♦ ఏప్రిల్ 1 నుంచి రూ.400
♦ చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటన
అల్లిపురం(విశాఖ): హోంగార్డుల గౌరవ వేతనాన్ని రోజుకు రూ.400కు పెంచుతున్నామని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డులు వేతనాల ఫైలుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం విపత్తుల నివారణ బృందానికి అవసరమైన పనిముట్లను అందజేశారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై సంబంధిత ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలతో సమీక్షించారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
హోంగార్డుల వేతనం పెంపు
Published Wed, Jan 20 2016 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM
Advertisement
Advertisement