సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌కు పరిమిత సడలింపులతో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు చేరుతున్న సమయంలో కొత్తగా కరోనా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాలకు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి...
► గ్రామాల్లో స్థానికులు కరోనా పేరుతో వలస కార్మికుల పట్ల వివక్షతో వ్యవహరించకుండా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి.
► అత్యంత మెరుగైన పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొనేలా తగిన చర్యలు చేపట్టాలి.
► ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంతో ఆయా గ్రామాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
► ప్రతి గ్రామంలోనూ గ్రామ వైద్య, పారిశుద్ధ్య అమలు కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
► వైరస్ నివారణ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఫినాయిల్‌తో కలిపి గ్రామాల్లో విస్తృత స్థాయిలో పిచికారి చేయాలి.
► గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన చెక్ లిస్టును అమలు చేయాలి.
► మొత్తం 60 అంశాలలో గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు అమలు అవుతున్నాయా లేదా అని పరిశీలించాలి.
గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలు పెంచండి
Published Thu, May 21 2020 5:33 AM | Last Updated on Thu, May 21 2020 5:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment