హోంగార్డులను రెచ్చగొడుతున్నారు
శాసనసభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్య
ప్రజాప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోకండి
వారి సంక్షేమం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తనదేనని వెల్లడి
హైదరాబాద్: అంతా అనుకూలంగా జరు గుతున్న తరుణంలో కొందరు ఎమ్మెల్యేలు హోంగార్డులను రెచ్చగొట్టి వారి చేత సమ్మెలు, ఆందోళనలు చేయిస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ హోంగార్డుల సంక్షేమంపై అడిగి న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. క్రమ శిక్షణతో ఉండే శాఖలో సమ్మెలు చేయిస్తే ప్రభు త్వాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులెవరూ హోంగార్డుల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని, వారి సంక్షే మం విషయంలో సీఎంను ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. హోంగా ర్డులకు తెలంగాణ వచ్చాకే వేతనాలు పెరిగా యని.. వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా, ట్రాఫిక్ డ్యూటీ చేసే వారికి కానిస్టేబుళ్ల తరహా లోనే 30 శాతం అదనపు భృతి ఇచ్చే ప్రతిపా దనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. హోంగా ర్డుల సర్వీసు స్వచ్ఛంద పరిధిలోనికి వస్తుంది కనుక ఇతర సదుపాయాల కల్పనకు, సెలవు లకు వారు అర్హులు కారని స్పష్టం చేశారు.
నాలుగు నెలల్లో బీబీనగర్ నిమ్స్‌లో ఐపీ సేవలు
యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ నిమ్స్ ఆస్ప త్రిలో ఇన్‌పేషెంట్ సేవలను మూడు నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యులు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2009 తర్వాత ఈ ఆస్ప త్రిపై పాలకులు నిర్లక్ష్యం వహించారని, అందు కే ప్రజలకు అందుబాటులోకి రావడంలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు 650 పడకల సామర్థ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కన్నా అదనంగా 21 శాఖలతో బీబీనగర్ నిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని.. అక్కడే ట్రామా సెంటర్, మెడికల్ కాలేజీ ఏ ర్పాటు ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు.
100 చేపల మార్కెట్ యార్డులు
తెలంగాణవ్యాప్తంగా 4,096 రిజర్వాయర్లు, చెరువుల్లో రూ.24 కోట్ల వ్యయంతో కోట్లాది చేపపిల్లలను పెంచుతున్నామని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యులు చింతా ప్రభాకర్, పుట్ట మధు, వేముల వీరేశం అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ చేప పిల్లలన్నీ మే, జూన్ నాటికి మత్స్య సంపదగా మారుతా యని, రూ.500 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నామని తెలిపారు. చేపలను మార్కెట్ చేసుకునేందుకు వీలుగా 100 చేపల మార్కెట్ యార్డులను నిర్మిస్తున్నామని తెలిపారు. వాటికి అనువైన స్థలాలు చూడాలని కలెక్టర్లకు లేఖలు రాశామని.. ప్రజాప్రతినిధులు తమ నియోజక వర్గాల్లో స్థలాలు చూసి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభు త్వం సబ్సిడీపై ఇచ్చే చేప విత్తనాలపై హక్కు కేవలం సొసైటీలకే కాకుండా మత్స్యకారులం దరికీ ఉంటుందన్నారు. మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
వాయిదా తీర్మానాలకు నో
సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన నాలుగు వాయి దా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలపై కాంగ్రెస్.. సంచార జాతు ల సంక్షేమం, అభివృద్ధిపై బీజేపీ.. తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటుపై టీడీపీ.. గ్రామసేవకుల వేతనాలు, పదోన్నతు లపై సీపీఎం సభ్యులు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ప్రశ్నోత్తరాల అనంతరం వాటిని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
పోచారం స్పెషల్ గెటప్
కిసాన్ దివస్ (రైతు దినోత్సవం) సందర్భంగా శుక్రవారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక గెటప్‌తో సభకు వచ్చారు. ఆకుపచ్చని తలపాగా, మెడలో కండువాతో వచ్చిన ఆయనను.. సభలో ఉన్న అన్ని పార్టీల సభ్యులు బల్లలు చరుస్తూ అభినందించారు. స్పీకర్, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా మెచ్చుకున్నారు. పోచారం మాట్లాడుతూ.. రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి మాట్లాడిన తర్వాత విపక్షాల సభ్యులు కూడా రైతులకు శుభాకాంక్షలు తెలిపే అవకాశమివ్వాలని కోరినా స్పీకర్ అంగీకరించలేదు.
త్వరలోనే గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపు జీవో
వృత్తిలో భాగంగా చెట్టుపై నుంచి పడి చనిపోయిన గీత కార్మి కులకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్ల డించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమ యంలో టీఆర్‌ఎస్ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చా రు. గీత కార్మికులు చెట్లు ఎక్కే విధానాన్ని యాంత్రీకరణ చేయాలన్న ఆలోచనతో.. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేస్తు న్నామని తెలిపారు. కల్లుడిపోల్లో గీత సొసైటీలు కల్లు అమ్ముకోకుం డా కొందరు దందాలు చేస్తున్నార ని, మామూళ్లు ఇచ్చి కల్లు అమ్ముకోవాలంటూ దౌర్జన్యాలు చేస్తున్నారని విపక్ష సభ్యులు పేర్కొనగా... అలా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని, 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సమావేశాల అనంతరం స్వయంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లి పరిశీలిస్తానన్నారు.
ఈ నెల 28న ‘అమ్మ ఒడి’
మారుమూల అటవీ ప్రాంతాలు, గిరి జన గూడాల్లో నివసించే గర్భిణుల సౌకర్యా ర్థం ఈనెల 28న ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. గర్భిణు లను వారి నివాసాల నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతోపాటు ప్రసవం తర్వాత తల్లినీ, బిడ్డను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపె ట్టేందుకు 50 వాహనాలను ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ఇక ఆస్పత్రుల్లో మరణించిన పేదల మృతదేహాలను వారి గ్రామాలకు ఉచితంగా తరలించేం దుకు ఏర్పాటు చేసిన ‘హెర్సే’ అంబు లెన్సు లపై టీఆర్‌ఎస్ సభ్యు లు రసమయి బాల కిషన్, చల్లా ధర్మారెడ్డి, దుర్గం చిన్నయ్యలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు హెర్సే అంబులెన్సుల ద్వారా 1,056 మృతదేహాల ను స్వస్థలాలకు చేర్చామన్నారు. త్వరలోనే మరో 30 వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 108 పథకం కోసం కొత్తగా 145 వాహనాలను కొనుగోలు చేస్తున్నామన్నారు.