పోలవరం పనులను పరిశీలిస్తున్న పీపీఏ బృంద సభ్యులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పీపీఏ కార్యదర్శి ఎం.రఘురామ్, సీఈ రాజేష్‌కుమార్, డైరెక్టర్ పి.దేవేంద్రరావు కాఫర్ డ్యామ్, స్పిల్‌వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును సీఈ సుధాకర్‌బాబు వివరించారు. క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ప్రాజెక్టు పనులపై బృందం సభ్యులు సమీక్షించారు.
శుక్రవారం కూడా పనులు పరిశీలించనున్నారు. వారివెంట ఈఈలు మల్లికార్జునరావు, పి.ఆదిరెడ్డి, డీఈ కె.శ్రీనివాసరావు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నాణ్యత విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు పి.కె.ముంజిని, సోలంకి గురువారం పరిశీలించారు. పనులు, నాణ్యత ప్రమాణాలపై ఇంజనీరింగ్ అధికారులు వారికి వివరించారు. గ్యాప్–3 కాంక్రీట్ పనులు, స్పిల్‌వే గ్యాలరీ పనులను చూసిన వారు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనులను కూడా పరిశీలించి ప్రాజెక్టు ప్రాంతంలోని ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. వారి వెంట డీఈ శ్రీకాంత్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment