ఎగువ సీలేరు పీఎస్పీపై ఈనాడు విషయం లేని కథనం
నిబంధనల మేరకే ప్రాజెక్టు పనుల అప్పగింత
2022 సెప్టెంబర్ ధరల ప్రాతిపదికన ఎగువ సీలేరు పీఎస్పీకి డీపీఆర్
అదీ కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ తయారు చేసినది
ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది
ఈ ప్రాజెక్టు దక్కించుకున్న మేఘా సంస్థ కోట్ చేసింది 9.87 శాతం
6 శాతం ధరల పెరుగుదల పోను మేఘా కోట్ చేసింది స్వల్పమే
గత ఏడాది జూన్‌లోనే టెండర్ల ఆహా్వనం
అన్ని నిబంధనలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఫిబ్రవరిలో ఆమోదం
సీఈఏ, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం తర్వాతే టెండర్లు
పకడ్బందీగా ఆన్‌లైన్ టెండర్ల ద్వారా బిడ్ల స్వీకరణ
8 నెలలు సాగిన టెండర్ల ప్రక్రియ తొందరపాటు ఎలా అవుతుంది?
సాక్షి, అమరావతి: ఎగువ సీలేరు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 2022 సెపె్టంబరులో తయారైంది. అప్పటి ధరల ప్రకారం వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్ తయారు చేసింది. అంటే ఈ ప్రాజెక్టు డీపీఆర్ 18 నెలల క్రితం ధరలతో తయారైంది. ఏ ప్రాజెక్టుకైనా ఏటా 6 శాతం ధరల పెరుగుదల ఉంటుంది. ఎగువ సీలేరు పీఎస్పీకి అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ సంస్థ ఎంపిక జరిగింది.
ఇందులో 9.87 శాతం ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థ ఎల్–1 (తక్కువ మొత్తానికి కోట్ చేసిన సంస్థ)గా ఎంపికైంది. దానికే ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ధరల పెరుగుదల 6 శాతం పోగా మేఘా సంస్థ కోట్ చేసిన మొత్తం ఎక్కువేమీ కాదు. ఈ విషయం విష పత్రిక ఈనాడు అధినేత రామోజీకి తెలియనిదీ కాదు.
పైగా, గత ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచి, అన్ని నిబంధనలను పాటిస్తూ, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లను ఏపీ జెన్‌కో ఖరారు చేసింది. అంటే 8 నెలలపాటు టెండర్ల ప్రక్రియ సాగింది. ఇందులో తొందరపాటేమీ లేదన్నదీ రామోజీకి తెలుసు. అయినా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదోలా విషం చిమ్మి, ప్రజలను మభ్య పెట్టేయాలన్న తొందరపాటులో విషయం లేని ఈ కథనాన్ని అచ్చేశారు.
ఈనాడు ప్రచురించిన ఈ అసత్య కథనాన్ని ఏపీ జెన్‌కో, ఇంధన శాఖ ఖండించాయి. ఆ రెండు సంస్థలు అసలు టెండర్లలో పారదర్శకత, నిబంధనలు అమలు తీరును ‘సాక్షి’కి వెల్లడించాయి. ఆ వివరాలు..
♦ 2022 సెప్టెంబరు ధరల ప్రామాణికంగా ఈ పీఎస్పీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘‘వ్యాప్కోస్’ డీపీఆర్ తయారు చేసింది. డీపీఆర్ తయారై 18 నెలలు గడిచిపోయింది. డీపీఆర్ ఆధారంగా ఈ ప్రాజెక్టుకు టెండరు పిలిచిన మొత్తం రూ. 6,717 కోట్లు కాగా మేఘా రూ.7,380 కోట్లకు (9.87 శాతం ఎక్కువకు) టెండరు పొందింది. ఏడాదిన్నర క్రితం ధరలతో పోల్చితే ఇప్పుడు మేఘా కోట్ చేసిన బిడ్‌లో ఏడాదికి 6 శాతం పెరుగుదలా ఉంది. అందువల్ల ప్రతిపాదిత టెండరు మొత్తంకంటే 9.87 శాతం ఎక్కువనడానికి లేదు. అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే ప్రభుత్వ ఆమోదంతో ఏపీజెన్‌కో ఈ టెండరును ఆమోదించింది.
♦ ఉదయం, సాయంత్రం పీక్ లోడ్ అవసరాలు తీర్చడం ద్వారా గ్రిడ్‌ను స్థిరీకరించడం, అధిక ధరకు మార్కెట్లలో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలుగా ప్రభుత్వ ఆదేశంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిరి్మంచాలని ఏపీజెన్‌కో నిర్ణయించింది.
♦ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలకు ఈ ప్రాజెక్టు అనుమతికి సంబంధించిన అన్ని పత్రాలు అందజేసి, త్వరితగతిన వివరణలు ఇవ్వడం ద్వారా ఏపీజెన్‌కో చట్టబద్ధమైన అనుమతులు సాధించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అనుమతి పొందిన తర్వాత గత ఏడాది జూన్‌లో పీఎస్పీ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. పూర్తిగా నిబంధనలు, విధివిధానాలను అనుసరించి ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండరు ఖరారు చేసింది. అన్ని నిబంధనలు పాటించినందునే టెండరు ఖరారుకు ఎనిమిది నెలలు పట్టింది. టెండర్ల ఖరారులో ఎలాంటి తొందరపాటు లేదనడానికి ఇదే నిదర్శనం.
♦ ఈ ఏడాది జనవరికల్లా పనులు ప్రారంభించి 2028 డిసెంబరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఐఎన్‌డీసీ, సీఓపీ మార్గదర్శకాల ప్రకారం కర్బన ఉద్గారాలను, భూతాపాన్ని తగ్గించాలని సీఈఏ షెడ్యూలు ఇచ్చింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, భూతాపం (వేడి) నియంత్రణకు 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాదనకు పీఎస్పీ, బ్యాటరీలే మార్గాలు.
ఇంత పెద్ద పరిమాణంలో బ్యాటరీల ఏర్పాటు సాధ్యంకానందున పీఎస్పీల నిర్మాణమే ఉత్తమ మార్గం. అందువల్లే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఈ పీఎస్పీ నుంచి డిస్కంలు విద్యుత్ తీసుకునేందుకు ఏపీఈఆర్సీ, ఏపీపీసీసీ అనుమతులు కూడా లభించాయి. భూసేకరణ ప్రణాళిక కూడా రూపొందించిన తర్వాత సీఈఏ అనుమతించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మొదటి దశ పర్యావరణ అనుమతి ఇచ్చింది.
♦ భూసేకరణ, జీఎస్టీ, ఐడీసీ, ధరల పెరుగుదల వల్ల పెరిగే వ్యయం, చట్టబద్ధమైన అనుమతులు అన్నీ కలిపి 2022 ధరల ప్రాతిపదికన ఈ పీఎస్పీ నిర్మాణానికి రూ. 11,881.50 కోట్లవుతుందన్న అంచనాతో 2022సెప్టెంబర్ లో వ్యాప్కోస్ డీపీఆర్ రూపొందించింది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 6,717 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహా్వనించి రూ. 7,380 కోట్లకు (జీఎస్టీ కాకుండా).. అంటే 9.87 శాతం ఎక్కువకు కాంట్రాక్టు ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment