చంద్రబాబు నిర్ణయాన్ని అమలు కానివ్వం: హరీష్ రావు
చంద్రబాబు నిర్ణయాన్ని అమలు కానివ్వం: హరీష్ రావు
Published Wed, Jun 18 2014 3:00 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆంధ్రప్రదేశ్ సర్కారు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 పూర్తిగా వ్యతిరేకం, విరుద్దమని హరీష్ రావు అన్నారు.
పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం అనైతికమని హరీష్ రావు తెలిపారు. పీపీఏ రద్దు నిర్ణయాలపై కేసీఆర్ అధికారులతో సమీక్ష చేస్తారని హరీష్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను త్వరగానే అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. పీపీఏ రద్దు వ్యవహారంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుకానివ్వమని
హరీష్‌రావు స్పష్టం చేశారు.
Advertisement