సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ మరో వారం రోజుల్లో రూపుదిద్దుకోనుంది. కార్పొరేషన్ ఏర్పాటు నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ పంపిన ప్రతిపాదనల ఫైలుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ విభాగం ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో.. ‘తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పొరేషన్’ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదు చే యించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆపై కార్పొరేషన్‌కు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్లతోపాటు సభ్యుల నియామకాన్ని చేపడుతారు. గడువులోగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి కార్పొరేషన్ కీలకంగా వ్యవహరించనుంది.
వారంలోగా వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్!
Published Wed, Jan 21 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement
Advertisement