చంద్రబాబుది తొందరపాటు చర్య: పొన్నాల
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆంధ్రప్రదేశ్ సర్కారు రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తప్పుపట్టారు. పీపీఏలను రద్దు చేయడం దురదృష్టకరం అని పొన్నాల వ్యాఖ్యానించారు. పీపీఏలను రద్దు చేయడం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటును ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.
పీపీఏలను రద్దు చేయడం కవ్వింపు చర్య అని పొన్నాల తెలిపారు. రాజ్యాంగ సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని యాన విమర్శించారు. విభజన బిల్లు మేరకు పీపీఏలను కొనసాగించేల్సిందేనని పొన్నాల డిమాండ్ చేశారు. పీపీఏలను కొనసాగించకపోతే ఇరు రాష్ట్రాలకు కొత్త సమస్యలు తలెత్తుతాయన్నారు.
చంద్రబాబుపై తెలంగాణ నేతలు ఒత్తిడి తెచ్చి పీపీఏలను కొనసాగే చూడాలని పొన్నాల సూచించారు. ఇరాక్ లో వేయికిపైగా తెలంగాణ వాసులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు.