సాక్షి, నెల్లూరు: రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. పోలవరం రివర్స్ టెండర్లలో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. టీడీపీ హయాంలో టెండర్ పొందిన రిత్విక్ సంస్థ వెలుగొండ రివర్స్ టెండరింగ్‌లో తక్కువకే టెండర్ వేసిందని పేర్కొన్నారు. నిధులు ఆదా చేసిన ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు అభినందించాలన్నారు. రివర్స్ టెండరింగ్ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసునన్నారు. మంచి మనసున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment