‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు | Redwood Smuggling Tamil hongardu the students . | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు

Published Thu, Feb 11 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో  విద్యార్థులు.. తమిళ హోంగార్డు

‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు

ఎర్రచందనం అక్రమ రవాణాలో పెలైట్లుగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతుండగా, మరొకరు బీకాం విద్యార్థి. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ఓ హోంగార్డు కూడా అరెస్టయ్యాడు. అతను పోలీస్ దుస్తులు ధరించి ఎర్రచందనం తరలించే వాహనంలో ముందు కూర్చునే వాడు.  అదేవిధంగా చిత్తూరు పోలీసులు గుడిపాల-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు చేస్తుండగా పోలీసు దుస్తులు ధరించి స్మగ్లింగ్‌లో పాల్గొనే ఇంకో వ్యక్తి కూడా దొరికాడు.
 
తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు  లో సుమారు రూ.49 లక్షల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, బొలేరో, లారీ, హుండయ్ కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే 19 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

తిరుపతి సిటీ: తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రూ.34 లక్షల విలువైన 63 ఎర్రచందనం దుంగలు, హుండయ్ కారు, లారీని స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్ట్ చేసినట్టు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి వై.యోగయ్య తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుచానూరు చైతన్యపురం వద్ద హుండయ్ కారులో తరలిస్తున్న రూ.14 లక్షలు విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పది మంది కూలీలను అరెస్టు చేశామన్నా రు. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఒక హోంగార్డు ఉన్నారని తెలిపారు.

అలాగే ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం చెరువు వద్ద రూ.10 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. తిరుమల ఆలిండియా రేడియో స్టేషన్ వద్ద రూ.10 లక్షల విలువ చేసే 10 దుంగలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది కూలీలను అరెస్ట్ చేశామని చెప్పారు.

రేణిగుంట వద్ద
అదేవిధంగా రేణిగుంట సమీపంలోని ముళ్లపొదల్లో తనిఖీలు చేయగా లారీలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిం చామని పేర్కొన్నారు. దుండగులు పారిపోయారని, వాహనంతో పాటు 470 కేజీలున్న 20 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.  వాహనం, ఎర్రచందనం దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో వేలూరు జిల్లాకు చెందిన సతీష్, కర్ణాటక కటికనహళ్లికి చెందిన తాజుద్దీన్ ప్రధాన స్మగ్లర్లుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. నింది తుల్లో ఉన్న ముగ్గురు విద్యార్థులు పెలైట్లుగా వ్యవహరించారని తెలిపారు. తమిళనాడు వేలూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డు రమేష్ పోలీసు డ్రస్‌లో టోల్‌గేట్ల వద్ద వాహనాలను పంపుతుండేవాడని పేర్కొన్నారు. అతని నుంచి ఐడీ కార్డుతో పాటు యూనిఫాం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
 
పూతలపట్టు మండలంలో..
చిత్తూరు(గిరింపేట): పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేంద్ర బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు పశ్చిమ శాఖ అటవీ రేంజ్ అధికారి నారాయణస్వామి తెలిపారు. దండగులు పారిపోయారని పేర్కొన్నారు. వాహనాన్ని, 433 కేజీలు గల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు పశ్చిమ రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ తనిఖీల్లో సుభాష్, రమేష్, హరికుమార్, హరిబాబు, సతీష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement