స్పెషల్ దందా | Special danda | Sakshi
Sakshi News home page

స్పెషల్ దందా

Published Thu, Jun 23 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

స్పెషల్ దందా

స్పెషల్ దందా

పోలీస్ విభాగంలోస్పెషల్ బ్రాంచ్‌పైవిమర్శల వెల్లువ
వారి కనుసన్నల్లోనేఅసాంఘికకార్యకలాపాలు
అక్రమ సంపాదనకు అలవాటుపడిన సిబ్బంది

 
అర్బన్ జిల్లా పరిధిలో స్పెషల్ బ్రాంచ్ విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనే విమర్శలు తీవ్రమయ్యాయి. చేయి తడపందే ఏ పనీ ఆ విభాగంలోని పోలీసులు చేయడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ప్రత్యేకించి పాస్‌పోర్టు జారీ విషయంలో దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెట్టి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఇటీవల కాలంలో రెట్టింపయ్యాయి. కొందరుబాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పలువురు పోలీసులనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన ఘటనలు ఉన్నాయి.   - సాక్షి, గుంటూరు
 
సాక్షి, గుంటూరు : అర్బన్ జిల్లాలో  క్రికెట్ బెట్టింగ్, వ్యభిచార గృహాలు, సింగిల్ నంబర్ లాటరీ, పేకాట, రేషన్ అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల కనుసన్నల్లోనే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులు పోలీస్ అధికారులతో కుమ్మక్కై ప్రతిదానికీ ఒక రేటును ఫిక్స్‌చేసి మరీ యథేచ్ఛగా తమ పను లు చక్కబెట్టుకుంటున్నారు.గుంటూరు నగరంలో వీరి హవా ఏ స్థాయిలో ఉందంటే రియల్‌ఎస్టేట్, కుటుంబ కలహాల కేసులూ వీరే సెటిల్‌మెంట్‌లు చేసి భారీ స్థాయిలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు.


 స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధులివీ...
హత్యలు, భూ కబ్జాలు, చోరీలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి మఫ్టీలో తిరుగుతూ వీటిని ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు నేరుగా సమాచారం అందించాలి. పోలీసు అధికారుల పనితీరుపై సైతం నిఘా ఉంచడం వీరి కర్తవ్యంలో ఓ భాగం. అన్ని రకాల సమాచారం వీరు సేకరించి నేరాల నివారణలో తోడ్పాటునందించాలి.


పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు చుక్కలు.....
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి అక్కడికక్కడే విచారణ పూర్తి చేసి సమాచారాన్ని పాస్‌పోర్టు కార్యాలయానికి అప్‌లోడ్ చేసి మెరుగైన సేవలందించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రణాళిక రూపొందించారు. ఎస్‌బీ సిబ్బందికి ట్యాబ్‌లను అందించి త్వరితగతిన పాస్‌పోర్టు వెరిఫికేషన్ పూర్తి చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. దీనిని కొందరు ఎస్బీ సిబ్బంది తమకు అనుకూలంగా మలుచుకుని పాస్‌పోర్టు దరఖాస్తు దారుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే పాస్‌పోర్టు రాకుండా చేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగుతుండడంతో ఏం చేయాలో తెలియని కొందరు వారు అడిగినంత ఇచ్చి పంపుతున్నారు. అర్బన్ పరిధిలో ఇప్పటికే పలువురు ఎస్బీ సిబ్బంది ఏసీబీ వలలో చిక్కారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి అర్బన్‌లో స్పెషల్ బ్రాంచ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
 
 
ఎస్‌బీ సిబ్బంది చేస్తున్న పనులివీ...

పోలీస్ అధికారుల అవినీతిని ఉన్నతాధికారులకు చెప్పే విషయం అటుంచితే, ఎక్కడ నుంచి ఎంతెంత నెలవారీ మామూళ్లు వస్తాయో వారికి తెలియజేసి వాటాలు పంచుకోవడానికి అలవాటు పడ్డారు. నెలకు లక్షల్లో ఆదాయం చూపిస్తుండడంతో ఎంత నిజాయతీగా డ్యూటీ చేయాలని వచ్చిన సీఐ అయినా సరే డబ్బెవరికి చేదు అన్న చందాన వీరి మాయలోపడి మలినమైపోతున్నారు. స్పెషల్ బ్రాంచ్ కాస్తా ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌లకు డబ్బులు వసూలు చేసిపెట్టే బ్రాంచ్‌లుగా మారిపోయాయి.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement