![Polavaram Project Authority Office To Rajahmahendravaram - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/27/POLAVARAM-1_0.jpg.webp?itok=hhtt6Kt3)
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 31లోగా పీపీఏ కార్యాలయానికి అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఆ తర్వాత పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలిస్తారు. వచ్చే నెల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా పీపీఏ విధులు నిర్వర్తించనుంది.
విభజన నేపథ్యంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించి పనులను పర్యవేక్షించడానికి 2014లో హైదరాబాద్ కేంద్రంగా పీపీఏ ఏర్పాటు చేసింది. దీంతో పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖల మధ్య సమన్వయం లోపం ఏర్పడి ఆ ప్రభావం ప్రాజెక్టు పనులపై పడుతోంది.
ఇదే అంశాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వద్ద ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్.. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్.. పీపీఏ కార్యాలయాన్ని తరలింపునకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment