ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టండి: కేసీఆర్
హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)ల వివాదం, విద్యుత్ కొరతపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పీపీఏలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే సమాచారం కోసం కొన్ని రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శికి కేసీఆర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీపీఏల రద్దును ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.