కృష్ణా కెనాల్‌లో రైల్వే అధికారుల పర్యటన | Krishna Canal Railway officials tour | Sakshi
Sakshi News home page

కృష్ణా కెనాల్‌లో రైల్వే అధికారుల పర్యటన

Published Sun, Mar 20 2016 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

కృష్ణా కెనాల్‌లో   రైల్వే అధికారుల పర్యటన

కృష్ణా కెనాల్‌లో రైల్వే అధికారుల పర్యటన

 పుష్కర ఏర్పాట్ల పరిశీలన
 
తాడేపల్లి రూరల్ : దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు శనివారం కృష్ణా కెనాల్ జంక్షన్‌కు విచ్చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో కృష్ణా కెనాల్‌ను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై వీరి పర్యటన సాగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్ మాట్లాడుతూ పుష్కరాలకు కృష్ణా కెనాల్ జంక్షన్‌లో మౌలిక సదుపాయాలు కల్పిం చేలా చర్యలు తీసుకుంటున్నామని, రైల్వేస్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేయవచ్చో పరిశీలించడంతోపాటు కృష్ణా కెనాల్‌కు తాడేపల్లి ప్రధాన రహదారి వెంబడి మరో రైల్వే బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయడం, ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయడం, తాగునీటితోపాటు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించడం చేస్తామని తెలిపారు. ప్లాట్‌ఫాం పొడవు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో సీనియర్ డీసీఎం ఎంవీ సత్యనారాయణ, డీవోఎం సత్యనారాయణ, ఐవోడబ్ల్యూ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement