విద్యుత్ విషయంలో ఆయన వల్లే అన్యాయం
పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
పోచమ్మమైదాన్ : విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా రాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అన్యాయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని కేఎస్‌ఆర్ గార్డెన్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన పరకాల నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హా జరైన శ్రీహరి మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్ విషయమై ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు చంద్రబాబును ఎందు కు అడగడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం అడగలేని నేతలు అసెంబ్లీలో రాద్ధాంతం చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. అయితే, టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ పార్టీని కానీ, చంద్రబాబును కానీ తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.
టీడీపీకి ఉనికి లేకే...
టీడీపీకి తెలంగాణలో ఉనికి లేదనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించారని కడియం శ్రీహరి పేర్కొన్నా రు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నారని ఎద్దే వా చేశారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల నుంచి పోటీలో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యు డు అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ పట్టభద్రులు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన పట్టభద్రులు రాష్ర్ట పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ మేరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు అండగా నిలవడమే కాకుండా.. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు పోటీ చేస్తున్న వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, లింగంపెల్లి కిషన్‌రావు, కన్నెబోయిన రాజయ్య, మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చింతం సదానందంతో పాటు నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ధర్మరాజు, విజేందర్‌రావు, పులుగు సాగర్‌రెడ్డి, వేల్పుల కుమారస్వామి, శంకర్, కొల్పుల కట్టయ్య, ముంత రాజయ్య, ఇండ్ల నాగేశ్వర్‌రావు, పరకాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్లు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..
Published Mon, Mar 9 2015 9:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement