Panchayat Raj Department
-
పంచాయతీరాజ్‌లో భారీగా బదిలీలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పంచాయతీరాజ్ శాఖలోని కీలకస్థానాల్లో ఉన్న దాదాపు 200మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు అయినా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో మొత్తం 12 జీవోలను జారీ చేస్తూ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ప్రతిపాదనలు కొనసాగుతుండగా.. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవో స్థానాల్లో ప్రభుత్వం కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.రాష్ట్రంలో మొత్తం 26 విభజిత జిల్లాలు ఉండగా.. అందులో 25 జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు)గా, 22 జిల్లాల్లో డ్వామా పీడీలుగా కొత్త వారిని నియమించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో వివిధ స్థాయిల్లో ఇద్దరు డీఎల్డీవోలను నియమించింది. ఏడు జిల్లాలో డీఆర్డీఏ అధికారులుగా కొత్తవారిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరు కాకుండా రాష్ట్రమంతటా వివిధ ప్రాంతాల్లో పనిచేసే 49 మంది డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల(డీఎల్డీవో)ను బదిలీ చేసింది. ఇంజనీరింగ్ శాఖలో..పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో పలువురు ఇంజనీరింగ్ అధికారులకు పదోన్నతులు కల్పించడంతో పాటు భారీగానే బదిలీలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ల (ఎస్ఈ)కు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)గా పదోన్నతులు కల్పించి, ఒకరిని ఈఎన్సీ కార్యాలయంలోనూ, మరొకరిని రాష్ట్ర సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోనే 12 మంది ఈఈలకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు (ఎస్ఈ)గా పదోన్నతులు కల్పించి, వారిలో తొమ్మిది మందిని వివిధ జిల్లాల ఎస్ఈలుగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. వీరితో పాటు 26 మంది ఈఈలను కూడా బదిలీ చేసింది. మరో ఆరుగురు డిప్యూటీ ఈఈలకు ఈఈలుగా పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్డబ్ల్యూఎస్లోనూ ముగ్గురు ఎస్ఈలు, ఎనిమిది మంది ఈఈలను వేర్వేరు స్థానాల్లో ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖలో 13 మందికి స్థానచలనంఅటవీ శాఖలో 13 మంది రాష్ట్ర కేడర్ అధికారులు బదిలీ అయ్యారు. మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డిప్యూటీ కన్సర్వేటర్గా పనిచేస్తున్న ఎం.శామ్యూల్‌ను అనకాపల్లి డీఎఫ్‌వోగా, కృష్ణాజిల్లా డీఎఫ్‌వోగా ఉన్న కె.రాజశేఖరరావును ప్రకాశం సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌వోగా బదిలీ చేశారు. మరికొందరు డీఎఫ్‌వోలను బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వాణిజ్యపన్నుల శాఖలో... వాణిజ్యపన్నుల శాఖలో కమిషనర్‌గా ఉన్న కె.రవిశంకర్‌కు చీఫ్ కమిషనర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, మరో కమిషనర్ డి.రమేష్‌కు విజయవాడ అప్పిలేట్ అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ముగ్గురు అడిషనల్ కమిషనర్లతోపాటు ఏడుగురు జేసీలు, 14 డీసీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఆరి్థక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.అర్ధరాత్రి కూడా బదిలీల తంతు బదిలీలకు ఆదివారం ఆఖరి రోజు కావడంతో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. జోన్–1 పరిధిలో 124 మందిని బదిలీ చేస్తూ రెండు ఉత్తర్వులు, పెద్ద ఆలయాల్లో ఆరుగురు ఇంజనీరింగ్ అధికారుల బదిలీకి సంబంధించి ఒక ఉత్తర్వు ఇచ్చారు. -
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిసింది. మల్టీజోన్-1లో 84, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెవెన్యూ శాఖలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
గ్రామీణ రహదారులకూ మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండే (హై ఇంపాక్ట్) మరో 202 రోడ్లను రూ.784.22 కోట్లతో పూర్తిస్థాయిలో మరమ్మతులతోపాటు పునర్నిర్మాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాల్లో 1,035 కిలోమీటర్ల మేర ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో 258 రోడ్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ఉండగా.. వాటిలో 56 రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం గతంలోనే అనుమతులు ఇవ్వగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 202 రోడ్ల పునర్నిర్మాణ పనుల కోసం పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ షురూ! ఈ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టినట్టు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ బాలు నాయక్ తెలిపారు. 14 రోజుల పాటు టెండర్ల దాఖలుకు గడువు ఉంటుందని.. నవంబర్ నెలాఖరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలోనే ఆయా రోడ్ల పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. కాగా.. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో గుర్తించిన హై ఇంపాక్ట్ కేటగిరీ రోడ్లకు ప్రభుత్వం ఆ శాఖ ఆధ్వర్యంలో అనుమతులు మంజూరు చేసింది. ఆ పనులు కూడ మొదలైనట్టు అధికారులు వెల్లడించారు. -
ఏకరూప పంచాయతీలపై కసరత్తు!
సాక్షి, అమరావతి: ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలపై విధాన నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని పంచాయతీలలో ఏకరూపత సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. కనీస నిర్ణీత జనాభా సంఖ్య ఆధారంగా దేశమంతటా గ్రామ పంచాయతీలను పునర్విభజన జరిపే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో తీరుగా.. ఒకే రాష్ట్రంలోనూ వేర్వేరు పంచాయతీలలో ఉండే జనాభా సంఖ్య మధ్య ఊహించని స్థాయిలో వేల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట 15 వేల నుంచి 20 వేల జనాభా ఉండే ఓ పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంటే.. కొన్నిచోట్ల 500 జనాభా ఉండే గ్రామం మరో పంచాయతీగా ఉంటోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 13,300కి పైగా గ్రామ పంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీ సరాసరి జనాభా 2,800 వరకు ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్కడ ఒక్కో పంచాయతీలో 20 వేలకు పైనే.. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో సరాసరి జనాభా 20 వేలకు పైబడి ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో అతి చిన్న గ్రామ పంచాయతీలో సైతం 10 వేలకు తక్కువ జనాభా ఉండదని చెబుతున్నారు. మన రాష్ట్రంలో వందలోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు సైతం ఉండగా.. 30 వేల జనాభా గల గ్రామాలు కూడా పంచాయతీలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిన కనీస ఓ నిర్ధిష్ట జనాభా సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలను పునర్విభజన చేయడం ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలోనూ మెరుగైన, సమర్థవంతమైన పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న దానిపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. నేడు, రేపు వర్క్‌షాప్ చాలా రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన కొనసాగుతోంది. కానీ ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని తేవడం వంటి స్థానిక సంస్థల స్థాయిలో పరిపాలనకు సంబంధించి అనేక అంశాలపై అవసరమైతే చట్ట సవరణలు తెచ్చేందుకు సోమ, మంగళవారాల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మన రాష్ట్రం నుంచి 9 మంది, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 261 మంది హాజరవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రెండు విడతలకోసారి రోటేషన్ పద్ధతిన రిజర్వేషన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అంశాన్ని వర్క్‌షాప్ అజెండాలో చేర్చారు. -
పంచాయతీరాజ్‌లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) గా, మరో 167 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు. కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్మెంట్ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి ఆమోదం తెలిపారు. ఈవోపీఆర్డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్న సీఎం.. లబ్ధిదారులు తొలి విడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనది, ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోంది. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలి. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదు. అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.‘‘స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం అన్నది చాలా కీలకం. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
జీవో ఆర్టీ ప్రామాణికమా లేక మెమోనా?
సాక్షి, హైదరాబాద్: సర్విసుల రెగ్యులరైజేషన్ ప్రక్రియపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో (జేపీఎస్) ఆందోళన వ్యక్తమౌతోంది. ఉద్యోగాలు క్రమబద్ధీకరించేందుకు ఐదేళ్ల కిందట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఆర్టీ ప్రామాణికమా? లేక తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన మెమో ప్రామాణికమా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసి మూల్యాంకనం చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తాజాగా జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో ఒక కమిటీని నియమిస్తూ మెమోను జారీచేశారు. వివిధ అంశాల ప్రాతిపదికన... ఆయా విధుల నిర్వహణకు అనుగుణంగా వందమార్కులు కేటాయించి, నాలుగేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌ల పనితీరు మదింపు ఆధారంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. జీవో ఆర్టీలో ఏముంది? జిల్లా ఎంపిక కమిటీల ద్వారా జేపీఎస్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించి 2018 ఆగస్టు 30న అప్పటి పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో ఆర్టీ నెంబర్ 617ను జారీచేశారు. ప్రభుత్వం జేపీఎస్‌ల పోస్టులను మంజూరు చేసినందున, మూడేళ్ల సర్విసు పూర్తిచేసుకున్నాక సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన జేపీఎస్‌లను గ్రేడ్–4 పంచాయతీ సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. అయితే వీరి క్రమబద్ధికరణను పరిగణనలోకి తీసుకునేందుకు జేపీఎస్‌ల మూడేళ్ల సర్విసు కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత మార్చినెలతో వారి నాలుగేళ్ల సర్విసు కూడా పూర్తయ్యింది. క్రమబద్ధికరణ ప్రక్రియ మాత్రం మొదలుకాలేదు. దీంతో జేపీఎస్‌లు నిరవధిక సమ్మెకు దిగి 16 రోజుల తర్వాత విర మించుకున్నారు. జేపీఎస్‌లు విధుల్లో చేరేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నపుడే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పలేదని, మెరుగైన పనితీరు ఆధారంగా నిపుణుల కమిటీ నివేదిక మేరకు జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టంచేసింది. కొన్నిరోజుల తరువాత జేపీఎస్‌ల సర్విసులను క్రమబద్ధిక రించే చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. సీఎస్ దృష్టికి... ఈ నేపథ్యంలో తాజాగా పీఆర్ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో నేపథ్యంలో జేపీఎస్‌ల విధులు, బాధ్యతల పట్ల ఏమాత్రం సంబంధం లేని జిల్లా ఎస్పీలు, జిల్లా అటవీ అధికారులతో మూల్యాంకనం చేయించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. వివిధ విభాగాల పీఆర్ ఉద్యోగులు, సంఘాలు సైతం ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల గురించి త్వరలోనే సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉద్యోగ సంఘాలున్నాయి. -
సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పర్వతగిరి: సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నారంషరీఫ్‌లోని హజ్రత్‌సయ్యద్ యాకూబ్‌షావలీ దర్గాలో మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వేర్వేరుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని, ఈ పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంచారని వివరించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 36 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్ పాల్గొన్నారు. పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక శోభ తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కల్లెడ, బూర్గుమల్ల గ్రామాల మధ్య స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఆలయానికి కర్నాటకకు చెందిన మనోజ్‌రావు రూ.10 లక్షల విరాళం అందించనున్నట్లు ఆర్డీఎఫ్ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ రతన్‌రావు, ఏకాంతంగౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్‌రెడ్డి, బూర్గుమల్ల సర్పంచ్ ఏడుదొడ్ల ఇందిరాజితేందర్‌రెడ్డి, కల్లెడ సర్పంచ్ కొంపెల్లి శోభాపరమేశ్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
1,650 జనాభా ఉన్న గ్రామంలోనే 270 మందికి పింఛన్లా!
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 1,650 మంది (448 ఇళ్లు) జనాభా ఉన్న గుంటూరు జిల్లా చింతలపూడిలో 252 మందికి నెలనెలా పింఛన్లు ఇస్తోందని అధికారులు తెలపడంతో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల సమీక్షతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన మంగళవారం రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తాడేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలును స్వయంగా పరిశీలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వే, స్వమిత్వ కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల పరిధిలోని ఉండే ఇళ్లకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చే ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన 15వ ఆర్థికసంఘం నిధుల వినియోగంపై ఆరా తీశారు. పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టిన అనంతరం ప్రస్తుతం పంచాయతీ ఖాతాలో ఇంకా రూ.3.89 లక్షలు ఆర్థికసంఘ నిధులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులను కేవలం సీసీ రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా గ్రామంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు పెట్టాలని చంద్రశేఖర్‌కుమార్ సూచించారు. పంచాయతీపై భారం లేకుండా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపిందని చెప్పారు. డిజిటల్ ల్రైబరీల ఏర్పాటు ద్వారా గ్రామంలోని పేద విద్యార్థులు, నిరుద్యోగులు సైతం ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పోటీపరీక్షలకు సమర్థంగా ప్రిపేరయ్యే అవకాశం ఉంటుందని ఆయన మెచ్చుకున్నారు. అనంతరం ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో పర్యటించి అక్కడ అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి, అదనపు కమిషనర్ సుధాకర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, గుంటూరు జెడ్పీ సీఈవో మోహనరావు, డీపీవో కేశవరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్, దుగ్గిరాల తహశీల్దార్ మల్లేశ్వరి, చింతలపూడి సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు. -
Telangana: జేపీఎస్... హ్యాపీస్
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. జేపీఎస్‌ల సర్వీసును పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ/డీసీపీ సభ్యులుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయిలో ఒక కార్యదర్శి స్థాయి లేదా హెచ్ఓడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీలు పంపించిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమి టీ పరిశీలిస్తుంది. అనంతరం సీఎస్‌కు నివేది కను పంపిస్తుంది. దాని ఆధారంగానే క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తాత్కాలిక జేపీఎస్‌ల స్థానంలో... రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియను క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో ఎర్రబెల్లి, హరీశ్ భేటీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీశ్‌తో కలసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సచివాలయంలో తొలుత సీఎస్ ఎ.శాంతికుమారితో, ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వ్యవహరిస్తున్నారు’అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించినందుకు సీఎంకు కృతజ్ఞతలు, జేపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శకాల రూపకల్పనపై మంగళవారం సైతం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. సీఎంకు రుణపడి ఉంటాం: జేపీఎస్ ఫెడరేషన్ తమ సర్వీసుల క్రమబద్ధీకరణ దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలంగాణ జూనియర్ పంచాయతీ సెట్రకరీ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని, జాతీయస్థాయిలో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తెచ్చేలా నిర్విరామంగా కృషి చేస్తామన్నారు. మరోవైపు సీఎం నిర్ణయం శుభపరిణామమని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
జేపీఎస్‌ల సమ్మె ఉధృతం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్/ఓపీఎస్) సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ సర్వీసు రెగ్యుల రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపిన జేపీఎస్‌లు, ఇకముందు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. వినూత్న పద్ధతుల్లో నిరసనలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తుల నుంచి వీరికి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ఓ మహిళా జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన ఉద్యోగం ఇక పర్మినెంట్ కాదనే బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్‌లు చెబుతున్నారు. ఇదిలాఉండగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన కార్యక్రమాలు వరుసగా 15వ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి, ర్యాలీ తీసి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు. కాగా 15 రోజులుగా జేపీఎస్‌లు విధులకు గైర్హాజరు అవుతుండటంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. తొమ్మిది వేల మందికిపైగా సమ్మెలోనే.. రాష్ట్రంలోని మొత్తం 12,769 పంచాయతీలకు గాను మూడువేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు (పర్మినెంట్ ఉద్యోగులు) ఉన్నారు. మిగతా 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్‌లు, వెయ్యిమంది దాకా ఓపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. గతనెల 11వ తేదీతో దాదాపు 6వేల మంది జేపీఎస్‌లు నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియపై ప్రభుత్వపరంగా ఎలాంటి కసరత్తు మొదలెట్టకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటు గత నెల 28 నుంచి సమ్మె ప్రారంభించారు. వీరితో పాటు మిగతా జేపీఎస్‌లు, ఓపీఎస్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. టర్మినేషన్ హెచ్చరికలు బేఖాతర్.. గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో అయిదారు వందల మంది జేపీఎస్‌లు తిరిగి విధుల్లో చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో పలువురు తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జేపీఎస్‌ల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేకపోవడం, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే చట్ట, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఉద్దేశంతో సమ్మె చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కీలక విధులు నిర్వర్తించే కార్యదర్శులపై ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు వ్యతిరేకతకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఏ హామీ లభించినా సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేపీఎస్‌లు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం గోదావరిలో దిగి నిరసన తెలుపుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. అనంతరం భద్రాద్రి రామయ్యకు వినతిపత్రం సమర్పించారు. – భద్రాచలం అర్బన్ అన్ని పనులకూ వారే.. గ్రామాల్లో దాదాపు అన్ని పనులు పంచాయతీ కార్యదర్శుల ద్వారానే జరుగుతుంటాయి. రోజువారీ పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత పనులన్నీ పర్యవేక్షిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు, మ్యుటేషన్ల జారీ వంటి అనేక విధులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సమ్మెతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. జేపీఎస్‌ల స్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్లు, సెర్ప్ సిబ్బంది, ఇతర గ్రామ స్థాయిల్లోని కాంట్రాక్ట్, ఇతర విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. మరోపక్క ఉద్యోగ ఆందోళనతోనే జేపీఎస్ సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. జేపీఎస్, ఓపీఎస్లు ఆత్మస్థైర్యం కోల్పోయి తీవ్రమైన చర్యలకు దిగొద్దని తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సోని ఆత్మహత్య దురదృష్టకరమని, ఆమె మొన్నటి దాకా సమ్మెలో పాల్గొని మళ్లీ ఉద్యోగంలో చేరిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ తెలిపింది. జేపీఎస్‌ల డిమాండ్లు ఇవీ.. – సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలి. – నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలి. – ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా ప్రమోట్ చేయాలి. – వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్గా పరిగణించి పర్మినెంట్ చేయాలి. -
27 ఉత్తమ పంచాయతీలకు రాష్ట్రస్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 27 గ్రామ పంచాయతీలను రాష్ట్రస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే వేడుకల్లో ఆయా పంచాయతీలకు పురస్కారాలను అందజేస్తారు. పరిపాలనలో కొన్ని అంశాల్లో గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యంగ సవరణ అమల్లోకి వచ్చిన సందర్భంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున ప్రతి పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చిస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో 26 జిల్లాల్లోను ఆ జిల్లా పరిధిలో కూడా తొమ్మిది ప్రధాన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడేసి పంచాయతీల చొప్పున 27 పంచాయతీలకు జిల్లాస్థాయి పురస్కారాలు పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలకు సూచించింది. 30 ఏళ్లు పూర్తి.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని కార్యక్రమం 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించనుంది. మధ్యప్రదేశ్‌లోని రేవ గ్రామ పంచాయతీలో జరిగే జాతీయ పంచాయతీరాజ్ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర బాధ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ప్రధాని కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రత్యక్ష ప్రసారానికి అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శులకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఎకనమిక్ అడ్వయిజర్ బిజయకుమార్ బెహరా లేఖ రాశారు. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికైన గ్రామాలు.. విభాగాల వారీగా (బ్రాకెట్లో ఆ పంచాయతీ ఉన్న మండలం, జిల్లా పేరు) పేదరిక నిర్మూలన–ఉపాధి అవకాశాలు కల్పన 1. గంగిరెడ్డిపల్లి (వీఎన్‌పల్లి, వైఎస్సార్), 2. రాచర్ల (రాచర్ల, ప్రకాశం), 3. మల్లూరు (ముత్తుకూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు) హెల్దీ పంచాయతీ 1. తరువ (దేవరపల్లి, అనకాపల్లి) 2. భీమవరం (హుకుంపేట, అల్లూరి సీతారామరాజు), 3. నడింపాలెం (పత్తిపాడు, గుంటూరు) చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. కసిపాడు (పెదకూరపాడు, పల్నాడు), 2. నేలమూరు (పెనుమట్ర, పశ్చిమగోదావరి), 3. కుంతముక్కల (జి.కొండూరు, ఎన్టీఆర్) వాటర్ సఫిషియెంట్ పంచాయతీ 1. ఇల్లూరు కొత్తపేట (బనగానపల్లి, నంద్యాల), 2. వి.వి.కండ్రిక (కోడూరు, అన్నమయ్య), 3. ధూపాడు (త్రిపురాంతకం, ప్రకాశం) క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ 1. కడలూరు (తడ, తిరుపతి), 2. బిల్లనందూరు (కోటనందూరు, కాకినాడ), 3. జోగింపేట (సీతానగరం, పార్వతీపురం మన్యం) సెల్ప్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ 1. నందిగాం (నందిగాం, శ్రీకాకుళం), 2. కట్టకిందపల్లి (అనంతపురం రూరల్, అనంతపురం), 3. సూరప్పగూడెం (భీమడోలు, ఏలూరు) సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ 1. వెస్ట్ పెద్దివారిపాలెం (యద్దనపూడి, బాపట్ల), 2. మందగేరి (ఆదోని, కర్నూలు), 3. రామభద్రాపురం (రామభద్రాపురం– విజయనగరం) పంచాయతీ విత్ గుడ్‌గవర్నెన్స్ 1. సఖినేటిపల్లిలంక (సఖినేటిపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ), 2. నగరపాలెం (భీమునిపట్నం, విశాఖపట్నం), 3. చోరగుడి (పమిడిముక్కల, కృష్ణా) ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ 1. మేడాపురం (సీకేపల్లి, శ్రీసత్యసాయి), 2. జేగురపాడు (కడియం, తూర్పు గోదావరి), 3. మార్టూరు (అనకాపల్లి, అనకాపల్లి) -
గ్రామాల్లో రీసైక్లింగ్ రోడ్లు.. సేకరించే ప్లాస్టిక్ చెత్తతో రహదారులు
గ్రామాల్లో సిమెంట్, తారు రోడ్లను మాత్రమే ఇప్పటివరకు చూశాం. ఇకపై ప్లాస్టిక్ రోడ్లనూ చూడబోతున్నాం. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన ఏపీ సర్కారు.. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించింది. వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అర్థాన్ని.. ప్రయోజనాన్ని చేకూర్చేలా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి అనువుగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. సిమెంట్ పరిశ్రమల్లో వినియోగించే విధంగానూ రీసైక్లింగ్ యూనిట్లను సిద్ధం చేస్తోంది. సాక్షి, అమరావతి: పర్యావరణంతో పాటు భూగర్భ జలాలకు ప్రమాదకరంగా తయారైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి.. వాటిని రోడ్ల నిర్మాణంలో ఉపయోగించేలా రీసైక్లింగ్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నియోజకవర్గానికి ఒకచోట ఈ తరహా రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 160 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల ఎంపిక సైతం పూర్తయింది. పట్టణాల తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటినుంచీ నేరుగా చెత్త సేకరణ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేకరించిన చెత్తను ఆయా గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న చెత్త సేకరణ కేంద్రాల (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల)లో ప్లాసిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేరు చేసి ఉంచుతారు. గ్రామాల వారీగా ఇలా వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను వారానికి ఒకటి లేదా రెండు విడతలుగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌కు తరలించేలా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతివారం రూట్ల వారీగా ఆ వాహనంతో అన్ని గ్రామాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను మెషిన్ల సాయంతో బండిల్స్ రూపంలో అణచివేసి.. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలు ముక్కలుగా మార్చి నిల్వ చేస్తారు. రోడ్ల నిర్మాణంలో వినియోగించేలా.. ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి మట్టిలో కలవడానికి కనీసం 240 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వర్షం నీటిని భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో పీఎంజీఎస్‌వై (గ్రామీణ సడక్ యోజన) కింద చేపట్టే రోడ్ల నిర్మాణంలో కంకరతో పాటు కొంతమేర ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లు వంటి వాటిని సిమెంట్ పరిశ్రమలలో మండించడానికి ఉపయోగించేలా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే రీసైక్లింగ్ యూనిట్లలో సిద్ధం చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్డ నిర్మించే కాంట్రాక్టర్లకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను విక్రయించే ఆలోచన చేస్తున్నారు. రానున్న రోజుల్లో రోడ్ల నిర్మాణంలో వీటి వాడకం పెరిగే పక్షంలో జిల్లాల వారీగా ప్రత్యేక వేలం కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2021 అక్టోబర్ నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. వాటిలో స్థానికంగా అమ్మడానికి వీలున్న వాటిని గ్రామ పంచాయతీల స్ధాయిలోనే చిరు వ్యాపారులకు అమ్మేశారు. అమ్మకానికి పనికి రాని ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణానికి హాని కలిగించని రీతిలో నాశనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామాల్లొ సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా రోడ్ల నిర్మాణం లేదా సిమెంట్ పరిశ్రమలో మండించడానికి ఉపయోగించేలా రీసైక్లింగ్ ప్రాసెస్ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. -
అద్దెకు పంచాయతీ భూములు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన ఖాళీ స్థలాలను, భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీల సొంత ఆదాయం భారీగా పెంచుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్‌కుమార్ గత శుక్రవారం అన్ని రాష్ట్రాల పంచాయతీ శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో గ్రామ పంచాయతీలకు చెందిన ఖాళీ స్థలాలు, భూములను లీజుకు ఇవ్వడం ద్వారా పంచాయతీల ఆదాయం మరో 63 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినట్లు కేంద్రం ఆ లేఖలో వెల్లడించింది. పంచాయతీ చెరువులను చేపల పెంపకానికి లీజుకివ్వడం ద్వారానే ప్రస్తుత ఆదాయం కంటే 21 శాతం అదనపు ఆదాయం పొందవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. ఖాళీ స్థలాలను షాపులు, గోడౌన్ల నిర్వహణకు అద్దెకు ఇవ్వడం ద్వారా మరో 10 శాతం, పంచాయతీ బంజర భూములను పశువుల మేతకు లీజుకు ఇవ్వడం ద్వారా ఇంకొక 9 శాతం, స్థానిక నీటి అవసరాలు తీరిన తర్వాత బోరు బావులను వివిధ రకాల అవసరాలకు లీజుకు ఇవ్వడం ద్వారా మరో 23 శాతం మేర పంచాయతీలకు సొంత ఆదాయం సమకూరుతుందని అధ్యయనంలో తేలినట్లు పేర్కొన్నారు. లీజుకు ఇవ్వాలని పేర్కొంటున్న భూములన్నీ ఏ మాత్రం ప్రాధాన్యత లేని భూములు, ఖాళీ స్థలాలేనని, వాటిని పట్టించుకోని కారణంగా ఆక్రమణల బారిన పడుతున్నాయని కూడా తేలిందన్నారు. డిజిటలీకరణ చేయండి గ్రామ పంచాయతీల వారీగా ఖాళీ స్థలాలు, భూముల వివరాలను డిజిటలైజ్ చేయడంతోపాటు ఆ వివరాలన్నింటితో ఒక రికార్డు రూపంలో పొందుపరచాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖలకు సూచించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నిరంతరం ఈ రికార్డులలో మార్పులు, చేర్పులు చేస్తూ ఉండాలని సూచించారు. ఆయా స్థలాలు, భూములకు నిర్ణీత కాలానికి క్రమం తప్పకుండా వేలం విధానంలో ఎక్కువ ఆదాయం అందజేసే వారికి లీజులకు ఇస్తూ ఉండాలని సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా రోడ్ మ్యాప్‌ను కూడా లేఖకు జత చేసి రాష్ట్రాలకు పంపారు. రాష్ట్రంలో ఇప్పటికే డిజిటలైజేషన్ మొదలు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ రక్ష, భూ హక్కు కార్యక్రమంలో భాగంగా గ్రామ కంఠాల్లో ఉండే ఇళ్లకు సంబంధించి కొత్తగా యాజమాన్య హక్కు పత్రాలు అందజేయడంతోపాటు పంచాయతీకి సంబంధించి ఖాళీ స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలను డిజిటలీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న డ్రోన్ల సర్వే పూర్తయిన పంచాయతీలకు సంబంధించి ప్రతి ఆస్తి వివరాలను వేర్వేరుగా పేర్కొంటూ అన్ని ఆస్తుల వివరాలతో ప్రతి పంచాయతీలో ఒక రికార్డును కూడా ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. -
ఆ 87 గ్రామాలు పంచాయతీలా.. కాదా?
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను వాటిపక్కనే ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనం చేయాలని రెండున్నరేళ్ల కిందట మున్సిపల్ శాఖ ప్రతిపాదించింది. వివిధ కారణాలతో ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీలను స్థాయి పెంచాలని, లేకపోతే సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయాలని పురపాలకశాఖ ప్రతిపాదించింది. పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు కొన్నింటిని వాటిపక్కనున్న మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. 19 మండలాల్లోని 87 గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. మున్సిపల్ శాఖ ఈ తరహాగా ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆ 87 గ్రామ పంచాయతీల తాజా పరిస్థితి గురించి ఆరాతీసింది. వాటిని నగర పంచాయతీలుగా మార్చే, సమీప పట్టణాల్లో విలీనం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని ఇటీవల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు లేఖ రాసింది. ఆ పంచాయతీలను గ్రామాలుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారా అని అడిగింది. ఈ విషయాలు తెలపాలని కోరింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయా పంచాయతీల తాజా పరిస్థితిని తెలియజేయాలంటూ రెండురోజుల కిందట మున్సిపల్ శాఖకు లేఖ రాసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’
అసత్యం ప్రమాదకరమే. కానీ అర్థసత్యం అంతకన్నా ప్రమాదకరం. కానీ ‘ఈనాడు’ పత్రిక ఈ రెండింటినే ఆయుధాలుగా చేసుకుంది. వీటితోనే నిత్యం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై కుట్రలకు తెరతీస్తోంది. సోమవారం నాడు పతాక శీర్షికల్లో ‘రూ.948 కోట్ల మళ్లింపు?’’ అంటూ వండివార్చిన కథనం ఇలాంటి అర్థసత్యాల్లో భాగమే. పైపెచ్చు ఈ శీర్షికకు చివర్లో ప్రశ్నార్థకమొకటి!. అంటే... రాసిన రామోజీరావుకే సందేహం ఉందన్న మాట. మరి అంత సందేహం ఉన్నపుడు రాయటమెందుకు? పైపెచ్చు వార్త నిండా నిధుల మళ్లింపు జరిగిపోయిందన్నట్లుగా వ్యాఖ్యలు? ఇదెక్కడి పాత్రికేయం రామోజీరావుగారూ? ఇదేనా పత్రికను నడిపే తీరు? నిజానికి మీ వార్తలో ఆర్థిక సంఘం నుంచి ప్రభుత్వానికి నిధులు వచ్చాయన్నది మాత్రమే నిజం. కానీ మళ్లించారన్నది పచ్చి అబద్ధం. అందుకే మీరు, మీ అర్ధ సత్యాలు ఈ రాష్ట్రానికి అత్యంత హానికరం. అంతవరకూ బాగానే ఉన్నా... ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గరి నుంచీ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆయా సంస్థల పీడీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనూ ఇదే చేశారు. కాకపోతే ఇలాకాకుండా వాటి వ్యక్తిగత ఖాతాల్లో వేయాలని కేంద్రం సూచించటంతో... అలా చేస్తే కనీసం ట్రెజరీ అధికారుల నియంత్రణ కూడా ఉండదని, నిధులు విడుదల చేసే ముందు బిల్లుల్ని పరిశీలించటం, తనిఖీ చేయటం ఏమాత్రం ఉండదని కాబట్టి దీన్ని ఏం చేయాలన్న విషయంలో పంచాయతీ రాజ్ శాఖతో ఆర్థిక శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతోంది. అక్రమాలను కనీసం తనిఖీ చేసే వీలుంటుంది కనక పీడీ ఖాతాలకే ఆర్థిక శాఖ మొగ్గు చూపుతుండగా... ఇలా చేస్తే మళ్లీ నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసే అవకాశం ఉందని, కాబట్టి వ్యక్తిగత ఖాతాలే బెటరని పంచాయతీ రాజ్ శాఖ సూచిస్తోంది. దీనిపై తుది నిర్ణయం ఆలస్యమయ్యింది తప్ప... రామోజీ చెప్పినట్లు రూపాయి కూడా మళ్లించలేదు. అదీ నిజం. విద్యుత్తు బిల్లులు చెల్లిస్తే తప్పా? రామోజీరావు రాతలో మరింత ఘోరమైన సంగతేంటంటే ఈ నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపునకు వినియోగిస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేయటం!!. అసలు ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా రామోజీరావు గారూ? చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ పంచాయతీలు, స్థానిక సంస్థల బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు. పైపెచ్చు పీపీఏల పేరిట విద్యుత్తు రంగాన్ని నాశనం చేశారు. దాంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఏకంగా రూ.3వేల కోట్ల అప్పుల నుంచి రూ.19,900 కోట్ల అప్పుల్లోకి జారిపోయాయి. స్థానిక సంస్థలు, పంచాయతీలైతే రూ.5వేల కోట్లకుపైగా బకాయిపడ్డాయి. విద్యుత్తు సంస్థలు కనక వాటి నిబంధనలు ప్రకారం బిల్లు కట్టని పంచాయతీలకు కరెంటు నిలిపేస్తే పరిస్థితేంటి? ‘‘అంధకారంలో పంచాయతీలు’’ ‘‘బిల్లులు చెల్లించని దుస్థితిలో పంచాయతీలు’’ అని మీరే పతాక శీర్షికల్లో వేస్తారుగా? మరి ఇప్పుడు పంచాయతీలకు నిధులు వచ్చినపుడు అవి వాడుకున్న కరెంటు తాలూకు బిల్లును ఆ డబ్బుల నుంచి చెల్లిస్తే మీకేంటి నొప్పి? పడిపోతున్న విద్యుత్తు పంపిణీ సంస్థలను నిలబెట్టాలి కదా? ఆ మాత్రం కూడా బాధ్యతలేకుండా దౌర్భాగ్యపు రాతలెందుకు? ఇదీ... పీడీ ఖాతాల కథ... సాధారణ నిధులైతేనేం, ఆర్థిక సంఘం గ్రాంట్ల నిధులైతేనేం రాష్ట్ర విభజన నాటి నుంచీ... అన్నీ ఆయా స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లోనే నిర్వహిస్తున్నారు. వాటి పీడీ ఖాతాల్లోని నిధుల లభ్యతను బట్టి గ్రామ పంచాయతీలు కానీ, స్థానిక సంస్థలు గానీ బిల్లులు సమర్పించడం... వాటిని క్లియర్ చెయ్యటం జరుగుతుంటుంది. ‘ఈనాడు’ చెప్పని నిజమేంటంటే... పంచాయతీలు అప్లోడ్ చేసే బిల్లులు సాధారణ నిధుల నుంచో, 14/15వ ఆర్థిక సంఘం నిధుల నుంచో పెద్దగా ఆలస్యం లేకుండా క్లియరవుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సాధారణ నిధుల నుంచి గ్రామపంచాయతీలకు రూ.381 కోట్ల విలువైన బిల్లులు చెల్లించగా... అదే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో ఏకంగా రూ.638.41 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఆర్థిక సంఘం నిధుల నుంచి గతేడాది రూ.313.48 కోట్ల బిల్లులు క్లియర్ చేయగా... ఈ ఏడాది 588.53 కోట్ల విలువైన బిల్లులు చెల్లించారు. ఈ స్థాయిలో చెల్లింపులు పెరిగిన విషయాన్ని ‘ఈనాడు’ ఏనాడూ చెప్పదు. కాకపోతే కొన్ని స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులు లేకపోవటంతో వాటికి బిల్లులు అప్లోడ్ చేయటంలో సమస్యలొస్తున్నది నిజమే. ఈ సమస్యలు కూడా ఎందుకంటే ఆర్థిక సంఘం నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేస్తోంది. 2021–22కు సంబంధించిన రెండవ అంచె నిధులు 2022–23 రెండో త్రైమాసికంలో విడుదలయ్యాయి. ఇక 2022–23 మూడో త్రైమాసికంలోకి అడుగుపెట్టినా... ఈ ఏడాది తొలి అంచె నిధులింకా రాలేదు. పైపెచ్చు చాలా గ్రామ పంచాయతీల్లో ఐదేళ్లుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో బకాయిలు పేరుకుపోయాయి. ఆస్తి పన్ను వసూళ్లలో ఆలస్యం కారణంగా పంచాయతీల నిధులు తగ్గిపోయాయి. వీటన్నిటికీ తోడు... డిస్కమ్‌లకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై రాష్త్ర స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని స్వయంగా కేంద్ర ఆర్థిక సంఘమే ఉత్తర్వులు జారీ చేసింది. మరి వీటన్నిటినీ ప్రస్తావించకుండా... విద్యుత్ బిల్లుల కింద మినహాయిస్తారేమోననే రెచ్చగొట్టే బాధ్యతారాహిత్యపు వార్తలు ఎవరికోసం రామోజీరావు గారూ? అసలేం జరిగిందంటే... 2021–22 సంవత్సరానికి సంబందించి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఈ ఏడాది జూలై 29న కేంద్రం రూ.379 కోట్లు, ఆగస్టు 31న మరో రూ.569 కోట్లు మొత్తం రూ.948 కోట్లను విడుదల చేసింది. నిజానికి ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చికి ముందే రావాలి. కానీ కేంద్రం నుంచి ఆలస్యమయ్యాయి. ఆ నిధులు వచ్చిన 4 రోజుల్లోనే... వాటిని సంబంధిత స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) జారీ చేయగా... వాటికి అనుగుణంగా ఆగస్టు 4న పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి ఆ నిధుల విడుదలకు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేశారు. ఆ తరవాత వారం రోజులకే పంచాయితీ రాజ్ కమిషనర్ ఆ నిధుల్ని సంబంధిత స్థానిక సంస్థల వ్యక్తిగత ఖాతాల్లో జమచేసేందుకు ఉత్తర్వులిచ్చారు. -
ఏపీ ప్రభుత్వ పథకాలు భేష్
పెనమలూరు/పెదకాకాని: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ బృందం ప్రశంసించింది. పథకాలు అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అభినందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అండర్ సెక్రటరీలు తారాచందర్, అవినాష్ చందర్ మంగళవారం కృష్ణా జిల్లా వణుకూరు, పెదపులిపాక గ్రామాలతో పాటు గుంటూరు జిల్లా నంబూరులోని ప్రభుత్వ సచివాలయాలు, ఆర్బీకేలు తదితరాలను సందర్శించారు. వణుకూరు సచివాలయంలో లబ్ధిదారుల వివరాలు, వారికి అందజేస్తున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ సేవలను స్వయంగా పరిశీలించారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన చేబ్రోలు బుజ్జి నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని సందర్శించారు. వణుకూరు జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాలను కూడా పరిశీలించారు. పెదపులిపాకలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి తడి, పొడి చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నంబూరులో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, పింఛన్ల పంపిణీ విధానాన్ని ప్రశంసించారు. ఆర్బీకేలోని ఏటీఎంను పరిశీలించారు. 14, 15 ఆర్థిక సంఘాల నిధుల వినియోగం గురించి అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. కేంద్ర బృందం వెంట కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
కేంద్రం తెచ్చిన స్వమిత్వ పథకం ఏంటి? ఉపయోగాలేంటి?
సాక్షి, కామారెడ్డి: పల్లె ఇల్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లోకి వెళ్లు.. ప్రతి ఇంటి లెక్క పక్కాగా సేకరిస్తారు. అందుకే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ‘స్వమిత్వ’పథకం పేరుతో ఇళ్ల సర్వే మొదలుపెట్టింది. గ్రామకంఠం మొత్తాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించి, వాటి ఆధారంగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఇందుకుగాను పైలెట్‌గా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో ఇప్పటికే పంచాయతీ అధికారులు పని మొదలుపెట్టారు. పైలట్ గ్రామాలు ఇవే...: కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఆర్లి(కే) గ్రామం, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వే మొదలైంది. దోమకొండ మండల కేంద్రంలో 3,718 ఇళ్లు, 1,332 ఓపెన్ ప్లాట్లు, ఆర్లి(కే) గ్రామంలో 774 ఇళ్లు, 17 ఓపెన్ ప్లాట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌లో 470 ఇళ్లు, 80 ఇళ్లస్థలాలు, గోధుమకుంటలో 279 ఇళ్లు, 235 ప్లాట్లు, సరస్వతిగూడలో 336 ఇళ్లు, 28 ప్లాట్లు ఉన్నట్టు డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారా గుర్తించారు. చదవండి👉అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు స్వమిత్వ పథకం అంటే... సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా(స్వమిత్వ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు. ఇళ్లు, ఇంటి చుట్టుపక్కల ఖాళీస్థలం కొలతలు తీసుకుంటారు. ఇంటి యజమాని పేరు, వివరాలు సేకరిస్తారు. ఇరుగుపొరుగు వారి పేర్లు నమోదు చేస్తారు. రోడ్డు ఉంటే ఆ వివరాలు పొందుపరుస్తారు. పెరడు జాగాను కొలుస్తారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని వివరాలను పక్కాగా నమోదు చేసుకుంటారు. సేకరించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఉపయోగం ఏంటీ.. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏవి అవసరమున్నా ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇంటి విలువ ఆధారంగా బ్యాంకు రుణం పొందడానికి వీలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ ద్వారా ఇంటికి, ప్లాటుకు సంబంధించిన వివరాలన్నీ పొందవచ్చు. ఇంటింటి సర్వేలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారు. వివరాల సేకరణ పూర్తయిన తరువాత ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు పంచాయతీ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి👉చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్.. -
తెలంగాణలో మరో 1,433 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్ హెల్త్‌లో236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. కాగా ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయగా, మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 12,775 ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా మంగళవారం మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కూడ చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు -
పచ్చగా.. పరిశుభ్రంగా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాగునీటి కష్టాలు తలెత్తకుండా.. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు. కాలువలతో అనుసంధానం.. గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు. రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు.. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్లకు మరమ్మతులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. -
జాబు చిన్నది.. జేబు పెద్దది, కోట్లకు పడగెత్తిన చిరుద్యోగి
రాజోలు/పి.గన్నవరం: పంచాయతీ బిల్‌కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి హోదాలో భారీగా అక్రమాస్తులను కూడబెట్టి ఏసీబీకి చిక్కాడు కార్యదర్శి నిమ్మకాయల సూర్యనారాయణ. పంచాయతీ పరిధిలో నిర్మించే అపార్టుమెంట్లు, లేఅవుట్లే ఆయన టార్గెట్. ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి అవినీతి చిరుద్యోగి ఆటకట్టించారు. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఐదుచోట్ల సోదాలు నిర్వహించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి, వాడ్రేవుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలతోపాటు, పంచాయతీ కార్యదర్శి నివాసం ఉంటున్న తాటిపాక శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ, మలికిపురం మండలం లక్కవరంలోని బావమరిది, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తోడల్లుడు ఇళ్లల్లో సోదాలు చేపట్టారు. రూ.1.40 కోట్ల ఆస్తులను అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు.1,347 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు, ఒక ఇల్లు, రెండు ప్లాట్లు, 12 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు మోటారు సైకిళ్లు, ఒక కారును, రూ.1.47 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న పత్రాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. గతంలోనే ఆర్జన గతంలో రాజోలు మండలం తాటిపాక, పొన్నమండ, కాట్రేనిపాడు, బి.సావరం, వేగివారిపాలెం గ్రామ పంచాయతీల్లో ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సూర్యనారాయణ ఆ సమయంలోనే అక్రమార్జనకు పాల్పడినట్టు గుర్తించారు. తాటిపాక వాణిజ్యపరంగా అభివృద్ధి కావడంతో అక్కడ నిర్మించే అపార్టుమెంట్లకు, లే–అవుట్లకు అనుమతి ఇచ్చేందుకు లంచాలు గుంజి ఆస్తులు సంపాదించారు. తాటిపాకలో నిమ్మకాయల సూర్యనారాయణ నివాసం ఉంటున్న శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీ తర్వాత పొన్నమండ, కాట్రేనిపాడు, వేగివారిపాలెం, బి.సావరం పంచాయతీల్లో కార్యదర్శిగా పని చేశారు. ఏడాది క్రితం రాజోలు మండలం పొన్నమండ నుంచి పి.గన్నవరం మండలం మానేపల్లి బదిలీ అయ్యారు. ప్రజాప్రతినిధులతో విభేదాలు రావడంతో పి.గన్నవరం మండలానికి బదిలీపై వెళ్లారు. ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లడంతో సోదాలు నిర్వహించారు. రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. -
నేటితో ముగియనున్న ‘పరిషత్’ ప్రచారపర్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 8వ తేదీన జరుగనున్న ఎన్నికలు, 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇలా ఉండగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమాచార కేంద్రాలు, ఎన్నికల నిబంధనలు, కౌటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ద్వివేది సమీక్షించారు. 8న ప్రభుత్వ సెలవు.. నేగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్ 8వ తేదీన సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఏపీపీఆర్ యాక్ట్ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే ఎవరికి ఓటు వేశామన్న విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది. చిటికెన వేలుపై సిరా గుర్తు గురువారం జరుగనున్న పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు పెంచండి
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌కు పరిమిత సడలింపులతో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు చేరుతున్న సమయంలో కొత్తగా కరోనా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాలకు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి... ► గ్రామాల్లో స్థానికులు కరోనా పేరుతో వలస కార్మికుల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. ► అత్యంత మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలి. ► ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ► ప్రతి గ్రామంలోనూ గ్రామ వైద్య, పారిశుద్ధ్య అమలు కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. ► వైరస్ నివారణ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఫినాయిల్‌తో కలిపి గ్రామాల్లో విస్తృత స్థాయిలో పిచికారి చేయాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన చెక్ లిస్టును అమలు చేయాలి. ► మొత్తం 60 అంశాలలో గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు అవుతున్నాయా లేదా అని పరిశీలించాలి. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ డీనోటిఫై చేసింది. (సీఆర్డీఏ చట్టంలో ఎక్కడుంది?)