పనులు చేసుడే లేదు! | no road works to panchayithi raj | Sakshi
Sakshi News home page

పనులు చేసుడే లేదు!

Published Sat, Jan 2 2016 1:40 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

పనులు చేసుడే లేదు! - Sakshi

పనులు చేసుడే లేదు!

►  రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం
►   పనులు దక్కించు కోవడంపైనే దృష్టి
►   పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం
►   ఇంకా ప్రారంభించని  12 మంది
►    చర్యలపై అధికారుల  ఉదాసీనత
 సాక్షిప్రతినిధి, వరంగల్ : 
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల పట్టింపులేమి జిల్లాలో రోడ్ల పనులకు ప్రధాన అడ్డంకిగా మారాయి. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకోవడంలో చూపినంత శ్రద్ధ వాటిని పూర్తి చేసే విషయంలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంజూరైన పంచాయతీరాజ్ రోడ్లలో ఏ ఒక్కటీ వంద శాతం పూర్తి కాలేదు. జిల్లాలోని అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యానికి ఈ పరిస్థితి నిదర్శనంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ రోడ్లు నిర్మాణం, పునరుద్ధరణ(రెన్యూవల్) చేసేందుకు ఏడాది క్రితం ప్రభుత్వం రూ.416 కోట్లు మంజూరు చేసింది.
 
 రూ.230.35 కోట్లతో 1676.37 కిలో మీటర్ల బీటీ రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించింది. అలాగే 396.83 కిలో మీటర్ల మట్టి రోడ్లను కొత్తగా బీటీ వేసి అభివృద్ధి చేసేందుకు రూ.185.71 కోట్లు మంజూరు చేసింది. రోడ్ల పునరుద్ధరణ కోసం 463 పనులను, కొత్త రోడ్ల నిర్మాణం కోసం 152 పనులను గుర్తించారు. మొ త్తం 615 పనులకు టెండర్లు నిర్వహించగా 45 మంది కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అరుుతే, టెండర్ల ప్రక్రియ ముగిసి ఏడాది కావస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. 12 మంది కాంట్రాక్టర్లు అసలు పను లే మొదలుపెట్టలేదు. అయినా వీరి విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వీటిని పూర్తి చేయకపోయినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 
 మొదలే కాలేదు...
 రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులు దక్కించుకుని మొదలుపెట్టని కాం ట్రాక్టర్లు, సంస్థల తీరుతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్.నారాయణరెడ్డి అండ్  సన్స్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లవెల్లి కన్‌స్ట్రక్షన్, ఎస్‌ఎల్‌వీ బిల్డర్స్, జి.నవీన్, వి.పృథ్వీధర్‌రావు, పీబీఆర్ సెలెక్ట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, వి.వీరారెడ్డి, తట్టెకుంట వడ్డెర సానిటరీ సివిల్ వర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం, పి.శ్రీనివాస్‌రెడ్డి అండ్ కంపెనీ, తౌటిరెడ్డి రఘోత్తంరెడ్డి, జీ.వీ.రెడ్డి, డి.శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికీ పనులను మొదలు పెట్టలేదు.
 
  ఈ 12 కాంట్రాక్టరు, సంస్థలు కలిపి జిల్లాలో 28.28 కోట్ల పనులు దక్కించుకున్నాయి. మొదలుకాని పనులలో ఎక్కువగా కొత్త రోడ్ల నిర్మాణ పనులే ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. పనులు దక్కించుకుని ఏడాది దగ్గరపడుతున్నా రోడ్ల నిర్మాణం, పునరుద్ధణను పట్టించుకోని ఈ సంస్థల పట్ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులను మొదలుపెట్టాలనే విషయాన్ని పట్టించుకోవడం లేదు.
 
 ఎస్సీ కార్పొరేషన్‌కు 24వేల దరఖాస్తులు
 నయీంనగర్ : స్వయం ఉపాధి పథకాల కోసం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 24 వేలకు పైగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.సురేష్ తెలిపారు. మండల, అర్బన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను విభజించి ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లకు పంపిస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు స్వయం ఉపాధి రుణాలు పొందడానికి బ్యాంకు కాన్సెంట్ అవసరం లేదని, స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణా లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
 
  ఒంటరి స్త్రీలు, గుడుంబా బాధిత కుటుంబాలు, లొంగిపోయిన నక్సలైట్లు, వయో పరిమితి మించిపోతు న్న వారు, సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈడీ వివరించారు. కాగా, మండల స్థాయి స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా ఎంపీడీఓ, సభ్యులుగా డీఆర్‌డీఏ ఎంపీఎం, సర్వీస్ ఏరియా బ్యాంకు మేనేజర్, అర్బన్‌లో చైర్మన్‌గా మునిసిపల్ కమిషనర్, సభ్యులుగా మెప్మా పీడీ, బ్యాంకు మేనేజర్ ఉంటారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement