సాక్షి, ప్రకాశం : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక విప్లవం అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రకాశంలోని ఎ1 ఫంక్షన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, చంద్రబాబులా అబద్ధాలు చెప్పేరకం కాదని అన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులంతా సీఎం జగన్‌కు మంచి పేరు తేవాలని, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment