సాక్షి, ప్రకాశం : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. పొలాల్లో వ్యవసాయ కనెక్షన్ల వద్ద తగిన జాగ్రత్తలు పాటించే విధంగా రైతులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. 24/7 పాటు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. (వర్షాలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష)
Comments
Please login to add a commentAdd a comment