
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర , సాంకేతిక శాఖమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగురోడ్డుపై ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడంతో పల్టీకొడుతూ బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. మంత్రి బాలినేని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పాపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
మిగిలిన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను హయత్‌నగర్‌లోని హాస్పిటల్‌కి తరలించారు. మృతిచెందిన పాపయ్య కుటుంబానికి మంత్రి బాలినేని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment