Engineering Officers
-
‘మేడిగడ్డ’లో భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ.. ఈఈ, ఎస్‌ఈలపై క్రిమినల్ చర్యలు! మేడిగడ్డ బరాజ్‌లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అర్హులే. తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్.. మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్‌కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్‌లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్‌పై ఎస్ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది. మెజర్మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది. నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి. కొంపముంచిన కాఫర్ డ్యామ్! బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్‌పైల్స్‌ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్‌కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్‌ను ప్రారంభించాక కాంట్రాక్టర్‌కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్‌కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు. నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు బరాజ్‌లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
పోలవరంలో పీపీఏ బృందం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పీపీఏ కార్యదర్శి ఎం.రఘురామ్, సీఈ రాజేష్‌కుమార్, డైరెక్టర్ పి.దేవేంద్రరావు కాఫర్ డ్యామ్, స్పిల్‌వే బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును సీఈ సుధాకర్‌బాబు వివరించారు. క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ప్రాజెక్టు పనులపై బృందం సభ్యులు సమీక్షించారు. శుక్రవారం కూడా పనులు పరిశీలించనున్నారు. వారివెంట ఈఈలు మల్లికార్జునరావు, పి.ఆదిరెడ్డి, డీఈ కె.శ్రీనివాసరావు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్ఎంఆర్ఎస్) నాణ్యత విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు పి.కె.ముంజిని, సోలంకి గురువారం పరిశీలించారు. పనులు, నాణ్యత ప్రమాణాలపై ఇంజనీరింగ్ అధికారులు వారికి వివరించారు. గ్యాప్–3 కాంక్రీట్ పనులు, స్పిల్‌వే గ్యాలరీ పనులను చూసిన వారు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న టన్నెల్ పనులను కూడా పరిశీలించి ప్రాజెక్టు ప్రాంతంలోని ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. వారి వెంట డీఈ శ్రీకాంత్ ఉన్నారు. -
రూ.వెయ్యి కోట్లతో గ్రామీణ రోడ్లకు రిపేర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధీనంలోని 6,425.88 కి.మీ. పొడవైన గ్రామీణ లింకు రోడ్లకు రూ.1,072.92 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టనుంది. దెబ్బతిన్న రోడ్లవారీగా మరమ్మతులకు సంబంధించి అంచనాల తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని, ఈ నెల 19వతేదీ నుంచి కాంట్రాక్టర్లు ఆన్లైన్లో టెండర్ దాఖలుకు వీలు కల్పించామని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. 3 విభాగాలు... అత్యంత నాణ్యంగా పనులు రాష్ట్రవ్యాప్తంగా 157 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,845 రోడ్లలో 193.98 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చుతారు. మరో 1,972.26 కిలోమీటర్ల పొడవున గుంతలు పూడ్చడంతో పాటు ఆ రోడ్డు మొత్తం పొడవునా పై వరుస తారు లేయర్ కొత్తగా వేస్తారు. రోడ్డు బాగా దెబ్బతిన్న 2,468.65 కిలోమీటర్ల పొడవున ముందుగా పాత రోడ్డును పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తర్వాత తారు లేయర్ వేస్తారు. మరమ్మతుల పనులే అయినప్పటికీ పూర్తి నాణ్యతతో జరిగేలా తారు, కంకరను కలిపే హాట్ మిక్సింగ్ యూనిట్లతో పనులు చేపడతారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ పనులను ప్యాకేజీలుగా వర్గీకరించారు. మరమ్మతులు రూ.ఐదు కోట్లు లోపు ఉంటే ఒక ప్యాకేజీగా వర్గీకరించారు. రూ.5 కోట్లకు మించితే పనుల విలువ ఆధారంగా రెండు మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. రాష్ట్రంలో మొత్తం 1,845 పనులను 272 ప్యాకేజీలుగా విభజించారు. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 146 పనులను 29 ప్యాకేజీలుగా వర్గీకరించారు. పనులను పదికి పైగా ప్యాకేజీలుగా వర్గీకరించిన జిల్లాలు.. అనకాపల్లి (15), చిత్తూరు (12), తూర్పుగోదావరి (10), ఏలూరు (17), కాకినాడ (12), కోనసీమ (11), కృష్ణా (12), పల్నాడు (11), ప్రకాశం (11), శ్రీకాకుళం (11), తిరుపతి (12), విజయనగరం (14), పశ్చిమ గోదావరి (11) -
గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పోలవరం రోడ్డుకు మరోసారి బీటలు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో నాణ్యత లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. హెడ్ వర్క్స్ ప్రాంతానికి వెళ్లే మార్గంలోని రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారి ఆదివారం మరోసారి భారీగా బీటలు వారి 6 అడుగుల వరకు కుంగిపోయింది. ఇది చూసి సమీప ప్రాంతాల్లో పనులు చేస్తున్న కూలీలు, ఇతరులు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్గంలో ప్రయాణించే ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను, వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. యంత్రాలను రప్పించి పగుళ్లు బారిన రహదారికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గతంలో ఇదే రహదారి ఒక్కసారిగా 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. స్పిల్ ఛానల్ ప్రాంతంలో బెడ్ లెవల్లో మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయని.. దాంతో భూమి పైభాగం నుంచి ఒత్తిడి ఏర్పడటం వల్ల రోడ్డు కుంగిపోయి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడిన ప్రభుత్వ పెద్దలు నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడటం వల్లే పోలవరం రోడ్డుకు ఈ దుస్థితి దాపురించిందని జలవనరుల శాఖ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల సూచనలు బుట్టదాఖలు రహదారి పనుల్లో నాణ్యత లోపాలను, డంపింగ్ యార్డ్ ఏర్పాటులో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు యధాప్రకారం అబద్ధాలను పదే పదే చెబుతున్నారు. మట్టిలో తేమ శాతం తగ్గిందని, వాతావరణంలో మార్పుల వల్ల మట్టి ఉబికి రావడం, కుంగిపోవడం సహజమంటూ అధికారులతో చెప్పిస్తున్నారు. కానీ.. నిబంధనలు తుంగలో తొక్కి చిన్న నీటి వనరులను విధ్వంసం చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం, రహదారిని నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాయి, మట్టి నమూనాలను ప్రాథమికంగా పరిశీలించిన సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రెసెర్చ్ స్టేషన్(కేంద్ర మట్టి, రాయి పరిశోధన సంస్థ) శాస్త్రవేత్తలు, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల సూచనల మేరకు పనులు నాణ్యంగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అధికారవవర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపాలను కాగ్ ఎత్తిచూపినా.. సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ స్పిల్‌వే పనులు నాసిరకంగా ఉన్నాయని తేల్చిచెప్పినా రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కలెక్టర్ తీరుపై ఆందోళన బాట
సిద్ధపడుతున్న ఇంజినీరింగ్ అధికారులు సమీక్షలు, అర్ధరాత్రి తనిఖీలకు నిరసన తనిఖీకి వెళ్లిన ఇంజినీర్‌కు ప్రమాదం తప్పిన ప్రాణాపాయం ఏలూరు (మెట్రో) : అర్ధరాత్రి సమీక్షలు నిర్వహించి.. తనిఖీలు అంటూ హడలెత్తిస్తున్న కలెక్టర్ తీరుపై ఇంజినీరింగ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో శనివారం రాత్రి తనిఖీలకు వెళ్లిన ఓ జేఈ ప్రమాదానికి గురయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఇంజినీరింగ్ అధికారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమవారం నుంచి వారు ఆందోళనకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. డెల్టా ఆధునికీకరణలో భాగంగా ఎర్రకాలువ ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం అనంతపల్లి బ్రిడ్జి నుంచి నందమూరు అక్విడెక్టు వరకూ పనులు జరుగుతున్నాయి. 15 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో యంత్రాలు ముందుకు కదలని దుస్థితి నెలకొంది. దీంతో పనులకు ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ శనివారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులుగా వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయని ఇంజినీర్లు ఆయనకు వివరించారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఇప్పటి వరకూ ఏమి చేశారంటూ నిలదీశారు. రాత్రి 10.30కి పనుల తనిఖీకి వస్తానని, పనులను తక్షణమే పర్యవేక్షించి ప్రగతిని నివేదించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన సంబంధిత డీఈ, జేఈలు పనులు జరిగే ప్రదేశానికి పరుగులు తీశారు. వీరివెంట ఏలూరు ఆర్డీఓ జి.చక్రధర్ కూడా వెళ్లారు. ఆ సమయంలోనూ వర్షం పడటంతో ఏమీ చేయలేక తిరుగుముఖం పట్టారు. అప్పటికే అర్ధరాత్రి 12గంటలు దాటడం, వాన పడడంతో చీకటిలో దారి కనిపించక జేఈ అనిల్‌కుమార్ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడిపోయారు. ఆయన తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. గతంలోనూ ఇలాగే.. కలెక్టర్ తీరుతో గతంలోనూ జంగారెడ్డిగూడెం జేఈ శ్రీనివాసమూర్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసమూర్తి చేయి విరిగింది. అలాగే కొవ్వూరు జేఈ దుర్గారావు రోడ్డుప్రమాదానికి గురై కాలు విరగ్గొట్టుకున్నారు. ఏలూరు ఈఈ ఇప్పటికే పని పనిఒత్తిడిని తాళలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. -
‘ఎత్తిపోతల’ను వెంటనే పూర్తిచేయండి
⇒ పనులు పూర్తి చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టండి ⇒ ఐడీసీకి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) చేపట్టిన ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లో సాగు నీరందించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మొత్తం ఐడీసీ లిప్టు పథకాల ద్వారా ఖరీఫ్‌లో ఎంత ఆయకట్టుకు సాగు నీరందిస్తున్నారో లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఐడీసీని ఆయన ఆదేశించారు. శనివారం ఐడీసీ కార్యాలయంలో ఆ సంస్థ చేపట్టిన ఎత్తి పోతల పథకాల పురోగతిపై నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 కంటే ముందు ప్రారంభించిన పథకాలు ఇప్పటికీ పూర్తి కానందుకు టీఎస్ఐడీసీ అధి కారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రా క్టు గడువులోగా పనులు పూర్తిచేయని ఏజెన్సీ లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. పూర్తి కావలసిన దశలో ఉన్న ఎత్తిపోతల పథకాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే పూర్తి చేయాలన్నారు. 40 పథకాలు పూర్తి: శంకర్‌రెడ్డి టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడు తూ కోటి ఎకరాలకు నీరందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నా యని అన్నా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 110 లిఫ్ట్ స్కీంలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించార ని తెలిపారు. ఇందులో ఇప్పటికే 40 స్కీంలు పూర్తయ్యాయని, రూ. 7 కోట్లు ఖర్చు చేసి 15వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. ఇవి కాకుండా ప్రపంచ బ్యాంకు నిధులతో 17 స్కీంలకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి కావొస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా లిఫ్ట్‌లకు అవసరమైన విద్యుత్ లైన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, అందుకు 16 గంటల విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఇరిగేషన్ కార్యదర్శి వికాస్ రాజు, టీఎస్ఐడీసీ ఎండీ. శ్రీదేవి, ఇతర ఆధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అలసత్వం సహించం పెండింగ్ పనులను ఈ ఏడాది పూర్తి చేసి ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ 2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరివ్వాలని అధికారులకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అలసత్వం, అలక్ష్యం సహించేది లేదని.. సమర్థంగా పనిచేయని అధికారులను డిమోట్ చేస్తామని హెచ్చరించారు. శనివారం జలసౌధలో ఎస్సారెస్పీ స్టేజ్ 2 పనుల పురోగతిని మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. ప్యాకేజీల పనులన్నీ ఖరీఫ్‌లోగా పూర్తి చేయాల్సిం దేనన్నారు. మిడ్‌మానేరు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని.. మిడ్ మానేరు నుంచి 25, ఎల్ఎండీ నుంచి 25 టీఎంసీల నీటిని విడుదల చేయను న్నందున ఎస్సారెస్పీ స్టేజ్ 2 కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఆఫీసులు విడిచిపెట్టి క్షేత్రస్థాయి పర్యటనలు జరపాని, కాల్వల వెంట స్వయంగా తిరిగితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని హరీశ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ప్రభు త్వ స్పెషల్ సీఎస్ జోషి పాల్గొన్నారు. -
లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం
విద్యుత్ బకాయి చెల్లించాలని అడిగిందుకు మహిళ వీరంగం కావలి : ఇంటి విద్యుత్ బకాయి కట్టలేదని సర్వీస్ కనెక్షన్ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్‌మన్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అతని ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన పట్టణంలోని వెంగళరావునగర్‌లో మంగళవారం జరిగింది. స్థానికులు, లైన్‌మన్ యు.రాజశేఖర్ కథనం మేరకు... వెంగళరావు నగర్ బైరాగుల కాలనీ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో షేక్ హసీనా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత ఏడాది జూలై నుంచి సర్వీస్ కనెక్షన్‌కు సంబంధించి విద్యుత్ బిల్లు బకాయి ఉంది. గత నెలలో సంబంధిత సిబ్బంది వచ్చి ఫ్యూజ్ లింక్‌లు తీసుకెళ్లారు. అయితే ఆమె మరో ఫ్యూజ్‌లు తెచ్చి విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్‌మన్ ఆమె ఇంటికి వెళ్లి విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగారు. ఆమె దురుసుగా సమాధానం చెప్పడంతో స్తంభం ఇంటికి ఉన్న విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌ను తొలింగించే ప్రయత్నంలో చేశాడు. దీంతో ఆమె నిచ్చెన లాగేయడంతో లైన్‌మన్ కింద పడిపోయాడు. ఆమె ఇనుప రాడ్డుతో లైన్‌మన్‌పై దాడికి పాల్పడింది. అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి అదే రాడ్‌తో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో బిత్తరపోయిన లైన్‌మన్ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాన్స్‌కో ఇంజినీరింగ్ అధికారులు, లైన్మన్తో కలసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదును అందజేశారు. విద్యుత్ బకాయిలు కోసం వినియోగదారుల ఇళ్లకు వెళితే తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని విద్యుత్ శాఖ అధికారులు, లైన్మన్లు ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గడువు గండం
ఈ నెల 27 నాటికి ఉద్యోగులు తరలిరావాలని సీఎం ఆదేశం మిగిలింది ఆరు రోజులే ఒక్క భవనం కూడా పూర్తికాని తాత్కాలిక సచివాలయం మరో రెండు నెలలు పడుతుందంటున్న ఇంజనీరింగ్ అధికారులు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి వెలగపూడిలో ప్రభుత్వం రూ.600 కోట్ల వ్యయంతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివా లయ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానమైన ఆరు బ్లాకుల నిర్మాణంలో ఒక్కటీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఆరో బ్లాకు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల వరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్, సాధారణ పరిపాలన విభాగం, న్యాయశాఖ, సీఎం హామీల పరిష్కారం కోసం ఈ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఆరు బ్లాకులు పూర్తిచేయలేమని ఇంజినీర్లు చెప్పడంతో మొదటి బ్లాక్ అయినా పూర్తిచేసి ఈనెల 27 నాటికి కార్యక్రమాలు నిర్వహిం చాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే, మొదటి బ్లాకు కూడా 27 నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం 50శాతం పనే అయ్యింది. లోపల పూర్తిస్థాయిలో గదుల నిర్మాణం జరగలేదు. ఓపక్క ఫ్లోరింగ్, మరోపక్క సీలింగ్, ఇంకోవైపు వైట్‌వాష్, వైరింగ్ పనులు చేస్తున్నారు. అదేవిధంగా.. రెండో అంతస్తులో గోడలు కాకుండా ఫైబర్ ప్లేట్స్‌తో చిన్నచిన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఫ్యాన్లు, సెంట్రల్ ఏసీ పనులు ప్రారంభించే అవకాశమే లేదు. రహదారులు ఛిద్రం తాత్కాలిక సచివాలయానికి వెళ్లడానికి ఇప్పటివరకు సరైన రహదారి లేదు. ప్రస్తుతం మందడం నుంచి సింగిల్ లైన్ రోడ్డు ఉంది. అది కూడా గుంతలు పడి దర్శనమిస్తోంది. ఒక వాహనం వస్తే.. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించుకు వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితి. వర్షం వస్తే రోడ్డుకిరువైపులా వాహనం ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క రోడ్డు తప్ప సచివాలయానికి వెళ్లటానికి మరో మార్గం లేదు. మంగళగిరి నుంచి ఐనవోలు మీదుగా సచివాలయానికి రహదారి ఉన్నా ఛిద్రమై కనిపిస్తోంది. ఇటీవల ప్యాచ్ వర్క్ పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. సచివాలయ ప్రాంగణంలో గ్రావెల్ రోడ్లు శరవేగంగా చేస్తున్నారు. గ్రావెల్ పనులు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యాక తారురోడ్డు లేదా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆ పనులు ప్రారంభం కావడానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు సచివాలయ ప్రాంగణమంతా బురదగా మారింది. హోంశాఖ, విద్యుత్, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వశాఖ కార్యాలయాలు, ఆర్థికశాఖ, ప్రణాళికా విభాగం ఇందులో ఉంటాయి. ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో ఇప్పుడిప్పుడే గదుల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన ఏ పనీ ప్రారంభం కాలేదు. ఇప్పుడే పనులు ప్రారంభించినా నెలరోజులు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. టెలికం, బీఎస్ఎన్ఎల్ సర్వర్, ఏపీ టీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్, పే అండ్ అకౌంట్స్, మీసేవ, ఈసేవ, రైల్వే, బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసు, బ్యాంక్, రెండు ఏటీఎంలు, షాపులు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం, ప్లే స్కూల్, మూడు పడకల డిస్పెన్సరీ, రిక్రియేషన్, లైబ్రరీ, రెస్టారెంట్, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్, యువజన సంక్షేమం, టూరిజం, సాంస్కృతిక శాఖలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబులు మాత్రమే పూర్తిచేశారు. గోడల నిర్మాణం ప్రారంభించారు. గదుల నిర్మాణం పూర్తిచేయాలి. పూత, ఫ్లోరింగ్, సీలింగ్, వైరింగ్, వైట్‌వాష్, వాష్‌రూమ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలన్నా నెలరోజులు పడుతుంది. రెవెన్యూ, రెవెన్యూ విపత్తుల శాఖ, ఎన్విరాన్మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, సహకార శాఖ, పశుసంవర్థక, డెయిరీ, మత్స్య, పౌరసరఫరాల శాఖతో పాటు ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారు కార్యాలయాలు ఇందులో ఉంటాయి. వాటర్ రిసోర్సెస్, రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్, పాఠశాల, ఉన్నత విద్య, ఐటీ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తారు. ఈ నాల్గో బ్లాక్‌లో గదుల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులన్నీ పూర్తికావాలంటే సుమారు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ శాఖలు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు భవనాల శాఖ, విజిలెన్స్ కమిషన్, కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. బ్లాక్‌లో గదుల నిర్మాణం 60 శాతం పూర్తయ్యింది. మిగిలిన సగంలో ఓవైపు పనులను రెండురోజుల కిందటే ప్రారంభించారు. ఈ బ్లాక్‌లో మొత్తం పనులన్నీ పూర్తిచేసి జులై చివరినాటికి అందజేయగలమని ఇంజినీర్లు చెబుతున్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయాలకు వారం కిందటే పునాదులు వేశారు. ఐదు బ్లాకులు పూర్తయితే తప్ప ఆరో బ్లాక్ పనులుచేసే అవకాశం లేదని ఇంజినీర్లు స్పష్టం చేశారు. నత్తనడకన విద్యుత్ ఏర్పాట్లు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తయ్యాక రోజుకు 6 ఎంవీఏ విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఇందుకోసం విద్యుత్‌శాఖ తాడికొండ, తాడేపల్లి నుంచి విద్యుత్ లైన్ పనులు ప్రారంభించింది. మొత్తం 42 కిలోమీటర్ల దూరం పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు 50 శాతం మాత్రం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాత్రింబవళ్లూ కష్టపడుతున్నా 27 నాటికి పనులు పూర్తయ్యేలా లేవు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి బ్లాక్‌లో పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ? హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చే అధికారులు మొత్తం సుమారు 2వేల మంది వరకు ఉండొచ్చని సమాచారం. వీరందరూ వినియోగించి వదలివేసే వృథానీరు, మురుగు వెళ్లటానికి భూగర్భ డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పనులేవీ ప్రారంభం కాలేదు. వర్షపు నీరు వచ్చినా వెలుపలకు వెళ్లే అవకాశం లేదు. ఈ పనులు పూర్తి చేయాలంటే సుమారు నెలరోజులకుపైనే పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. నీళ్లెప్పుడొస్తాయి? ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, కార్యాలయ అవసరాల కోసం రోజుకు 7 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపై ఇంతవరకు అధికారుల్లో స్పష్టత లేదు. కొందరు అధికారులు తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ ద్వారా తాత్కాలిక సచివాలయానికి తీసుకొస్తామని చెబుతున్నారు. మరికొందరు అధికారులు శాఖమూరు పెలైట్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. నీటి విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత లేకపోతే సచివాలయ పనులు పూర్తయినా ప్రయోజనం శూన్యమే. -
కృష్ణా కెనాల్లో రైల్వే అధికారుల పర్యటన
పుష్కర ఏర్పాట్ల పరిశీలన తాడేపల్లి రూరల్ : దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు శనివారం కృష్ణా కెనాల్ జంక్షన్‌కు విచ్చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో కృష్ణా కెనాల్‌ను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై వీరి పర్యటన సాగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్ మాట్లాడుతూ పుష్కరాలకు కృష్ణా కెనాల్ జంక్షన్లో మౌలిక సదుపాయాలు కల్పిం చేలా చర్యలు తీసుకుంటున్నామని, రైల్వేస్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించడంతోపాటు కృష్ణా కెనాల్‌కు తాడేపల్లి ప్రధాన రహదారి వెంబడి మరో రైల్వే బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయడం, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటితోపాటు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించడం చేస్తామని తెలిపారు. ప్లాట్‌ఫాం పొడవు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో సీనియర్ డీసీఎం ఎంవీ సత్యనారాయణ, డీవోఎం సత్యనారాయణ, ఐవోడబ్ల్యూ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పనులు చేసుడే లేదు!
► రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ► పనులు దక్కించు కోవడంపైనే దృష్టి ► పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం ► ఇంకా ప్రారంభించని 12 మంది ► చర్యలపై అధికారుల ఉదాసీనత సాక్షిప్రతినిధి, వరంగల్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల పట్టింపులేమి జిల్లాలో రోడ్ల పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవడంలో చూపినంత శ్రద్ధ వాటిని పూర్తి చేసే విషయంలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంజూరైన పంచాయతీరాజ్ రోడ్లలో ఏ ఒక్కటీ వంద శాతం పూర్తి కాలేదు. జిల్లాలోని అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యానికి ఈ పరిస్థితి నిదర్శనంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్) చేసేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం రూ.416 కోట్లు మంజూరు చేసింది. రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీటర్ల బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అలాగే 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను కొత్తగా బీటీ వేసి అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు మంజూరు చేసింది. రోడ్ల పునరుద్ధరణ కోసం 463 పనులను, కొత్త రోడ్ల నిర్మాణం కోసం 152 పనులను గుర్తించారు. మొ త్తం 615 పనులకు టెండర్లు నిర్వహించగా 45 మంది కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అరుుతే, టెండర్ల ప్రక్రియ ముగిసి ఏడాది కావస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. 12 మంది కాంట్రాక్టర్లు అసలు పను లే మొదలుపెట్టలేదు. అయినా వీరి విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేయకపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొదలే కాలేదు... రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు దక్కించుకుని మొదలుపెట్టని కాం ట్రాక్టర్లు, సంస్థల తీరుతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్.నారాయణరెడ్డి అండ్ సన్స్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లవెల్లి కన్స్ట్రక్షన్, ఎస్ఎల్వీ బిల్డర్స్, జి.నవీన్, వి.పృథ్వీధర్‌రావు, పీబీఆర్ సెలెక్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, వి.వీరారెడ్డి, తట్టెకుంట వడ్డెర సానిటరీ సివిల్ వర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం, పి.శ్రీనివాస్‌రెడ్డి అండ్ కంపెనీ, తౌటిరెడ్డి రఘోత్తంరెడ్డి, జీ.వీ.రెడ్డి, డి.శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికీ పనులను మొదలు పెట్టలేదు. ఈ 12 కాంట్రాక్టరు, సంస్థలు కలిపి జిల్లాలో 28.28 కోట్ల పనులు దక్కించుకున్నాయి. మొదలుకాని పనులలో ఎక్కువగా కొత్త రోడ్ల నిర్మాణ పనులే ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పనులు దక్కించుకుని ఏడాది దగ్గరపడుతున్నా రోడ్ల నిర్మాణం, పునరుద్ధణను పట్టించుకోని ఈ సంస్థల పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను మొదలుపెట్టాలనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు 24వేల దరఖాస్తులు నయీంనగర్ : స్వయం ఉపాధి పథకాల కోసం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 24 వేలకు పైగా దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.సురేష్ తెలిపారు. మండల, అర్బన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను విభజించి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు స్వయం ఉపాధి రుణాలు పొందడానికి బ్యాంకు కాన్సెంట్ అవసరం లేదని, స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణా లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఒంటరి స్త్రీలు, గుడుంబా బాధిత కుటుంబాలు, లొంగిపోయిన నక్సలైట్లు, వయో పరిమితి మించిపోతు న్న వారు, సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈడీ వివరించారు. కాగా, మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా ఎంపీడీఓ, సభ్యులుగా డీఆర్డీఏ ఎంపీఎం, సర్వీస్ ఏరియా బ్యాంకు మేనేజర్, అర్బన్‌లో చైర్మన్‌గా మునిసిపల్ కమిషనర్, సభ్యులుగా మెప్మా పీడీ, బ్యాంకు మేనేజర్ ఉంటారని తెలిపారు. -
తిరుమల ఘాట్‌లో చైన్ లింక్ కంచె నిర్మాణం
సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రాళ్లు కూలే ప్రాంతం పరిస్థితులపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు, ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే ఆయా ప్రాంతాల్లో కొత్తగా చైన్‌లింక్ కంచె నిర్మాణం పనులు చేపట్టింది. ఇక్కడి 16వ కిలోమీటరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఇనుప కంచెను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తొలగించారు. కొత్త చైన్‌లింక్ కంచె నిర్మించే పనులు శనివారం చేపట్టారు. ఇదే తరహాలోనే పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పాత కంచెల్ని తొలగించి కొత్తవి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తోటపల్లి కాలువకు మళ్లీ గండి
సీతానగరం, బొబ్బిలి: తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువకు మళ్లీ గండి పడింది. అధికార పార్టీ నాయకుల ప్రచార తాపత్రయమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆయకట్టు రైతులకు ఎలాగైనా సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పనుల్లో నాణ్యత లోపించటంతో శనివారం మరోసారి గండి పడింది. దీంతో ఇటు అధికార పార్టీ ప్రతినిధులు, అటు ఇంజినీరింగ్ అధికారులు ఏం చేయాలో తెలియ తలలు పట్టు కున్నారు. ఆదరాబాదరాబా పనులు నిర్వ హించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ కోవడం, ఎలాగైనా ఈ నేలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్న తొందరే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే. జిల్లాలో సువర్ణముఖి నది మీద లక్ష్మీపురం, వేగావతి నదిపై బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామం వద్ద రెండు అక్విడెక్టులు నిర్మించారు. అలాగే కాలువ మొత్తం 78 వరకూ మదుములను స్ట్రక్చర్లను నిర్మాణం చేశారు. 48 వ కిలోమీటరు వరకు సీతానగరం మండలంలోని నిడగల్లు పంచాయతీ పరిధిలో ఉన్న ముత్యాలదొరవలస నుంచి గాదెలవలస వరకు కుడికాలువ నిర్మించారు. ఈ కాలువకు మధ్యలో 17.7 కిలోమీటరు వద్ద సువర్ణముఖి నది ఉంది. కాలువ నిర్మాణ పనులను 2012-13 వరకూ ఐటీడీ పనులు చేపట్టింది. తర్వాత ప్రభుత్వానికి, ఐటీడీ కంపెనీకి మధ్య వివాదం తలెత్తడంతో పనులు నిలిచి పోయాయి. 2013లో యుఏఎన్ మ్యాక్స్ కంపెనీకి పనులు ఈపీసీ విధానంలో దక్కాయి. అప్పటినుంచి పనులు జరుగుతున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుపానుకు సువర్ణముఖి నదిపై నిర్మించిన అక్విడెక్ట్‌ను ఆనుకుని 17.7 కిలోమీటరు వద్ద కాలువకు గండి పడింది. గండిపూడ్చివేత పనులు నిర్వహిస్తుండగానే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి, తోటపల్లి నుంచి ఖరీఫ్‌కు నీరిస్తామని ప్రకటించేశారు. దీంతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడిని మరింత పెంచారు. అక్విడెక్టు వద్ద ఉన్న శ్లాబ్కల్వర్టుకు పెద్ద రంధ్రం చేసి దానిలోపలకు మనుషులు వెళ్లి మరమ్మతు చేయవలసి వచ్చింది. నది ఒడ్డున ఊపిరి ఆడని ప్రదేశాల్లో పనులు చేయించడంతో పాటు నాణ్యతను పూర్తిగా విస్మరించారు. దీంతో భవిష్యత్‌లో గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన నేడు నిజమైంది. గరుగుబిల్లి వద్ద ఆ శాఖ అధికారులు శుక్రవారం నిర్వహించిన ట్రయిల్ రన్‌కు కాలువ ద్వారా వచ్చిన నీటి ప్రవాహం వల్ల కాలువ నిండి నీరు ఉంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి శనివారం ఉదయం 11 గంటల సమయంలో 17.7 కిలోమీటరు వద్ద మళ్లీ గండి పడింది. దీంతో అక్విడెక్ట్ చూట్టూ వేసిన రాతి కట్టడాలతోపాటు మట్టి కొట్టుకుపోయింది. దానిని నిలుపుదల చేయడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నా ఫలితం లేకపోయింది. ఈ నెలాఖురన ముఖ్యమంత్రితో జలాలు విడుదల చేయించాలని ట్రయిల్ రన్ వేస్తే ఇప్పుడు ఇలా జరగడంతో ఇటు అధికార పార్టీ నాయకులు, అటు నీటిపారుదలశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కాలువ ద్వారా సీతానగరం, బొబ్బిలి, తెర్లాం. బాడంగి మండలాల్లో దాదాపు 9,300 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు అంతగా పడకపోవడం వల్ల ఈ అక్విడెక్టు వద్ద నిర్మాణంలో డొల్లతనం ఆలస్యంగా తెలిసింది. అధికారుల నిర్లక్ష్యమే కారణం: ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి తోటపల్లి కాలువకు శనివారం పడిన గండిని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజక వర్గాల రైతులకు సాగు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ మేరకు పనులు వేగవంతం చెయ్యాలని మార్గదర్శకాలు విడుదల చేశారన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గండి పడిందని అన్నారు. దీనికి బాధ్యులైనవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతామన్నారు. ఆయన వెంట పాజెక్ట్ డీఈ రమణమూర్తి, పార్వతీపురం ఏఎంసీ చెర్మైన్ రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటనాయుడు, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. కాగా ఏగోటివలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ వల్ల ఇబ్బందులు రాకుండా రక్షణ గోడ నిర్మించాలని ఎంపీటీసీ సభ్యులు డి.నాగరత్నం నేతృత్వంలో రైతులు ఎమ్మెల్సీని, అధికారులను కోరారు. మంత్రి మృణాళిని పరిశీలన సీతానగరం: తోటపల్లి కాలువకు పడిన గండిని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గండి పూడ్చివేత పనులను వేగవంతం చెయ్యాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించామన్నారు. ఆమె వెంట ఎమ్మెల్సీ డి.జగదీష్, ఎమ్మెల్యే బి.చిరంజీవులు, పార్వతీపురం ఆర్డీవో రోణంకి గోవిందరాజు, ఎస్ఈ తిరుమలరావు, ప్రాజెక్ట్ సలహాదారు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కె.గణపతిరావు, రెవెన్యూ సీనియర్ సహాయకులు శివయ్య ఉన్నారు. కాన్వాయ్ వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు గండి పరిశీలించాక మంత్రి మృణాళిని బొబ్బిలి వైపు తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌లోని వాహనం ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. చినబోగిలి సమీపంలో జరిగిన ఈ ఘటనలో సీతానగరం గ్రామానికి చెందిన బి.వెంకటేష్, బి.రాంబాబు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి స్పందించి గాయపడినవారితో మాట్లాడారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్నాక పయనమయ్యారు. -
ఘాట్ ఇక్కడ.. నీళ్లు అక్కడ..!
పుష్కర స్నానం.. ఓ ప్రహసనం అధికారుల ఇష్టారాజ్యం కనీస సర్వే చేయకుండా ఇంజినీర్ల నిర్వాకం ఇసుకలో కిలోమీటరు నడిస్తేనే నీళ్లు ఒడ్డుకు చేరువగా నీళ్లున్న ప్రాంతాలను పట్టించుకోని అధికారులు హైదరాబాద్: ఓ అభివృద్ధి పనిచేపట్టే సమయంలో ముందుగా సర్వే చేయడం తప్పనిసరి... అదీ లక్షలాది నమ్మకంతో కూడుకున్నది అయినప్పుడు మరింత ముందుచూపు అవసరం. కానీ, ఇంజనీరింగ్ అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఇష్టారీతిగా పనులు చేపట్టడం వల్ల అటు డబ్బు వృథా కావడమే కాక.. భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కుంభమేళా తరహాలో జరుపుతామంటూ ఆర్భాటం చేస్తున్న గోదావరి పుష్కరాల విషయంలో అధికారుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. దీంతో పుష్కర భక్తులకు పుణ్యస్నానం ఈసారి ఓ ప్రహసనమే కాబోతోంది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం ముళ్లకట్ట వద్ద అధికారులు దాదాపు రూ.4.50 కోట్లు వెచ్చించి 168 మీటర్ల పొడవుతో భారీ ఘాట్‌ను నిర్మించారు. కానీ, ఇక్కడ నీళ్లజాడేలేదు. భక్తులు నదీ స్నానం చేయాలంటే ఘాట్ దిగి ఇసుకలో కిలోమీటర్ దూరంలోని అవతలి ఒడ్డుకు వెళ్లాల్సిందే. రోడ్డుకు చేరువగా ఉంటుందన్న ఒకేఒక్క కారణంతో ఇక్కడ ఘాట్లు కట్టేశారు. ఈ ప్రాంతానికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఒడ్డును ఆనుకునే నీటి ప్రవాహం ఉంది. ఎండాకాలంలోనూ అక్కడ నీటి ప్రవాహం ఉంటుందనే విషయం స్థానికంగా అందరికీ తెలుసు. కానీ, వానలు పడకుంటే ముళ్లకట్ట వద్ద నీళ్లుండవనే కనీస విషయాన్ని కూడా గుర్తించకుండా అక్కడ ఘాట్‌ను కట్టారు. పోనీ ఒడ్డుకు నీటి ప్రవాహం ఉన్నచోటే స్నానం చేద్దామంటే.. అక్కడ మూడు మీటర్ల ఎత్తుతో ఒడ్డు ఉంటుంది. దిగడం చాలా కష్టం. పొలాలు ఉండడంతో అక్కడి వరకు వెళ్లడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ముందే ఆ ప్రాంతాన్ని గుర్తించి రైతుల అనుమతితో అప్రోచ్ రోడ్డు వేసి ఘాట్లు కట్టి ఉంటే బాగుండేదని స్వయంగా మంత్రులే పేర్కొంటుండడం విశేషం. ఆవలివైపు వెళ్తే గట్టునానుకునే భారీ నీటి ప్రవాహం ఉంది. అయితే అక్కడ ఒడ్డు చాలా ఎత్తుగా ఉండడంతో నీటిలో దిగటం ప్రమాదకరం. ఘాట్ల వద్ద నీళ్లు లేవన్న ఉద్దేశంతో భక్తులెవరైనా అక్కడ స్నానం చేసే ప్రయత్నం చేస్తే ప్రమాదాలబారిన పడే అవకాశం ఉంది. ఇక రామన్నగూడెం వద్ద గతంలో నిర్మించిన పాత ఘాట్లున్నాయి. అక్కడ నీటి జాడ లేకపోయినా రూ.50 లక్షలు వెచ్చించి పాతవాటిని కొత్తగా మార్చారు. భక్తులు నీటికోసం ఆ ఘాట్లు దిగి నదిలోకి కనీసం అరకిలోమీటరు దూరం వెళ్లాలి. ఇసుకలో నడక కష్టమన్న ఉద్దేశంతో మంత్రుల సూచన మేరకు అధికారులు తాజాగా ఇసుకబస్తాలు వేసి బాట ఏర్పాటు చేశారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌నగర్ వద్ద ఒడ్డును ఆనుకునే భారీగా నీటి ప్రవాహం ఉంది. కొత్త ఘాట్లు అక్కడే నిర్మించి ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉండేది. మంగపేట వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించిన ఘాట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి. 50 మీటర్ల మేర ఇసుకలో నడిస్తే తప్ప నీటి జాడలేదు. -
జీఎంసీకి పూర్వ వైభవం
సాక్షి, గుంటూరు : ఎందరో గొప్ప వైద్యులను తయారు చేసిన గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)కి పూర్వ వైభవం రానుందా.. రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న గుంటూరు నగరంలో ఉన్న ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)కు మహర్దశ పట్టనుందా.. అనే ప్రశ్నలకు ఉన్నతస్థాయి వైద్య వర్గాలు అవునంటున్నాయి. ఇప్పటి వరకూ 150 సీట్లకే సరైన భవన సముదాయాలు, బోధనా సిబ్బంది, వైద్య పరికరాలు లేకపోవడంతో భారత వైద్యమండలి తనిఖీలు చేసినప్పుడల్లా అసంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల పరిస్థితి మెరుగుపడిందని గుర్తించిన భారత వైద్య మండలి బృందం ఇటీవల గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 200 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెంచాలని భారత వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. గుంటూరు వైద్యకళాశాలకు 250 సీట్లు మంజూరు చేయాలంటే జీజీహెచ్, జీఎమ్సీల్లో నూతనభవనాల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలుకు సుమారుగా రూ.300 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని ఏపీఎమ్ఎస్ఐడీసీకి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. 250 సీట్లు మంజూరు చేయాలంటే భారత వైద్య మండలి నిబంధనల మేరకు ఎలాంటి భవనాలు నిర్మించాలి, సౌకర్యాలను ఏమేరకు మెరుగుపర్చాలి, కావాల్సిన వైద్య పరికరాలు వంటి వాటిపై మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన భార్గవ్ అసోసియేట్స్ కంపెనీకి అప్పగించారు. వైద్య కళాశాలలో శిథిలావస్థకు చేరిన రీజనల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ విభాగాల భవనాలను కూల్చి వాటి స్థానంలో ఐదు అంతస్తులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన భవనాలు నిర్మించేందుకు బార్గవ్ అసోసియేట్‌కు చెందిన ఇంజినీర్ల బృందం వైద్య కళాశాలకు వచ్చి పరిశీలించారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో మెడికల్ స్టోర్స్ విభాగం, లాండ్రి, మోడ్రన్ కిచెన్, వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం, కాలినగాయలవారికి ప్రత్యేకవార్డు, బ్లడ్‌బ్యాంక్, కాన్పుల విభాగం, ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, నర్సుల క్వార్టర్స్, రెసిడెంట్ డాక్టర్స్ క్వార్టర్స్ తదితర విభాగాలను నిర్మించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నేడు వైద్య కళాశాలలోని అన్ని విభాగాల అధిపతులతో కళాశాల అధికారులు సమావేశమై దీనిపై చర్చించనున్నారు. -
మూలవాగుపై ఫోర్‌లేన్ బ్రిడ్జి
బోయినపల్లి : మండలంలోని కొదురుపాక నుంచి వేములవాడ మండలం ఆరెపల్లి వరకు ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీరింగ్ అధికారులు ఆదివారం కొదురుపాకలో ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. మధ్యమానేరు జలాశయంలో కొదురుపాక, శాభాష్‌పల్లి, వరదవెల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో కరీంనగర్ నుంచి వేములవాడ వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి అధికారులు నిర్ణరుుంచారు. ఈ క్రమంలో కరీంనగర్-సిరిసిల్ల మధ్యలో ఉన్న మూడు గ్రామాల రోడ్లు మిడ్‌మానేర్ జలాశయంలో ముంపునకు గురవుతున్నాయి. వీటి స్థానంలో ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్అండ్బీ, మిడ్‌మానేర్ ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేశారు. కొదురుపాక నుంచి వేములవాడ మండలం ఆరెపల్లి గ్రామ పరిసరాల వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని అంచనాకు వచ్చారు. ఇప్పుడున్న పాత రోడ్డు స్థానంలో ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మిస్తే దాదాపు రూ. 150 కోట్లు వ్యయం కానుంది. అయితే కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి మూలమలుపులు లేకుండా స్ట్రేట్‌గా ఆరెపల్లి వరకు బ్రిడ్జి నిర్మిస్తే రూ.75 కోట్లు, వరదవెల్లి వయా సంకెపెల్లి గ్రామాల మీదుగా ఆరెపల్లి వరకు బ్రిడ్జి నిర్మిస్తే రూ. 50 కోట్లు వ్యయం కానుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మిడ్‌మానేర్ నీటి ఉధృతి తగలకుండా ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆర్అండ్బీ ఈఈ రాఘవచారి, మిడ్‌మానేర్ ఈఈ గోవిందరావు, డీఈ, ఏఈలు, జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, నాయకులు జక్కని లక్ష్మీనారాయణ, పాపారావు తదితరులు ఉన్నారు. నేడు మార్కింగ్ ఫోర్‌లేన్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో రూట్‌మ్యాప్ తయారుచేసి సోమవారం మార్కింగ్ ఇవ్వడానికి ఆర్అండ్బీ, మిడ్‌మానేర్ ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు కొదురుపాక గ్రామం నుంచి ఫోర్‌లైన్ బ్రిడ్జి నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వనున్నారు. -
పరిశీలన పూర్తయింది..
పాఠశాలలను సందర్శించిన 17 బృందాలు టాయిలెట్లు, నీటి సౌకర్యంపై ఆరా నివేదికలతో నేడు హైదరాబాద్‌కు... అవసరమైన పాఠశాలలకు ఎస్ఎస్ఏ నిధులు విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సర్వశిక్షాభియాన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశీలన పూర్తయింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో టాయిలెట్లు ఉన్నాయా, ఉంటే నీటి సౌకర్యం ఎలా ఉంది, వినియోగంలో ఉన్నా యా, లేదా అని ఆరా తీశారు. ఇంజినీరిం గ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన 17 బృందాలు జిల్లాలోని అన్ని పాఠశాలలను స్వయంగా తనిఖీ చేశాయి. ఈ మేరకు తనిఖీల్లో తేలిన వివరాలతో నివేదిక రూపొందించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు, నీటి వసతి కల్పించాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, పాఠశాలల్లోని వసతులపై నివేదిక సమర్పించాలని సూచించింది. ఇందుకు ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరిన విషయం విదితమే. ఈ మేరకు 17 బృందాలుగా ఏర్పడిన అధికారులు వారం రోజుల పాటు అన్ని మండలాల్లోని పాఠశాలలను పరిశీలించారు. జిల్లాలో పీఎస్, యూపీఎస్, హైస్కూళ్లు కలిపి 3,266 పాఠశాలలు ఉండగా, వీటిలో 57 పాఠశాలల్లో అసలు టాయిలెట్స్ లేవని వెలడైంది. అంతేకాకుండా 460 పాఠశాలల్లో ఒక్కో టాయిలెట్ మాత్రమే ఉన్నట్లు, 600నుంచి 700 పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నా నీటి వసతి లేకపోవడం వంటి కారణాలతో నిరుపయోగంగా మారినట్లు గుర్తించారు. ఆగస్టు 31లోగా వసతుల కల్పన పాఠశాలల తనిఖీలో భాగంగా అసలు టాయిలెట్స్ లేని పాఠశాలలను గుర్తించి న అధికారులు వాటికి రూ.35వేల చొప్పు న నిధులను గురువారం మంజూరు చేశా రు. అలాగే, ఒక్కో టాయిలెట్ ఉన్న పాఠశాలలకు మరొకటి మంజూరు చేశారు. అంతేకాకుండా ఉపయోగంలో లేని టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని, దీనికోసం రన్నింగ్ వాటర్ లేకపోతే నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతం లో 131 టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అధికారులు తాజాగా మంజూరు చేసిన అన్ని నిర్మాణాలను ఆగస్టు 31వతేదీ కల్లా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా 400 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేదని గుర్తించిన అధికారులు క్యాన్ల ద్వారా నీరు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. నేడు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు తెలుసుకునేందుకు చేపట్టిన సర్వేపై హైదరాబాద్ శుక్రవారం సమీక్ష జరగనుంది. సర్వేలో వెల్లడైన అంశాలతో రూపొందిం చిన నివేదికతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు సర్వశిక్షాభియాన్ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొంటారు. -
చెక్కేకొద్దీ అక్రమాలే..
స్థపతుల చేతివాటం-శిల్పుల పాలిట శాపం ప్రైవేటు కేంద్రాలు, కాంట్రాక్టర్‌తో లాలూచీ శిల్ప తయారీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు ఊపిరితిత్తుల సమస్యతో శిల్పుల ఇక్కట్లు చోద్యం చూస్తున్న టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తిరుపతి సిటీ: తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి అనుబంధంగా అలిపిరి వద్ద నడుస్తున్న శిలా శిల్ప తయారీ కేంద్రంలో చెక్కేకొద్దీ స్థపతుల అక్రమాలు బయటపడుతున్నాయి. కాంట్రాక్టర్ నాసిరకం బండలను సరఫరా చేయడంతో టీటీడీకి నష్టంతోపాటు శిల్పుల సుదీర్ఘ శ్రమ నేలపాలవుతోంది. కొందరు స్థపతులు సం బంధిత కాంట్రాక్టర్, ప్రైవేటు తయారీ కేంద్రాలతో చాలాకాలంగా ఏర్పరచుకున్న లోపాయికారి ఒప్పందాలతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. శిల్పులు మాత్రం బతుకు బండిని లాగడం కోసం భగవంతుడిపై భారమేసి రాతి శిల్పాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోస్తున్నారు. టీటీడీ అందించే తృణమో పణమో పుచ్చుకుని జీవనం సాగిస్తూ.. కనీస సౌకర్యాలు లేకపోయినా కుటుంబాన్ని పోషించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఏర్పాటు- ఆవశ్యకత హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం టీటీడీ 1965లో శిల్ప కళాశాలను స్థాపించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేవాలయ నిర్మాణం, రాతి, దారు, లోహ, సుద్ధ శిల్పాల తయారీ, కళంకారీ విగ్రహాల తయారీలకు సంబంధించి ఆరు రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. అందులో ముఖ్యమైనవి రాతి శిల్పాల తయారీ. ఇందులో 65 మంది శిల్పులు పనిచేస్తున్నారు. దేవాలయాలకు అవసరమయ్యే విగ్రహాలను టీటీడీ 75 శాతం సబ్సిడీతో అందిస్తోంది. ఇందుకు టీటీడీ ఏటా రూ.2కోట్ల మేర ఖర్చు చేస్తోంది. కాంట్రాక్టర్‌తో మిలాఖత్ శిల్పాలకు అవసరమ్యే రాతి బండలను తమిళనాడు రాష్టంలోని చెంగల్పట్టు నుంచి సంబంధిత కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు ఆదాయం పెంచి అందులో తలా కొంచెం పంచుకునేందుకు ఇక్కడి అధికారులు అలవాటుపడ్డారు. వచ్చే ఆదాయం స్థపతులనుంచి ఇంజినీరింగ్ అధికారుల వరకు పంచుకుం టారు. ఈ క్రమంలో ధర ఎక్కువ పలికే ఏడెనిమిది బొమ్మలకు అయ్యే విధంగా పెద్దపెద్ద బండరాళ్లనే తెప్పిస్తారు. వీటి ద్వారా అటు టీటీడీకి వేస్టేజ్ రూపంలో భారీగా నష్టం వాటిల్లుతోంది. చివరిదశలో విరిగిపోయి ఇటు శిల్పులకు శ్రమ వృథా అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో పీస్రేటులో ఒక్కపైసా కూడా అందకుండా నోటి దగ్గరకు వచ్చే అన్నం దూరమైనట్టు అవుతోందని శిల్పులు ఆవేదన చెందున్నారు. ఆర్డర్లకు అనుగుణంగా ఉండే బండరాళ్లు తెప్పిస్తే అటు టీటీడీకి ఇటు శిల్పులకూ ఎటువంటి నష్టం ఉండదనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. శిల్పుల సంఖ్యకు తగ్గట్టు ఆరుగురు మార్కర్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్క మార్కర్నే అందుబాటులో ఉంచి టీటీడీకి మరింత నష్టం చేకూరుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరచిన 2008 నాటి బోర్డు తీర్మానం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాం లో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పీసురేటు శిల్పుల కష్టాలను తొలగించేందుకు వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తింపు కార్డులతోపాటు, ఇంటి స్థలాలు, స్విమ్స్‌లో ఉచిత వైద్యం, సబ్సిడీ లడ్డూలు, దర్శన ఏర్పాట్లను కల్పించాలని తీర్మానించారు. అయితే అవి ఏవీ అమలుకు నోచుకోలేదు. స్థపతుల చేతివాటం కొందరు స్థపతులు ప్రైవేటు తయారీ కేంద్రాలతో చేతులు కలపడంతో థార్మిక సంస్థ పరువు దిగజారుతోంది. ఇక్కడ పనిచేసే ఒక అసిస్టెంట్ స్థపతి టీటీడీ శిల్ప తయారీ కేంద్రానికి వచ్చే విగ్రహాల ఆర్డర్లను ప్రైవేటుకు పంపి వేలకువేలు దండుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా టీటీడీలో పనిచేసే పదిమంది శిల్పులను బెదిరించి ప్రైవేటు తయారీ కేంద్రాల్లో పనిచేయిస్తున్నారు. అందుకు వారు సమ్మతించకపోతే వారిని కక్షసాధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ పర్యవేక్షించాల్సిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇదే పోస్టులో ఏడేళ్లపాటు దీర్ఘకాలంగా కొనసాగుతున్నా సందర్శించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. అలాంటిదేమీ లేదు.. శిల్పాల తయారీ కేంద్రంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగడం లేదు. ఈవో అనుమతితో ఒక్క అనంతశయుని విగ్రహతయారీని మాత్రం ప్రైవేటు వాళ్లకు ఇచ్చాం. ఇంతవరకు విరిగినట్టు ఒక్క కంప్లైంటూ లేదు. -నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టీటీడీ -
ప్రమాదం ‘అంచుల్లో’ ప్రయాణం
ఇరవైచోట్ల కొండ చరియలు కూలే అవకాశాలు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారుల సూచన సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్రోడ్ల ప్రయాణం ప్రమాదం అంచుల్లోకి చేరింది. వర్షాకాలం వస్తే చాలు రెండు ఘాట్‌రోడ్లలోనూ కొండ చరియలు విరిగి పడటం సర్వసాధారణమైపోయింది. రెండు రోజులుగా రెండో ఘాట్‌రోడ్డులోని చివరి ఐదు మలుపుల్లో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని చోట్ల విరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపుగా ఇరవైకి పైగా ఇలాంటి ప్రదేశాలు ఉన్నట్టు ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. మొదటి ఘాట్‌రోడ్డులో తక్కువే 1944, ఏప్రిల్ 10వ తేదీన తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలకు 56 మలుపులతో కూడిన మొదటి ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 1973వ సంవత్సరం వరకు ఈ రోడ్డులోనే రాకపోకలన్నీ సాగేవి. ఏకధాటిగా కురిసే కుండపోత వర్షాల వల్ల కేవలం అవ్వాచ్చారి కోన ఎగువ ప్రాంతం, కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు మాత్రమే కొండ చరియలు అడపా దడపా విరిగి పడుతున్నాయి. రెండో ఘాట్‌రోడ్డులో కూలుతున్న చరియలు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు భారీగా పెరుగుతుండటంతో 1969 నుంచి 1973 మధ్య కాలంలో రెండో ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో అలిపిరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల తర్వాత మొదలై తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ చివరి ఐదు మలుపుల వద్ద ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ. రెండు రోజుల పాటు వరుసగా ఓ మోస్తరులో కుండపోత వర్షం కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడటం సాధారణమైపోయింది. అదృష్టవశాత్తు అలాంటి ఘటనల్లో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని భక్తులు భావిస్తున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. తాజాగా, ఇటీవల కురిసిన వర్షాలకు రెండు రోజులుగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఏడేళ్లకు ముందు త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండచరియలు విరిగి పడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ నిపుణులను రప్పించి వాటిని తొలగిం చారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండలోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. చివరి మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగి పడటంతో రెండేళ్లకు ముందు అక్కడ ఇనుప కంచె నిర్మించారు. దీనివల్ల బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే సుమారు మరో ఇరవై ప్రాంతాల్లో వెలుగుచూస్తుండ టం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి సమాచారం చెవిన పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వీటిని ని వారించాలంటే ఆయా ప్రాంతాల్లో సిమెంట్ కాంక్రీట్, ఇనుప కంచె నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితులు క నిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొండ చరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో వాహనదారులు, ద్విచక్రాలపై వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండా లని అధికారులు సూచించారు. -
పైప్‌లైన్ టెండర్ల తకరారు
కాలం చెల్లిన చెక్కులిచ్చిన కాంట్రాక్టర్ టెండర్ ఖరారు చేసిన అధికారులు నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక బైపాస్‌రోడ్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనుల బండారం బట్టబయలయ్యింది. పైప్‌లైన్ నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ ఈ నెల ఆరో తేదీ శుక్రవారం సాక్షిలో ‘నిబంధనలకు విరుద్ధంగా పైప్‌లైన్ నిర్మాణం’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ పనులకు సంబంధించిన వివరాల ఫైల్‌ను తమకు చూపాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రెండు రోజులుగా కమిషనర్‌ను కలసి డిమాండ్ చేశారు. రెండు రోజులుగా సంబధిత గుమస్తా నవప్రకాష్ సెలవులో ఉన్నాడంటూ ఇంజినీరింగ్ అధికారులు దాటవేస్తూ వచ్చారు. శనివారం ఈ పైప్‌లైన్ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ను చూపుతామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు శనివారం కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి ఫైల్ తెప్పించి చూపాలని కోరారు. దీంతో ఆయన ఫైల్‌ను తెప్పించారు. ఈ ఫైల్‌ను కౌన్సిలర్లు పరిశీలించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీనివాసనగర్‌లోని సంపు నుంచి బైపాస్ రోడ్‌లోని సర్కిల్ వరకూ 250 మీటర్ల మేర రూ.3.60 లక్షలతో నూతన హెచ్డీపీఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు అర్జెంట్ షార్ట్టెండర్ను 2014 మార్చి 10వ తేదీన పిలిచారు. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు డొక్కు వీర్రాజు, డొక్కు రమేష్‌కుమార్ మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. వీరిద్దరిలో వీర్రాజు రెండు శాతం తక్కువకు పనులు చేసేందుకు టెండర్ వేసి పనులను దక్కించుకున్నాడు. కాగా ఈ పనులను దక్కించుకున్న వీర్రాజు టెండర్ ధరావతును డీడీ రూపంలో టెండర్ పిలిచిన తేదీ తర్వాత తేదీతో ఇవ్వాల్సి ఉంది. అయితే వీర్రాజు 2013 డిసెంబర్ 5వ తేదీన తీసిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులను టెండర్‌కు జతచేశాడు. అయితే ఈ టెండర్ షెడ్యూల్‌కు ధరావతు డీడీలను జత చేయాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చాడు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, షేక్ అచ్చేబాలు కమిషనర్, ఏఈ రాంపరసాద్, గుమస్తా నవప్రకాష్ను నిలదీశారు. ఇన్ని లోపాలు ఉండగా ఈ టెండర్‌ను ఎలా పరిగఱణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఫోర్స్‌లో లేని రమేష్‌కుమార్ వేసిన టెండర్‌ను ఎలా పరిగణనలోకి తీసుకున్నారని నిలదీశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రకటనలను ఏ పత్రికలోనూ, ఆన్లైన్లో ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారాను పిలువకుండానే టెండర్లు ఎలా ఆమోదించారని, అలాగే మినిట్స్ పుస్తకంలో ఈ పని వివరాలు నమోదే చేయకుండా ఎలా పని చేయిస్తున్నారని వారు ప్రశ్నించారు. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ టెండర్‌ను ఎందుకు పెట్టారని, బైపాస్ రోడ్లో ఎన్నో యేళ్లుగా పైప్‌లైన్ లీకవుతుంటే ఈ పనులు ఇప్పుడే ఇంత అడ్డగోలుగా ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఒక వేళ అంత అవసరం అనుకుంటే చిన్న పనే కాబట్టి ఈ పనిని శాఖా పరంగానే ఎందుకు చేయలేకపోయారని అడిగారు. మెదటి సారి తప్పు తమ దృష్టికి వచ్చింది కాబట్టి సిబ్బంది తప్పైపోయింది అని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని లేకుంటే తప్పులు రుజువైనందున సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్‌ను డిమాండ్ చేశారు. రెండు రోజులుగా టెండర్ ఫైల్ చూపుతామని హామీ ఇచ్చిన ఎంఈ గద్దె ప్రదీప్‌కుమార్ శనివారం లేకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన కమిషనర్ మారుతీదివాకర్ మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే మున్సిపాలిటీకి చెందిన ధనం మాత్రం వృథాకాలేదన్నారు.సోమవారం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలసిన కౌన్సిలర్లలో మీర్ అస్గర్‌అలీ, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్, శీలం బాబ్జీ, ధనికొండ నాగమల్లేశ్వరి, బందెల కవిత, మట్టా తులసి, కే లీలాకుమారి తదితరులు ఉన్నారు. -
అప్పన్న కల్యాణోత్సవం నేడే
సాయంత్రం 4 గంటలకు కొట్నాలు ఉత్సవం రాత్రి 7 గంటల నుంచి ధ్వజారోహణం 8గంటల నుంచి ఎదురు సన్నాహం 9 గంటల నుంచి రథోత్సవం 10.30 నుంచి కల్యాణం విస్తృత ఏర్పాట్లు సింహాచలం, న్యూస్‌లైన్ : చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలేశుడి వార్షిక కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు అర్చకులు, ముత్తైవులు పసుపు కొమ్ములను శాస్త్రోక్తంగా దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ధ్వజస్తంభం వద్ద దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకిలో, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకిలో ఉంచి మాడ వీధుల్లో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి తొలి దర్శనాన్ని వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజుకు కల్పిస్తారు. రాత్రి 9 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 గంటల నుంచి నృసింహ మండపంలో ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. విస్తృత ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు విస్తృత ఏ ర్పాట్లు చేశారు. నృసింహ మండపంలో భారీ కల్యాణవేదికను ఏర్పాటు చేశా రు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు నృసింహ మండపం నాలుగు గేట్లలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వనున్నారు. -
‘లింకు’ వివాదం
ఏలూరు, న్యూస్‌లైన్ :వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల నిధులతో గ్రామాల్లో లింకురోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని తోసిరాజని పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ శాఖలకు నేరుగా నిధులు మళ్లించాలన్న నిర్ణయంపై ఏఎంసీ చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. తమ శాఖ నిధులపై వేరే శాఖల పెత్తనం ఏమిటని భావించిన వారు అమీతుమీకిసిద్ధపడటంతో రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంసీల నిధలుఉ రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందలాది కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం రూ.100 కోట్ల పనులకే అనుమతినివ్వడంపైనా విమర్శలు రేగుతున్నాయి. ఒక్కో ఏఎంసీ పరిధిలో పనులకు రూ.50 లక్షలు మంజూర య్యే అవకాశం కూడా కనిపించటం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 18 కమిటీల్లో రూ.75 కోట్లకుపైగా నిధులు మూలుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవలే ఐదారు కమిటీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఏలూరు కమిటీ పాలకవర్గం గడువు ముగిసి నెల అవుతున్నా ఇంకా కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. నిషేధం తొలగిందనే ఆనందం మిగలలేదు ఏఎంసీల పరిధిలో లింకురోడ్ల అభివృద్ధిపై నిషేధాన్ని 2005లో విధించారు. ఎన్నికల సీజన్ తరుమకొస్తుండటంతో ఎమ్మెల్యేలు, ఏఎంసీల చైర్మన్ల కోరిక మేరకు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో జీవో జారీ చేసింది. ఆ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు కోరింది. అయితే ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని విస్మరించి పాత పద్ధతిలోనే పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ విభాగాలకు పనులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. పైగా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి గతంలో అభివృద్ది చేసిన గ్రావెల్ రోడ్లును బీటీ రోడ్లుగా మార్చేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో చైర్మన్లు ప్రతిపాదనలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఏ ఏఎంసీలోను ప్రతిపాదనలను రూపొందించే పరిస్థితి లేదు. కొద్ది నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పనులు ప్రారంభించే అవకాశం ఎలాగూ ఉండదు. సమీక్షించనున్న కలెక్టర్ మార్కెటింగ్ శాఖ పరిధిలో అన్ని కమిటీలకు పూర్తిస్థాయి కార్యదర్శుల నియామకం ఇటీవలే జరిగింది. దీంతో ఈ శాఖ పనితీరు, లింకురోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ రెండు మూడు రోజుల్లో జిల్లాలోని ఏఎంసీ మంది కార్యదర్శులతోను సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ విషయంపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. -
పచ్చదనానికి జై
= 80 చెరువుల వద్ద గ్రీనరీ అభివృద్ధికి శ్రీకారం = పక్కా ప్రణాళికతో కదలిన అర్బన్ ఫారెస్ట్రీ = హెచ్ఎండీఏలో మొగ్గతొడిగిన పనులు సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ నగరాలకు దీటుగా గ్రేటర్ హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు హెచ్ఎండీఏ కంకణం కట్టుకుంది. నగరంలో రోజురోజుకూ క్షీణిస్తున్న పర్యావరణాన్ని పరిరక్షించి, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు వీలుగా వివిధ చెరువుల వద్ద సుందర నందన వనాలను సృష్టించేందుకు రంగంలోకి దిగింది. చీఫ్ సెక్రటరీ మహంతి ఆదేశాల మేరకు చెరువుల అభివృద్ధిపై హెచ్ఎండీఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆక్రమణలకు గురవుతున్న చెరువులను గుర్తించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. పాత హుడా పరిధిలోని 80 చెరువుల వద్ద తాజాగా మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమాన్ని వచ్చే డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన అధికారులకు గడువు నిర్దేశించారు. ఈ మేరకు అర్బన్ ఫారెస్ట్రీ/ ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించేందుకు అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు. ఇప్పటికే 35 చెరువుల వద్ద మొక్కలు నాటేందుకు అనువుగా గుంతలు (పిట్స్) సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని 80 జలాశయాల వద్ద పచ్చదనం పరిఢవిల్లేందుకు అందమైన, ఆకర్షణీయమైన పూల మొక్కలతో పాటు నీడనిచ్చే వృక్ష జాతులకు చెందిన మొక్కలను నాటుతున్నారు. ప్రధానంగా చెరువు కట్టపైన ఆకాశమల్లె, సిల్వర్‌ఓక్, బాటిబ్రష్, బోగన్ విలియా ఇతర పూల మొక్కలు నాటుతుండగా, చెరువుల ఎఫ్టీఎల్ ప్రాంతంలో తుమ్మ, కానుగ, నేరెడు, బరింగ్టోనియా, ఏరుమద్ది రకాల మొక్కలు నాటుతున్నారు. ఇవి నీటిలో సైతం ఎదుగుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 80 చెరువుల వద్ద సుమారు 5-6 లక్షల మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా మేడ్చెల్ చెరువు, తెల్లాపూర్, మేళ్ల చెరువు, వనంచెరువు తదితర చెరువుల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే మొదలైందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెరువుల వద్ద పచ్చని వనాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే గాక వలస పక్షులకు సైతం ఆవాసం కల్పించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్రమణలకు అడ్డుకట్ట... చెరువుల ఎఫ్టీఎల్ బౌండ్రీస్ను ఖరారు చేసిన హెచ్ఎండీఏ ఇప్పుడు ఆక్రమణలను అడ్డుకొనేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. ఇందులో భాంగా ఇంజనీరింగ్ విభాగం పలు చెరువుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటుకు పూనుకొంది. ప్రధానంగా పాత హుడా పరిధిలో మొత్తం 501 చెరువులున్నట్లు రికార్డుల్లో గుర్తించగా.. ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే జరిపించగా ప్రస్తుతం 301 చెరువులు మాత్రమే భౌతికంగా ఉన్నట్లు లెక్క తేలింది. వీటిలో కొన్ని చెరువులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చే యాలని ఇటీవల లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు హెచ్ఎండీఏ పరిధిలో 80 చెరువులు, జీహెచ్ఎంసీ 128, ఇరిగేషన్ విభాగం 50 చెరువులను అభివృద్ధి చేసేందు కు నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ తన పరిధిలోని 80 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఒక్కో చెరువు వద్ద గ్రీనరీ, ఫెన్సింగ్ వంటివి అభివృద్ధి చేసేందుకు రూ.15-20 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే... పెద్ద చెరువులకు అంచనాలు పెరగవచ్చంటున్నారు. మేడ్చెల్ చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.64.8 లక్షల అంచనా వ్యయంతో తాజాగా టెండర్లు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా వచ్చే డిసెంబర్/మార్చి నాటికల్లా అన్ని పనులు పూర్తిచేసి మొత్తం 80 చెరువుల వద్ద పచ్చదనం పరిఢవిల్లేలా చేయాలన్నది హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు అధికారులు చెబుతున్నారు.