పై పందేరం చేసింది. – నీరు–చెట్టు అంటే మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వడం.. ఇందుకోసం ఏకంగా రూ.13 వేల కోట్లు ఇవ్వడం అంటే ఇందులో 90 శాతం నిధులను ఆ పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారు. నిపుణుల ప్రశంసలు – గత తెలుగుదేశం ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో అనుసరించిన ఇష్టారాజ్య విధానాలతో రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు, బడా కాంట్రాక్టర్లకు భారీ ప్రయోజనం కలిగింది. – ఇవన్నీ గమనించిన సీఎం వైఎస్ జగన్.. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా టెండర్ ప్రక్రియ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పారదర్శకతను పెంచారు. దీంతో ఖజానాకు ప్రతి పని విషయంలో భారీగా ఆదా అవుతోందని వివిధ రంగాల నిపుణులు ప్రశంసిస్తున్నారు. -
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.5.64 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ పేర్కొన్న మొత్తంతో పోల్చితే.. ఖజానాకు రూ.26.5 కోట్లు ఆదా అయ్యాయి. పెన్నా నది నుంచి వచ్చే వరద జలాలను ఒడిసిపట్టి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 41,810 ఎకరాలకు నీళ్లందించడం, 4,66,521 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా మొత్తం 5,08,331 ఎకరాలను సస్యశ్యామలం చేయడం, 10 లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టడానికి జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే జల వనరుల శాఖ అధికారులు ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమశిల–కండలేరు వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు, సోమశిల నార్త్ ఫీడర్ చానల్ ప్రవాహ సామర్థ్యాన్ని 772 నుంచి 1,540 క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు రూ.1,304.11 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఆ టెండర్లను ఈ నెల 20న తెలుగు గంగ సీఈ హరినారాయణరెడ్డి తెరిచారు. ఈ పనులకు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్స్, రాఘవ కనస్ట్రక్షన్స్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్ మదింపులో ఎంఆర్కేఆర్ సంస్థ అర్హత సాధించలేదు. దాంతో ఆ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను తోసిపుచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరిచారు. రూ.1,324.97 కోట్లకు షెడ్యూల్ కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ మొత్తాన్నే కాంట్రాక్ట్ విలువగా పరిగణించి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.1,298.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి తెలుగు గంగ సీఈ ప్రతిపాదనలు పంపారు. ఈ టెండర్‌ను ఎస్‌ఎల్‌టీసీ లాంఛనంగా ఆమోదించనుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ టెండర్లో అంతర్గత అంచనా విలువతో పోల్చితే ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. -
రివర్స్ టెండరింగ్‌తో చౌకగా సౌర విద్యుత్
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా చౌకగా సౌర విద్యుత్ అందబోతోంది. ఇందుకు సంబంధించిన టెండర్లు బుధవారం ఖరారయ్యాయి. గతంలో రూ.3 వరకు ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఇకపై గరిష్టంగా 2.58కే లభించనుంది. ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని మరో 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా బిల్డ్ ఆపరేట్, ట్రాన్స్ఫర్(బీవోటీ) విధానంలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తొలి విడతలో భాగంగా 6,400 మెగావాట్లకు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. పూర్తి పారదర్శకంగా న్యాయ సమీక్ష చేపట్టిన కార్పొరేషన్.. రివర్స్ టెండరింగ్ కూడా చేపట్టి అతి తక్కువకు విద్యుత్ ఇచ్చే సంస్థలను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని పది ప్రాంతాలకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థల వివరాలను గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బుధవారం మీడియాకు విడుదల చేసింది. -
ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీని నియమించింది. కమిటీ వీసీగా జేసీ (అభివృద్ధి), మెంబర్ కన్వీనర్‌గా గృహనిర్మాణ జిల్లా స్థాయి అధికారి.. సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్, కార్మిక, గనుల శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ -
‘సుజల స్రవంతి’ టెండర్లలో 17.5 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం రెండో దశలో రెండు ప్యాకేజీల పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.17.50 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి ప్యాకేజీ పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం) కంటే 0.24 శాతం తక్కువకు వీపీఆర్–పయనీర్–హెచ్‌ఈఎస్ (జేవీ), రెండో ప్యాకేజీ పనులను 0.67 శాతం తక్కువకు గాజా–ఎన్సీసీ(జేవీ) సంస్థలు దక్కించుకున్నాయి. టెండర్ ప్రక్రియపై పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి నివేదిక పంపారు. ఈఎన్సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ సోమవారం సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలన అనంతరం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత పనులు దక్కించుకున్న ఆ సంస్థలకు వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. భారీ మొత్తంలో ఆదా పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. వద్ద నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 63.50 టీఎంసీల నీటిని తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో రూ.2,022 కోట్లతో పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఇదే పథకంలో రెండో దశ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో చేపట్టిన గ్రావిటీ కెనాల్లో 3.150 కి.మీ. నుంచి 23.200 కి.మీ. వరకూ కాలువ తవ్వకం, పాపయ్యపాలెం ఎత్తిపోతలతోపాటు 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ లిఫ్ట్ కెనాల్ పనులకు మొదటి ప్యాకేజీ కింద రూ.2,512.96 కోట్ల ఐబీఎంతో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. రూ.2558.20 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.24 శాతం తక్కువకు అంటే రూ.2,507.04 కోట్లకు కోట్ చేసిన వీపీఆర్–పయనీర్–హెచ్‌ఈఎస్(జేవీ) సంస్థ ఎల్–1గా నిలిచింది. దాంతో మొదటి ప్యాకేజీలో ఖజానాకు రూ.5.93 కోట్లు ఆదా అయ్యాయి. లిఫ్ట్ కెనాల్ 40 కి.మీ. నుంచి 102 కి.మీ. వరకూ చేపట్టే పనులకు రెండో ప్యాకేజీ కింద రూ.1,722.39 కోట్ల ఐబీఎంతో టెండర్ పిలిచింది. ఈ టెండర్లో ఆర్థిక బిడ్‌ను శనివారం అధికారులు తెరిచారు. 1,763.73 కోట్లకు కోట్ చేసిన సంస్థ ఎల్–గా నిలిచింది. అదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఐబీఎం కంటే 0.67 శాతం తక్కువకు అంటే రూ.1,710.82 కోట్లకు కోట్ చేసిన గాజా–ఎన్సీసీ (జేవీ) పనులను దక్కించుకుంది. దాంతో ఖజానాకు రూ.11.57 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో ఎల్–1గా నిలిచిన సంస్థ కోట్ చేసిన ధరలతో పోల్చితే.. మొదటి ప్యాకేజీలో రూ.51.16 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.52.91 కోట్లు వెరసి రూ.104.07 కోట్లు ఆదా అయ్యాయి. -
పేదల ఇళ్లలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ఎన్నో ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్న సొంతింటి కల త్వరలో సాకారం కానుంది. రెండేళ్లలో పేదల కోసం ప్రభుత్వం 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,080 కోట్లతో 15.60 లక్షల ఇళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న 224 చదరపు అడుగులకు బదులుగా ప్రస్తుతం కొత్తగా చేపట్టనున్న ఇళ్లను 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న దృష్ట్యా అందుకు అవసరమయ్యే సామగ్రి, ఇతర పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేసేందుకు గృహ నిర్మాణ సంస్థ టెండర్లను ఆహా్వనించిన విషయం తెలిసిందే. స్టీల్, ఆర్సీసీ డోర్లు, విండో ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్, పీవీసీ టాయిలెట్ డోర్, గ్లేజ్డ్ విండో షట్టర్స్, వైట్ లైమ్, పెయింట్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, శానిటరీ, నీటి సరఫరా పరికరాలు, ఏసీ షీట్స్, గాల్వాల్యూమ్ షీట్స్, మైల్డ్ స్టీల్ సెక్షన్స్, ఒరిస్సా పాన్ ఫ్రీ టాప్ సేకరణ కోసం రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా టెండర్లు పిలిచారు. నాణ్యతతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రీ–బిడ్ సమావేశాలు ఈ నెల 2వ తేదీతో ముగియనున్నాయి. మండలాల వారీగా బాధ్యతలు ► నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో టెక్నికల్ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. డివిజనల్ ఇంజనీర్ స్థాయి నుండి అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లకు అవసరమైతే మరికొన్ని మండలాల బాధ్యతలను అప్పగించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు. ► సగం జిల్లాల్లో ఇప్పటికే సిబ్బంది సర్దుబాటు పని పూర్తి చేసి, ఇళ్ల నిర్మాణాలకు సిద్ధమయ్యారు. మరికొంత మందికి పదోన్నతులు కూడా కల్పించారు. పునాదుల కోసం మార్కింగ్ వేయడం మొదలు.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ► ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం పేదల కోసం నిర్మించే ప్రతి ఇంటిలో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, సింటెక్స్ ట్యాంక్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తారు. నాణ్యత పరిశీలనకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే పరికరాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. ► గృహ నిర్మాణ శాఖ అధికారులే కాకుండా ఇతర శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ కమిటీలో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్ – అజయ్ జైన్, ముఖ్యకార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రతి 25 ఇళ్లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం ఒక కమిటీ వేస్తాం. కమిటీ పర్యవేక్షణలోనే ఆ 25 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కొత్తగా నిర్మించే ప్రతి లే అవుట్ వద్ద గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువులను డిస్ ప్లే చేస్తాం. వాటి వివరాలను, ధరలను తెలియజేసే పట్టికనూ అందుబాటులో ఉంచుతాం. నాణ్యతపై ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. -
రూ.కోటి దాటిన ప్రతి లావాదేవీలపై రివర్స్ టెండరింగ్
సాక్షి,విజయవాడ: అవినీతి నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోటి రూపాయలు దాటిన వస్తు, సేవల కొనుగోళ్లకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేపట్టనుంది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా ఆదేశించింది. కోటి రూపాయల విలువదాటిన ప్రతీ లావాదేవీని రివర్స్ టెండరింగ్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ విధానం ద్వారానే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ పనుల్లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. టెండర్ కమ్ రివర్స్ ఆక్షనింగ్ లేదా రివర్స్ టెండర్ల విధానాన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రివర్స్ టెండరింగ్ లో ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. చెల్లింపుల విధానంలోనూ మార్పులు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్కు సూచనలు చేసింది. ఛధవండి: కరోనా బారిన మంత్రి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ -
అవినీతిపై బ్రహ్మాస్త్రం
పై స్థాయిలో 50 శాతం అవినీతిని నిర్మూలించాం. మిగిలిన స్థాయిల్లో ఉన్న 50 శాతం అవినీతిని నిర్మూలించాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలి. టీటీడీతో సహా అన్ని విభాగాలు టెండర్ విలువ కోటి రూపాయలు దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కేసుల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో చట్టం చేసేందుకు వీలుగా బిల్లు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కేసుల విచారణ 25 ఏళ్లుగా సాగుతోందంటే.. అవినీతి కేసుల విషయంలో సీరియస్‌గా లేమనే సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఉండకూడదని, కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ‘గత ఏడాది నవంబర్‌లో అవినీతికి సంబంధించి కాల్ సెంటర్ 14400 ప్రారంభించాం. ఇప్పటి వరకు 44,999 కాల్స్ వచ్చాయి. ఇందులో అవినీతికి సంబంధించిన అంశాలు 1,747 కాగా..1,712 పరిష్కరించాం. 35 పెండింగ్‌లో ఉన్నాయి’ అని అధికారులు వివరించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుల మానిటరింగ్ బలంగా ఉండాలి ► 1902 నంబర్‌ను ఏసీబీతో (14400) అనుసంధానం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి అవినీతిపై వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలి. ఫిర్యాదులను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. దీనికి కలెక్టర్ కార్యాలయాలను కూడా అనుసంధానం చేయాలి. ► టౌన్ ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎంపీడీఓ, టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు ఉండకూడదు. దీనిపై అవినీతికి ఆస్కారం లేని విధానాలతో మనం ఫోకస్‌గా ముందుకు వెళ్లాలి. అవినీతికి పాల్పడాలంటే భయపడే పరిస్థితి రావాలి. ► 14400 నంబర్‌పై మరింత ప్రచారం నిర్వహించాలి. పర్మినెంట్ హోర్డింగ్స్ పెట్టాలి. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికీ ఇదీ తేడా ► కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పట్లో ఎకరాకు కంపెనీ చెల్లించే మొత్తం రూ.2.5 లక్షలు మాత్రమే. మన ప్రభుత్వం సంప్రదింపులు జరిపి, ఆ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. దీని వల్ల అదనంగా రూ.119 కోట్ల ఆదాయం వస్తోంది. ► సోలార్/విండ్ కింద ఉత్పత్తి చేసే 1550 మెగావాట్ల ఉత్పత్తికి గాను మెగావాట్‌కు రూ.1 లక్ష చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.15.5 కోట్ల చొప్పున 28 ఏళ్లలో రూ.322 కోట్లు ప్రభుత్వానికి వస్తాయి. ► రివర్స్ పంపింగ్ ద్వారా ఉత్పత్తి చేయనున్న 1680 మెగావాట్ల కరెంట్‌కు సంబంధించి.. మెగావాట్‌కు మొదటి పాతికేళ్లలో రూ.లక్ష, తద్వారా ఏడాదికి రూ.16.8 కోట్లు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.33.6 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.2,940 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే కంపెనీతో సంప్రదింపుల కారణంగా రూ.3,381 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నా. ► భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం 2703 ఎకరాలను కేటాయిస్తే.. అదే కంపెనీతో ఈ ప్రభుత్వం సంప్రదింపులు జరపగా, 2203 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఒప్పుకుంది. తద్వారా 500 ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగిలింది. ఎకరాకు రూ.3 కోట్లు వేసుకున్నా రూ.1500 కోట్లు మిగిలినట్లే. 788 పనులకు రివర్స్ టెండరింగ్ ► ‘మొత్తంగా 788 పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని, సాధారణ టెండర్ల ప్రక్రియ ద్వారా 7.7 శాతం మిగులు ఉండగా, రివర్స్ టెండరింగ్ ద్వారా 15.01 శాతం మిగులు ఉందని అధికారులు వివరించారు. ► రూ.100 కోట్లు దాటిన ఏ ప్రాజెక్టుకైనా జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాం. 2019 ఆగస్టు నుంచి 2020 ఆగస్టు వరకు రూ.14,285 కోట్ల విలువైన 45 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లాయి’ అని అధికారులు తెలిపారు. సీఎంకు అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక ► అవినీతిని నిరోధించడానికి సంబంధించి గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గుడ్ గవర్నెన్స్‌పై ప్రతిష్టాత్మక సంస్థ అహ్మదాబాద్ ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి సమీక్షకు ముందు సీఎం జగన్‌కు నివేదిక సమర్పించారు. ► ఎమ్మార్వో, ఎంపీడీఓ, సబ్ రిజిస్టార్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను యూనిట్‌గా తీసుకుని, సిబ్బంది విధులు, బాధ్యతల్లో స్పష్టత ఇవ్వడంతో పాటు, అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ► ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
'సీమ' ఎత్తిపోతల టెండర్ 19న ఖరారు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రూ.3,307.07 కోట్లకు సుభాష్ ప్రాజెక్ట్స్ మాన్యుఫాక్చరర్స్ లిమిటెడ్ (ఎస్పీఎంఎల్) జాయింట్ వెంచర్ (జేవీ) దక్కించుకుంది. ఈ పనుల టెండర్లో ‘ప్రైస్’ బిడ్‌ను సోమవారం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి తెరిచారు. అంతర్గత అంచనా విలువ రూ.3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు (రూ.3,340.47 కోట్లు) కోట్ చేసిన సంస్థ ఎల్–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించారు. రివర్స్ టెండరింగ్‌లో 0.88 శాతం అధిక ధర (రూ.3,307.07 కోట్లు)కు కోట్ చేసిన ఎస్పీఎంఎల్ (జేవీ) సంస్థ ఎల్–1 నిలిచింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి పంపుతామని, కమిటీ అనుమతి మేరకు ఈ నెల 19న టెండర్ ఖరారు చేసి వర్క్ ఆర్డర్ జారీ చేస్తామని సీఈ మురళీనాథ్‌రెడ్డి చెప్పారు. కరువును రూపుమాపే లక్ష్యంతో.. ► శ్రీశైలం జలాశయంలో వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కరువును రూపుమాపాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ► శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎత్తిపోసి.. తెలుగు గంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. -
‘బాబు 104, 108లను నిర్వీర్యం చేశాడు’
సాక్షి, విజయవాడ: 104, 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో 104, 108లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 108, 104 వాహనాల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అనవసరపు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలతో దేశం మొత్తం ఆంద్రప్రదేశ్ వైపు చూస్తోందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 108లు మూలన పడ్డాయని, అవి సరిగ్గా పని చేయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 108, 104 వాహనాల కొనుగోలు విషయంలో రివర్స్ టెండరింగ్ ద్వారా అత్యంత పారదర్శకంగా వ్యవహారించిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుజాతరావు కమిటీ సిఫార్సుల మేరకు 108,104 వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. 2019 జూన్‌లో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) చంద్రబాబు హయాంలో కాలయాపన కమిటీలు చాలా చూశామని కానీ, సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కమిటీ ఏర్పాటు చేశారని ఆళ్ల నాని చెప్పారు. 676 మండలాల్లో 108, 104 నూతన వాహనాలు తీసుకువచ్చారని చెప్పారు. గతంలో 108 వాహనాలు చిన్నపాటి రిపేర్లు వచ్చినా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. 332 పాత 108 వాహనాలు ఉన్నాయని అదనంగా 432 నూతన వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. అదే విధంగా 676 కొత్త 104 వాహనాలు తీసుకున్నామని తెలిపారు. సర్వీసు ప్రొవైడర్ విషయంలో అరబిందో ఫౌండేషన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనవరి నెలలో రివర్స్ టెండరింగ్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు దక్కిందని రూ. 2,04 074 కోట్ చేశారని తెలిపారు. 28 వాహనాలకు రూ.1,78,072 ఆదా చేశామని తెలిపారు. రివర్స్ టెండర్ ద్వారా మొత్తం రూ.180 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. (‘చంద్రబాబు జీవితంలో మారడు’) నవంబర్ 21 నాడు టెండర్లు పిలిచామని ఎంకేపీ, అరబిందో ఫార్మా సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. బీవీజీ కంపెనీ సమయంలో 1068 మంది పైలెట్లు ఉండేవారని పైలెట్‌కు 10 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకు 12 వేలు జీతం ఇచ్చారని చెప్పారు. పాత వాహనాల్లో రూ.10 వేలు నుంచి రూ.28వేలు వరకు 1690 మంది పైలెట్లకు జీతాలు పెంచామని తెలిపారు. పాత వాహనాల్లో టెక్నిషియన్లకు రూ.12వేలు నుంచి రూ. 30వేలకు పెంచామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవరించిందని తెలిపారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత రూ.9 పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని చెప్పారు. 1800 వాహనాలు కొనుగోలు చేశామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ఉన్నత ఆశయంతో సీఎం వైఎస్ ప్రభుత్వం 16 మెడికల్ ఆస్పత్రులను తీసుకురాబోతోందని తెలిపారు. మహాప్రస్థానం పేరుతో సేవలందిస్తున్న వాహనాలు టీడీపీ తన ఖాతాలో వేసుకుంటుందని మండిపడ్డారు.