విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేయం.. | No Privatization Of Power Plants In The State Says Balineni | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు: బాలినేని

Published Wed, Oct 28 2020 6:15 PM | Last Updated on Wed, Oct 28 2020 6:35 PM

No Privatization Of Power Plants In The State Says Balineni - Sakshi

సాక్షి, వెల‌గ‌పూడి :  విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ఆయన కోరారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం స్పష్ట‌మైన వైఖ‌రి క‌లిగి ఉంద‌ని అన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని తెలిపారు. ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని మరోసారి స్పష్టం చేసారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని, రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు.

వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను  నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు  విడుదల చేసిందన్నారు. (ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది మేమే )

అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగుల జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చల్లో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి,విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు  చంద్రశేఖర్, వేదవ్యాస్ ,సాయి క్రిష్ణలతో పాటు ముప్పైమంది ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement