Hongardu
-
హోంగార్డులకు తీపి కబురు
-
హోంగార్డులకు తీపి కబురు
కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 10 శాతం రిజర్వేషన్! భారీగా జీతభత్యాల పెంపు.. ఇతర సౌకర్యాలు, అలవెన్సులు కూడా మూడు కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. కానిస్టేబుల్ నియామకాల్లో 10% రిజర్వేషన్ కల్పించడంతోపాటు జీతభ త్యాలను ఆశించిన స్థాయిలో పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలు అలవెన్సులు కూడా అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కొంత వరకు ఊరట ప్రస్తుతం కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 5 శాతం రిజర్వేషన్ ఉంది. అర్హత, వయసు ఉన్న అభ్యర్థులకు మరింత తోడ్పాటు అందించేందుకు ఈ కోటాను 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. దానితో ప్రతి 100 పోస్టుల్లో 10 మంది హోంగార్డులు కానిస్టేబుళ్లుగా నియా మకం అవుతారని ఉన్నతాధికారులు చెబుతు న్నారు. ఇక హోంగార్డుల జీతభత్యాల్లోనూ ఆశాజనకమైన పెంపు ఉంటుందని పేర్కొం టున్నారు. హోంగార్డులకు ప్రస్తుతమున్న వేతనాలను రూ.18 వేలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు పదవీ విరమణ ప్రయోజనంగా కొంత నగదు అందించాలని కూడా యోచిస్తున్నట్లు సమాచా రం. ఇక పోలీస్ శాఖలోని ఆరోగ్య భద్రత స్కీంలో హోంగార్డులకు అవకాశం, మహిళా హోంగార్డులకు సగం జీతంతో కూడిన మెటర్నిటీ సెలవుల అంశాలపైనా ఓ నిర్ణయా నికి వచ్చినట్టు తెలిసింది. డ్యూటీ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్, పరేడ్ చార్జీలు, బందోబస్తు అలవెన్స్‌లను పెంచాలన్న ప్రతిపాదనపైనా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బడ్జెట్‌కు ముందే ప్రకటన హోంగార్డులకు జీతభత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా ఆదేశాలుంటాయని తెలిసిం ది. బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రభుత్వం హోంగార్డుల సమస్యలపై ప్రకటన వెలువరిం చే అవకాశముందని, ఇందుకోసం బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమబద్ధీకరణ కష్టమే! కానిస్టేబుళ్లుగా క్రమబద్ధీకరించాలం టూ హోంగార్డులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం న్యాయసలహా తీసుకున్నట్టు తెలుస్తోంది. అది అంత సులభం కాదని, అనేక నిబంధనలు అడ్డుగా ఉన్నాయని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంగార్డులకు తగిన న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్ శాఖ నుంచి మూడు కీలక ప్రతిపాదనలు సర్కారుకు అందినట్లు తెలిసింది. -
హోంగార్డులను రెచ్చగొడుతున్నారు
శాసనసభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్య ప్రజాప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోకండి వారి సంక్షేమం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తనదేనని వెల్లడి హైదరాబాద్: అంతా అనుకూలంగా జరు గుతున్న తరుణంలో కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొట్టి వారి చేత సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ హోంగార్డుల సంక్షేమంపై అడిగి న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. క్రమ శిక్షణతో ఉండే శాఖలో సమ్మెలు చేయిస్తే ప్రభు త్వాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని, వారి సంక్షే మం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. హోంగా ర్డులకు తెలంగాణ వచ్చాకే వేతనాలు పెరిగా యని.. వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, ట్రాఫిక్ డ్యూటీ చేసే వారికి కానిస్టేబుళ్ల తరహా లోనే 30 శాతం అదనపు భృతి ఇచ్చే ప్రతిపా దనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. హోంగా ర్డుల సర్వీసు స్వచ్ఛంద పరిధిలోనికి వస్తుంది కనుక ఇతర సదుపాయాల కల్పనకు, సెలవు లకు వారు అర్హులు కారని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లో బీబీనగర్ నిమ్స్‌లో ఐపీ సేవలు యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ నిమ్స్ ఆస్ప త్రిలో ఇన్‌పేషెంట్ సేవలను మూడు నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ సభ్యులు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2009 తర్వాత ఈ ఆస్ప త్రిపై పాలకులు నిర్లక్ష్యం వహించారని, అందు కే ప్రజలకు అందుబాటులోకి రావడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు 650 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కన్నా అదనంగా 21 శాఖలతో బీబీనగర్ నిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని.. అక్కడే ట్రామా సెంటర్, మెడికల్ కాలేజీ ఏ ర్పాటు ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 100 చేపల మార్కెట్ యార్డులు తెలంగాణవ్యాప్తంగా 4,096 రిజర్వాయర్లు, చెరువుల్లో రూ.24 కోట్ల వ్యయంతో కోట్లాది చేపపిల్లలను పెంచుతున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. టీఆర్ఎస్ సభ్యులు చింతా ప్రభాకర్, పుట్ట మధు, వేముల వీరేశం అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ చేప పిల్లలన్నీ మే, జూన్ నాటికి మత్స్య సంపదగా మారుతా యని, రూ.500 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని తెలిపారు. చేపలను మార్కెట్ చేసుకునేందుకు వీలుగా 100 చేపల మార్కెట్ యార్డులను నిర్మిస్తున్నామని తెలిపారు. వాటికి అనువైన స్థలాలు చూడాలని కలెక్టర్లకు లేఖలు రాశామని.. ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభు త్వం సబ్సిడీపై ఇచ్చే చేప విత్తనాలపై హక్కు కేవలం సొసైటీలకే కాకుండా మత్స్యకారులం దరికీ ఉంటుందన్నారు. మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. వాయిదా తీర్మానాలకు నో సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన నాలుగు వాయి దా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలపై కాంగ్రెస్.. సంచార జాతు ల సంక్షేమం, అభివృద్ధిపై బీజేపీ.. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటుపై టీడీపీ.. గ్రామసేవకుల వేతనాలు, పదోన్నతు లపై సీపీఎం సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోచారం స్పెషల్ గెటప్ కిసాన్ దివస్ (రైతు దినోత్సవం) సందర్భంగా శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక గెటప్‌తో సభకు వచ్చారు. ఆకుపచ్చని తలపాగా, మెడలో కండువాతో వచ్చిన ఆయనను.. సభలో ఉన్న అన్ని పార్టీల సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించారు. స్పీకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా మెచ్చుకున్నారు. పోచారం మాట్లాడుతూ.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి మాట్లాడిన తర్వాత విపక్షాల సభ్యులు కూడా రైతులకు శుభాకాంక్షలు తెలిపే అవకాశమివ్వాలని కోరినా స్పీకర్ అంగీకరించలేదు. త్వరలోనే గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపు జీవో వృత్తిలో భాగంగా చెట్టుపై నుంచి పడి చనిపోయిన గీత కార్మి కులకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్ల డించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమ యంలో టీఆర్ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చా రు. గీత కార్మికులు చెట్లు ఎక్కే విధానాన్ని యాంత్రీకరణ చేయాలన్న ఆలోచనతో.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తు న్నామని తెలిపారు. కల్లుడిపోల్లో గీత సొసైటీలు కల్లు అమ్ముకోకుం డా కొందరు దందాలు చేస్తున్నార ని, మామూళ్లు ఇచ్చి కల్లు అమ్ముకోవాలంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని విపక్ష సభ్యులు పేర్కొనగా... అలా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సమావేశాల అనంతరం స్వయంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లి పరిశీలిస్తానన్నారు. ఈ నెల 28న ‘అమ్మ ఒడి’ మారుమూల అటవీ ప్రాంతాలు, గిరి జన గూడాల్లో నివసించే గర్భిణుల సౌకర్యా ర్థం ఈనెల 28న ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. గర్భిణు లను వారి నివాసాల నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతోపాటు ప్రసవం తర్వాత తల్లినీ, బిడ్డను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపె ట్టేందుకు 50 వాహనాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ఇక ఆస్పత్రుల్లో మరణించిన పేదల మృతదేహాలను వారి గ్రామాలకు ఉచితంగా తరలించేం దుకు ఏర్పాటు చేసిన ‘హెర్సే’ అంబు లెన్సు లపై టీఆర్ఎస్ సభ్యు లు రసమయి బాల కిషన్, చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్యలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు హెర్సే అంబులెన్సుల ద్వారా 1,056 మృతదేహాల ను స్వస్థలాలకు చేర్చామన్నారు. త్వరలోనే మరో 30 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 108 పథకం కోసం కొత్తగా 145 వాహనాలను కొనుగోలు చేస్తున్నామన్నారు. -
నియోజకవర్గానికో అగ్నిమాపక కేంద్రం
⇒హోంమంత్రి నాయిని వెల్లడి ⇒100 మినీ వాటర్ టెండర్ వెహికిల్స్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాటన్, జిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ రాష్ట్ర విపత్తుల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో 100 మినీ వాటర్ టెండర్(మిస్ట్) వెహికిల్స్‌ను హోం కార్యదర్శి అనితా రాజేందర్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్ రాజీవ్ రతన్‌తో కలసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి భారీగా నిధులు కేటాయిస్తున్నారన్నారు. 119 అగ్నిమాపక కేంద్రాలు అవసరముండగా, 100 వరకు మంజూరయ్యాయని చెప్పారు. మినీ వాటర్ టెండర్ వెహికల్స్‌ను నడిపేందుకు ప్రొఫెషనల్ డ్రైవర్లు అవసరం లేదని, అందుబాటులో ఉన్న సిబ్బందే సరిపోతారని అనితా రాజేందర్ అన్నారు. అనంతరం పీపుల్స్ ప్లాజా నుంచి వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ సంస్థ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు తయారు చేసిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. హోంగార్డుల పర్మినెంట్‌కు సానుకూలమే హోంగార్డులను పర్మినెంట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగానే ఉన్నారని నాయిని అన్నారు. హోంగార్డుల వేతనాన్ని రూ.9 వేల నుంచి 12 వేలకు పెంచడంతో పాటు వారికి డ్రెస్సులు, బస్సుపాస్‌లను కూడా ప్రభుత్వమే అందిస్తోందని అన్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసి డిస్మిసయి.. ఎమ్మెల్యేగా పోటీచేసిన వ్యక్తి ఆందోళనకు దిగి అనవసర రాద్ధాంతం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకుంటున్నాడని అన్నారు. -
కలకలం సృష్టిస్తున్న ‘అర్డర్లీ’ పనులు
♦ హోంగార్డులు - ఎస్పీ మధ్య వైరం ♦ డీఐజీ ఎదుట వాంగ్మూలాల నమోదు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నాలుగో సింహం దారి తప్పింది. వక్రమార్గాల్లో పయనిస్తూ ప్రజల్లో చులకన అవుతోంది. కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు పక్కదారి పట్టడంతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. తాజాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఎస్పీ నవీన్‌కుమార్ తమను ఆర్డర్లీ పనులకు వినియోగించుకుంటున్నారని హోంగార్డుల బహిరంగ ప్రకటన ఒకవైపు.. అడిషనల్ ఎస్పీ వెంకటస్వామితోపాటు మరికొందరు కావాలనే తనను ఇరికించారని ఎస్పీ మరోవైపు రచ్చకెక్కడం జిల్లా పోలీసు విభాగానికి మచ్చ తెచ్చింది. సొంత సేవలకు హోంగార్డులను వాడుకోవడం.. వెట్టి కార్మికుల్లాగా వారిని పరిగణించారనే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ వ్యవహారశైలి వివాదాస్పదమైంది. అయితే, ఫొటోల వెనుక పెద్ద కుట్ర దాగుందని, దీనికి సూత్రదారి అదనపు ఎస్పీ వెంకటస్వామేనని ఎస్పీ నవీన్‌కుమార్ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో గతంలో ఎస్పీ ఆఫీసులో సీసీగా పనిచేసిన మహేశ్ ను అవినీతి అభియోగంతో సస్పెండ్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలో రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలను సీరియస్‌గా పరిగణించిన పోలీసు శాఖ.. ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఆదేశించింది. దీంతో గత రెండు రోజులుగా హోంగార్డుల వాంగ్మూలం నమోదుచేస్తున్న సబర్వాల్.. ఈ ఘటన పూర్వపరాలను ఆరా తీస్తున్నారు. ఆర్డర్లీ పనులు చేశారని గుర్తించిన 18 మంది హోంగార్డులను విడివిడిగా విచారించి నివేదిక రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలోనూ అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా, జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ కూడా తనపై వచ్చిన ఆరోపణలపై డీఐజీకి సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మారని తీరు..! గ్రామీణ ఎస్పీగా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్ కూడా ఆరోపణలు మూటగట్టుకొని అనతి కాలంలోనే బదిలీ అయ్యారు. ఇసుక మాఫియా మొదలు యాలాల ఎస్ఐ రమేశ్ ఆత్మహత్య వ్యవహారం ఆయనకు మెడకు చుట్టుకున్నాయి. దీనికితోడు ఆయన హయంలో జరిగిన ఎస్ఐ బదిలీల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో స్వల్పకాలంలోనే తప్పుకోవాల్సివచ్చింది. ఈ పరిణామాల నుంచి కోలుకోకమునుపే ప్రస్తుత ఎస్పీ నవీన్‌కుమార్ కూడా వివాదాల్లో కూరుకుపోవడం జిల్లా పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. -
ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్య
♦ కుటుంబ కలహాలే కారణం.. ♦ పెద్దదోర్నాలలో ఘటన.. పెద్దదోర్నాల: చెట్టుకు ఉరేసుకుని హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన స్థానిక వ్యవసాయ భూముల్లో శుక్రవారం జరిగింది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే గోనా మల్లికార్జున(34) పెద్దదోర్నాల పోలీసుస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల తన సొంత సోద రుడి భార్య.. మల్లికార్జునతో పాటు ఆయన భార్య, తమ్మునిపై వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం రోడ్డు కస్తూరిబా బాలికల పాఠశాల వెనుక భాగంలోని వ్యవసాయ భూమిలో ఓ చెట్టుకు మల్లికార్జున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గంగమ్మ మృతి గుంటూరు ఈస్ట్: మేదరమెట్ల వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరాస్వామి భార్య గంగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీంతో ప్రమాద మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వీరాస్వామి, అతని కోడలు మాధవి, కూతురు లక్ష్మీప్రసన్నలు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో విద్యార్థులు.. తమిళ హోంగార్డు
ఎర్రచందనం అక్రమ రవాణాలో పెలైట్లుగా వ్యవహరిస్తున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ చదువుతుండగా, మరొకరు బీకాం విద్యార్థి. వీరితోపాటు తమిళనాడుకు చెందిన ఓ హోంగార్డు కూడా అరెస్టయ్యాడు. అతను పోలీస్ దుస్తులు ధరించి ఎర్రచందనం తరలించే వాహనంలో ముందు కూర్చునే వాడు. అదేవిధంగా చిత్తూరు పోలీసులు గుడిపాల-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు చేస్తుండగా పోలీసు దుస్తులు ధరించి స్మగ్లింగ్‌లో పాల్గొనే ఇంకో వ్యక్తి కూడా దొరికాడు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా, చిత్తూరు లో సుమారు రూ.49 లక్షల విలువైన 76 ఎర్రచందనం దుంగలు, బొలేరో, లారీ, హుండయ్ కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే 19 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. తిరుపతి సిటీ: తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల రూ.34 లక్షల విలువైన 63 ఎర్రచందనం దుంగలు, హుండయ్ కారు, లారీని స్వాధీనం చేసుకుని, 19 మందిని అరెస్ట్ చేసినట్టు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి వై.యోగయ్య తెలిపారు. వారు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తిరుచానూరు చైతన్యపురం వద్ద హుండయ్ కారులో తరలిస్తున్న రూ.14 లక్షలు విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పది మంది కూలీలను అరెస్టు చేశామన్నా రు. వారిలో ముగ్గురు విద్యార్థులు, ఒక హోంగార్డు ఉన్నారని తెలిపారు. అలాగే ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం చెరువు వద్ద రూ.10 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. తిరుమల ఆలిండియా రేడియో స్టేషన్ వద్ద రూ.10 లక్షల విలువ చేసే 10 దుంగలు స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది కూలీలను అరెస్ట్ చేశామని చెప్పారు. రేణిగుంట వద్ద అదేవిధంగా రేణిగుంట సమీపంలోని ముళ్లపొదల్లో తనిఖీలు చేయగా లారీలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిం చామని పేర్కొన్నారు. దుండగులు పారిపోయారని, వాహనంతో పాటు 470 కేజీలున్న 20 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వాహనం, ఎర్రచందనం దుంగల విలువ రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో వేలూరు జిల్లాకు చెందిన సతీష్, కర్ణాటక కటికనహళ్లికి చెందిన తాజుద్దీన్ ప్రధాన స్మగ్లర్లుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని వివరించారు. నింది తుల్లో ఉన్న ముగ్గురు విద్యార్థులు పెలైట్లుగా వ్యవహరించారని తెలిపారు. తమిళనాడు వేలూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో హోంగార్డు రమేష్ పోలీసు డ్రస్‌లో టోల్గేట్ల వద్ద వాహనాలను పంపుతుండేవాడని పేర్కొన్నారు. అతని నుంచి ఐడీ కార్డుతో పాటు యూనిఫాం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పూతలపట్టు మండలంలో.. చిత్తూరు(గిరింపేట): పూతలపట్టు మండలం బండపల్లి రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహేంద్ర బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు పశ్చిమ శాఖ అటవీ రేంజ్ అధికారి నారాయణస్వామి తెలిపారు. దండగులు పారిపోయారని పేర్కొన్నారు. వాహనాన్ని, 433 కేజీలు గల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని చిత్తూరు పశ్చిమ రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ తనిఖీల్లో సుభాష్, రమేష్, హరికుమార్, హరిబాబు, సతీష్ పాల్గొన్నారు. -
హోంగార్డుల వేతనం పెంపు
♦ ఏప్రిల్ 1 నుంచి రూ.400 ♦ చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటన అల్లిపురం(విశాఖ): హోంగార్డుల గౌరవ వేతనాన్ని రోజుకు రూ.400కు పెంచుతున్నామని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డులు వేతనాల ఫైలుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం విపత్తుల నివారణ బృందానికి అవసరమైన పనిముట్లను అందజేశారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై సంబంధిత ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలతో సమీక్షించారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. -
హోంగార్డ్డుల సేవలు మరువలేనివి
ఒంగోలు క్రైం : పోలీస్ విభాగంతో పాటు పలు విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డుల సేవలు మరువలేనివని ఏఆర్ ఏఎస్పీ జె.కృష్ణయ్య అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 52వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తొలుత హోంగార్డుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కృష్ణయ్య మాట్లాడతూ జిల్లాలో మొత్తం 838 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని, వీరిలో 108 మంది డిప్యూటేషన్‌పై శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్, మైన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వంటి విభాగాల్లో పని చేస్తున్నారని చెప్పారు. 1946లో బ్రిటీష్ పాలన సమయంలో హోంగార్డుల వ్యవస్థ ఏర్పడిందన్నారు. 1962లో చైనా యుద్ధం సమయంలోనూ హోంగార్డుల పాత్ర కీలకమన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని 1963లోప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న చిరువోలు శ్రీకాంత్ వారాంతపు సెలవు ప్రకటించి హోంగార్డులకు ఊరట కలిగించారన్నారు. రాష్ట్రస్థాయిలో జనత, జీవిత బీమా వంటి పాలసీలను అమలు చేయనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో జి.హనుమంతురావు, ఎస్కే సుభాని, పి.నాగరాజు, బి.గోపి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సురేంద్రబాబు, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్కే సలాం, పి.మద్దిలేటి, ఎస్.లక్ష్మీనారాయణలు ఉన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ జల్దారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్లు చంద్రమోహన్, మురళీ, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ మద్దార్ తదితరులు పాల్గొన్నారు.