
సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం పూర్తిగా విజయవంతమైంది. పంచాయతీ రాజ్ శాఖలో రివర్స్ టెండరింగ్ విధానంతో గ్రామ సచివాలయ కంప్యూటర్ పరికరాల కొనుగోలులో ప్రజాధనాన్ని ఆదా చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డెస్క్‌టాప్ కంప్యూటర్లు, సీపీయూ కొనుగోలులో రూ. 51.15 కోట్లను ఆదా చేశామన్నారు. ప్రింటర్ల కొనుగోలు టెండర్లలో రూ. 14.32 కోట్లను కలిపి మొత్తంగా రూ. 65.47 కోట్లను ఆదా చేసినట్లు ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ డబ్బులతో సంక్షేమ పథకాల అమలు చేపట్టవచ్చన్నారు.