![Professor Attacked on Security in Hyderabad JNTU - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/8/jntu-professor.jpg.webp?itok=OpzoCJa5)
సాక్షి, హైదరాబాద్: కుకట్‌పల్లి జేఎన్టీయూలో ఓ ప్రొఫెసర్ రెచ్చిపోయారు. నో పార్కింగ్ ప్లేస్‌లో కారు పెట్టొదని చెప్పినందుకు సెక్యురిటీపై ప్రొఫెసర్ దాడి చేశారు. నాకే అడ్డు చెబుతావా అంటూ ప్రొఫెసర్‌తో సహా అతని భార్యా సెక్యురిటీపై దూర్భాషలాడారు. క్షమించండని చెప్పినా వినకుండా అతన్ని చితకబాదాడు.
అతని దెబ్బలకి తట్టుకోలేక సెక్యురిటీ పక్కనే ఉన్న ఆఫీసు రూమ్‌లోకి పరిగెత్తాడు. అయినా ప్రొఫెసర్ అక్కడికెళ్లి నీ అంతు చూస్తానని చేయిచేసుకున్నారు. తప్పుచేశానని చెప్పినా, కన్నీరు పెట్టుకొని కాళ్లు పట్టుకున్నా.. ప్రొఫెసర్ కనికరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment