
సాక్షి, ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను మైనింగ్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొట్టిపారేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్టాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న నాయకులకు డబ్బు ఉంది కాబట్టి తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని పేర్కొన్నారు. అదే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని మంత్రి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment