సాక్షి, అమరావతి : విద్యుత్, ఇంధనశాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అధికారులతో చర్చించారాయన. వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్‌పై చర్చించారు. ఈ ఉదయం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్నినానితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment