
సాక్షి, విజయవాడ : రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ సీనియర్ నేత కిలారు దిలీప్ అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 780 కోట్ల మేర మిగలడమే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... రివర్స్ టెండరింగ్ విధానంలో అవినీతి జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఆదా చేసిన వారిని తప్పక అభినందించాలని.. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభినందిస్తున్నామని తెలిపారు.(చదవండి : 'రివర్స్'పై పారని కుట్రలు!)
అదే విధంగా పారదర్శక రివర్స్ టెండరింగ్ విధానంపై టీడీపీ విమర్శలు సరికావని కిలారు దిలీప్ చురకలు అంటించారు. రివర్స్ టెండరింగ్‌పై సీఎం జగన్‌కు ప్రజల ఆశీస్సులు ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. పోలవరం మాదిరి మిగతా ప్రాజెక్టులలో కూడా రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.