increment
-
‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన
కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..ముందు పొదుపు తర్వాతే ఖర్చుఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. -
రేషన్ డీలర్ల కమీషన్ రెండింతలు పెంపు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల కమీషన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. టన్ను బియ్యంపై రూ. 700గా ఉన్న కమీషన్‌ను రూ. 1,400 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఏటా డీలర్ల కమిషన్ రూ. 303 కోట్లకు చేరనుందని, అందులో రూ. 245 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా భరిస్తుందని వెల్లడించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో రేషన్ డీలర్లు అందించిన సేవలకు గౌరవంగా సీఎం డీలర్ల కమీషన్‌ను రెండింతలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కేంద్రం అందించే కమీషన్కన్నా అదనంగా రూ.950 ఒక్కో టన్నుకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కేంద్రం జాతీయ ఆహార భద్రతా కార్డులు ఇవ్వని దాదాపు 90 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ఆహార భద్రత కింద పూర్తి రేషన్‌ను అదనంగా అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే 5కిలోల బియ్యానికి అదనంగా మరో కిలోని చేర్చి ఎన్ఎఫ్ఎస్సీ కార్డులకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందచేస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏటా రూ. 3వేల కోట్లను పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
నా జీతం పెంచండి: జోహ్రి
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రి వార్షిక వేతనం రూ. 5 కోట్ల 76 లక్షలు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు అదనం. అయినా కూడా తనకు వేతన సవరణ చేయాల్సిందేనని జోహ్రి పట్టుబడుతున్నారు. మంగళవారం పరిపాలక కమిటీ (సీఓఏ) సమావేశం కానుండటంతో కీలక అంశాలతో పాటు జోహ్రి వేతన సవరణపై కూడా చర్చించే అవకాశముంది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్... జోహ్రి జీతం పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇతర సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని రాయ్ భావిస్తున్నారు. మరోవైపు బీసీసీఐ మాత్రం పెంపుపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. జోహ్రి ద్వారా బోర్డుకు వచ్చిన అదనపు ప్రయోజనం గానీ, కార్యకలాపాల్లో వైవిధ్యం గానీ ఏమీ లేవని పేరు చెప్పేందుకు నిరాకరించిన బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. అలాంటపుడు పెంపు ప్రతిపాదన ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా... ఎలాంటి పెంపుకైనా బోర్డులో నిర్దిష్ట విధానం ఉందని, ఇక ముందు అదే కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. -
ఇంక్రిమెంట్ కోసం 60 ఏళ్లుగా పోరాటం!
జైపూర్: కేంద్రం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ అవార్డు పొంది న ఓ అధ్యాపకుడు గత 60 ఏళ్లుగా తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కోసం పోరాడుతున్నారు. రాజస్తాన్‌కు చెందిన రామావతార్ శర్మ(80) బర్మర్ జిల్లాలోని పద్రు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1958లో టీచర్‌గా చేరారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసి ఏడాదిపాటు కొనసాగేలా చేసే అధ్యాపకులకు రెట్టింపు ఇంక్రిమెంట్ ఇస్తామని 1960లో రాజస్తాన్ పంచాయితీ సమితి ప్రకటించింది. దీంతో ఆ స్కూల్లో 38గా ఉన్న విద్యార్థుల సంఖ్య 138కి చేరుకునేలా శర్మ చర్యలు తీసుకున్నారు. తాను 1962 నుంచి ఇప్పటివరకూ 170 సార్లు సెక్రటేరియట్‌కు వెళ్లినా రావాల్సిన ఇంక్రిమెంట్ దక్కలేదని శర్మ వాపోయారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేబినెట్ కమిటీ శర్మను సోమవారం ఆహ్వానించింది. -
బ్యాంకుల ‘వడ్డింపు’ ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను పావుశాతం పెంచడం (6.25 శాతానికి)తో, వాణిజ్య బ్యాంకులు తక్షణం ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం ప్రారంభించాయి. దీంతో ఆటో, గృహ, వ్యాపార రుణాలకు సంబంధించి కస్టమర్లపై ఈఎంఐ భారం ప్రారంభమయినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన పరిణామాలను గమనిస్తే... ► నాలుగున్నరేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఆర్బీఐ రెపో రేటును బుధవారం పావుశాతం పెంచిన విషయం విదితమే. రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ప్రైవేటు రంగంలో అతిపెద్ద రెండు బ్యాంకులు– ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి. ►ఈ పెద్ద బ్యాంకులకు తాజాగా ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లు తోడయ్యాయి. వివిధ మెచ్యూరిటీలపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు పెంచినట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలిపాయి. ►ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ మూడు నెలల నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించిన రుణ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ►కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా 6 నెలలు, ఏడాది కాల వ్యవధి రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ► త్వరలో రుణరేటు పెంపు దిశలో నిర్ణయం తీసుకోనున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పేర్కొంది. ► కాగా తక్షణం బ్యాంకింగ్ వడ్డీరేట్ల పెంపు భారీగా ఏమీ ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజ్నీష్ కుమార్ పేర్కొన్నారు. ఎఫ్‌ఏఎల్‌ఎల్‌సీఆర్ (ఫెసిలిటీ టూ అవీల్ లిక్విడిటీ ఫర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో)లో పెంపు వల్ల బ్యాంకుల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండడమే దీనికి కారణమన్నారు. -
వేతనపరిమితి పెంపు యోచనలో ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: వేతన పరిమితిని నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) యోచిస్తోంది. దీని వల్ల మరో కోటి మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోని సామాజిక భద్రతా పథకాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఈ ప్రతిపాదనను చేర్చారు. అయితే దీనిపై చర్చ జరగలేదు. ట్రస్టీ డీఎల్ సచ్దేవ్ మాట్లాడుతూ.. సమయాభావం వల్ల చర్చించలేదని, ఈ నెలాఖరులో జరిగే భేటీలో చర్చిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది. -
హోంగార్డుల వేతనం పెంపు
♦ ఏప్రిల్ 1 నుంచి రూ.400 ♦ చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటన అల్లిపురం(విశాఖ): హోంగార్డుల గౌరవ వేతనాన్ని రోజుకు రూ.400కు పెంచుతున్నామని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డులు వేతనాల ఫైలుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం విపత్తుల నివారణ బృందానికి అవసరమైన పనిముట్లను అందజేశారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై సంబంధిత ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలతో సమీక్షించారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. -
దొడ్దిదారి బదిలీలపై వీఆర్వోల గుర్రు
జీఓను కాదని ఇష్టారాజ్యం రెగ్యులరైజేషన్ పేరుతో వేధింపులు అందని ఇంక్రిమెంట్లు.. అరకొర జీతాలు హన్మకొండ అర్బన్: దొడ్డిదారిన బదిలీలు చేయడంపై వీఆర్వోలు గుర్రుగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బదిలీకి అవకాశం లే ని ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన ఈ ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులు వివరించకుండా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయూన్ని వీఆర్వోల సంఘం నాయకులు కలెక్టర్, జేసీలకు వివరించినట్లు సమాచారం. వీఆర్వోల సర్వీసు క్రమబద్ధీకరణలో కలెక్టరేట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2008నుంచి ఈ విషయంలో వీఆర్వోలది అరణ్యరోదనే అవుతోంది. పెరిగిన పీఆర్సీ ప్రకారం సుమారు ఒక్కో వీఆర్వోకి కనీసం రూ. 14వేల వేతనం కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్, జేసీ సానుకూలంగానే ఉన్నా కిందిస్థారుు సిబ్బంది కొర్రీలు వేస్తున్నారని మండిపడుతున్నారు. తెరపైకి కొత్త నిబంధనలు జీవో 458ప్రకారం వీఆర్ఏ నుంచి పదోన్నతిపై వీఆర్వో అరుున వారు గరిష్టంగా రెండేళ్ల సర్వీసులో ఒక ఏడాది ఎలాంటి రిమార్కు లేకుండా ఉంటేనే సర్వీసు రెగ్యులర్ చేస్తారు. ఇంతకాలం ఇలాగే చేశారు. ఇటీవల కొందరు అధికారులు సర్వీసు రెగ్యులరైజేషన్‌కు పోలీస్ విచారణ నివేదిక, సర్వే శిక్షణ పూర్తి చేసి ఉండాలని మెలిక పెట్టారు. దీంతో తాము నష్టపోతున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కారణాలతోనే 2008నుంచి వీఆర్వోలకు తహసీల్దార్లు ఇంక్రిమెంట్లు చేయడంలేదు. అదేంటని అడిగితే కలెక్టరేట్ నుంచి సర్వీసు రెగ్యులర్ చేసుకుని రావాలని తేల్చేస్తున్నారు. దొడ్డిదారిలో బదిలీలు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఏడేళ్లుగా ఆగినా పట్టించుకోని అధికారులు.. నిషేధం ఉన్నా దొడ్డిదారిలో వీ ఆర్వోల బదిలీకి పూనుకున్నారనే విమర్శ విన్పిస్తోం ది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు మెడికల్ గ్రౌండ్లో దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు పంపి బదిలీలకు ప్రతిపాదనలు చేయాలి. దీన్ని అధికారులు విస్మరించారు. ప్రజాప్రతినిధుల లేఖలు, సంఘం నాయకులకు సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నారుు. ఎందుకీ వివక్ష? జిల్లాలో ఇప్పటివరకు సుమారు ఆరుగురు వీఆర్వోలు వివిధ కారణాలతో మెడికల్ గ్రౌండ్లో బదిలీకి అర్జీ పెట్టుకున్నారు. వీరి విషయంలో మందకొడిగా ఉన్న ఫైళ్లు మిగతా బదిలీ విషయంలో అత్యంత వేగంగా ముందుకుసాగాయి. గుట్టుచప్పుడు కాకుండా బదిలీల తతంగం పూర్తవుతోంది. దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న వీఆర్వోను హసన్‌పర్తి మండలానికి తెచ్చేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు హసన్‌పర్తి మండలం చింతగట్టు వీఆర్వోను నాగారానికి బదిలీ చేసి ఆ స్థానంలో తాము అనుకున్న వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణ ఉంది.హన్మకొండ మండలంలో పోస్టింగ్ పొందిన వీ ఆర్వో కొంతకాలంగా వరంగల్ మండలంలో డి ప్యూటేషన్‌పై పనిచేస్తున్నాడు. ఆయన్ను హన్మకొండ నుంచి వరంగల్‌కు బదిలీ చేశారు. పరకాలటౌన్ వీఆర్వోను హన్మకొండ మండలం తిమ్మాపూర్‌కు గుట్టుచప్పుడు కాకుండా పోస్టింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారాల్లో పెత్త మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వినిపిన్నాయి. సెక్షన్ వారిని ప్రసన్నం చేసుకుంటే ఏ సెక్షన్ ప్రకారం బదిలీకి దరఖాస్తు చేసుకోవాలో వారే సలహాలిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థానాలకు వెళ్లాలని నిరీక్షించే వారికి మాత్రం నిరాశే మిగులుతోంది. -
పీఆర్సీకి ‘అసమగ్ర’ మార్గదర్శకాలు
జారీ చేసిన ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారాన కొత్త జీతాలు పెన్షనర్లకు తప్పని ఎదురు చూపులు హైదరాబాద్: పదో పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, జారీ చేసిన మార్గదర్శకాలు (సర్క్యులర్ మెమో నం. 3856) అసమగ్రంగా ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్) ద్వారానే కొత్త జీతాలు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఆర్థిక లబ్ధి అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి వరకు.. 10 నెలల వేతన బకాయిలను ఎప్పుడు, ఎలా చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బకాయిల చెల్లింపునకు వేరుగా ఉత్తర్వులు ఇస్తారని మాత్రమే పేర్కొన్నారు. మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు నోషనల్‌గా (పెంపు కాగితాలకే పరిమితం) పీఆర్సీ అమలు చేస్తున్న 2013 జూలై 1 నాటికి ఉన్న మొత్తం జీతం, మూల వేతనం, అప్పటి నుంచి 2015 మే 31 వరకు వచ్చిన పదోన్నతులు, బదిలీలు, నియామకాలు (ఎంఈవోలుగా నియమితులైన స్కూలు అసిస్టెంట్లు తదితర) వివరాలను ఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి. అనధికారికంగా గైర్హాజరు, తీసుకున్న సెలవుల డేటా నమోదు చేయాలి. సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగులుంటే.. ఆ వివరాలు ఇవ్వాలి. ఇంక్రిమెంట్లు రద్దు లాంటి క్రమశిక్షణ చర్యలకు గురైన ఉద్యోగుల వివరాలూ నమోదు చేయాలి. సీఎఫ్‌ఎంస్‌లో అన్ని వివరాలు నమోదు చేస్తే, తాజా స్కేళ్ల ప్రకారం కొత్త జీతభత్యాల వివరాలను సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ అందిస్తుంది. వాటిని ఆయా శాఖాధిపతులు ట్రెజరీలకు సమర్పించాలి. ఈ వివరాలేవి? పదోన్నతులు లభించని ఉద్యోగులకు యాంత్రిక పదోన్నతి విధానం ద్వారా సర్వీసులో 6, 12, 18, 24 ఏళ్లకు పదోన్నతి మేర లభించే స్కేళ్లను అమలు చేస్తారు. కొత్త పీఆర్సీలో యాంత్రిక పదోన్నతి విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని సిఫారసు చేసింది. ఈ విధానం ద్వారా కొత్త స్కేళ్ల అమలు విషయాన్ని మార్గదర్శకాల్లో ప్రస్తావించలేదు. యాంత్రిక పదోన్నతి పొందే ఉద్యోగుల కొత్త స్కేళ్లను నిర్ధారించడం శాఖాధిపతులు, ట్రెజరీలకు సాధ్యం కాదు. ఏ క్యాడర్లో అయినా ఉన్నత శ్రేణి జీతం అందుకొంటుంటే, తదుపరి ఇంక్రిమెంట్లు ఉండవు. వారికి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇస్తారు. పీఆర్సీ జీవోల్లో ఈ ప్రస్తావన లేదు. మార్గదర్శకాల్లోనూ ప్రస్తావించకపోవడం వల్ల ఆ ఉద్యోగులకు కొత్త స్కేళ్ల స్థిరీకరణ చేయడం సాధ్యం కాదు. స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు లేకుండా స్థిరీకరిస్తే, వారికి అన్యాయం జరుగుతుంది. పీఆర్సీ బకాయిల చెల్లింపునకు వేరుగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. ఎప్పుడు ఇస్తారనే విషయం చెప్పలేదు. ఫలితంగా బకాయిల చెల్లింపుల్లో అనిశ్చితి కొనసాగుతుంది. పీఆర్సీ జీవోలు జారీ చేసి దాదాపు నెల కావస్తోంది. ఈ నెల రోజుల్లో సీఎఫ్ఎంఎస్ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ సాఫ్ట్వేర్ ద్వారానే కొత్త జీతాలు తీసుకోవాలని నిబంధన పెట్టారు. ఫలితంగా.. పీఆర్సీ అమల్లో జాప్యం తప్పదు. జాప్యానికే సీఎఫ్ఎంఎస్ పీఆర్సీ అమలును జాప్యం చేయడానికే సీఎఫ్ఎంఎస్ను ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిందని యూటీఎఫ్, ఎస్టీయూ విమర్శించాయి. పెన్షనర్లు, బకాయిల చెల్లింపు ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టాయి. పెన్షనర్లకు తప్పని ఎదురు చూపులు పెన్షనర్లకు అదనపు పెన్షన్ చెల్లింపును విస్మరించాలని జీవో నం.51 ఇచ్చారు. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు ప్రస్తుతం 15 శాతం అదనపు పెన్షన్ ఇస్తున్నారు. వారికి అదనపు పెన్షన్ ఇవ్వకుండా 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే.. ఇప్పుడు పొందుతున్న దాని కంటే తక్కువ పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని పదో పీఆర్సీ సిఫారసు చేసింది. పీఆర్సీ సిఫారసులను యథావిధిగా ఆమోదిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. కానీ అదనపు పెన్షన్ విషయంలో అస్పష్టమైన జీవో ఇచ్చిన ప్రభుత్వం, అమలు మార్గదర్శకాల్లో స్పష్టత ఇస్తుందని ఆశించిన పెన్షనర్లకు నిరాశే మిగిలింది. పీఆర్సీ అమలు మార్గదర్శకాల్లో పెన్షనర్ల ప్రస్తావనే లేదు. పెన్షన్ స్థిరీకరణకు వేరుగా మార్గదర్శకాలు ఇస్తామని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఎప్పుడు ఇస్తారనే విషయంలో స్పష్టతలేదు. -
జీతాలు పెంచకపోతే మళ్ళీ సమ్మె చేస్తాం!
-
ఏపీలో బస్సు చార్జీల బాదుడు!
బాబు సర్కారు దసరా కానుక హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. 15 శాతానికి పైగా బస్సు టికెట్ ధరలు పెంచాల్సిందిగా ఆర్టీసీ యూజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలు 10 శాతానికి పైగా, సూపర్‌లగ్జరీ 15 శాతం, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ చార్జీలు 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. 15 శాతం వరకు చార్జీల పెంపుతో ప్రయాణికులపై రూ.556 కోట్ల దాకా భారం పడనుంది. -
ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
ఫైలుపై కేసీఆర్ సంతకం.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు జీతంతోపాటు ఈ ప్రత్యేక ఇంక్రిమెంట్ జత కూడనుంది. ఉద్యోగులు సర్వీసులో ఉన్నంత కాలం ఇది కొనసాగనుంది. అయితే దీన్ని బేసిక్‌పేలో కలపకుండా విడిగా చూపుతారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ ఉద్యోగులతోపాటు యూజీసీ, ఏఐసీటీఈ ఆమోదం పొందిన యూనివర్సిటీల ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంక్రిమెంటు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో మంత్రిమండలి కూడా దీనికి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. అయితే దీన్ని తమకు కూడా వర్తింపచేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా దీనిపై డిమాండ్ చేస్తూ వస్తున్న కార్మికులు తాజా ఉత్తర్వు నేపథ్యంలో మరోసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరినట్టు ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. -
సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
-
తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఓకే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఈరోజు ఇక్కడ సమావేశమైన మంత్రి మండలి ఉద్యోగుల ఇంక్రిమెంట్ విషయమై చర్చించింది. ఇందు కోసం ప్రభుత్వంపై ఏటా180 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. సమావేశంలో ఇంక్రిమెంట్ల విషయమై శాఖలవారీగా చర్చించారు. అలాగే పలు కీలక అంశాలపై కూడా తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది. -
తెలంగాణ ఉద్యోగుల జీతాల పెంపుకు ఓకే!
-
తెలంగాణ ఇంక్రిమెంటుతో పెన్షనర్లకు మేలు
{పభుత్వానికి విరాళంగా రోజున్నర వేతనం రూ. 64 కోట్లు: దేవీప్రసాద్ అవినీతి ఉండదు, ఆదర్శంగా ఉంటాం: శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తామని కేసీఆర్ ప్రకటించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ఇది పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ.దేవీప్రసాద్ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా ఒకటిన్నర రోజు వేతనాన్ని (రూ. 64 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ అందజేశామన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం దేవీప్రసాద్ మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులు హెల్త్‌కార్డుల కోసం ఇబ్బందులు పడ్డారని, 40 సమావేశాలకు హాజరైనా కొలిక్కి రాలేదన్నారు. రాజకీయ అవినీతి ఉండదు: శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రంలో తాము నీతి నిజాయితీతో వ్యవహరిస్తామని, రాజకీయ అవినీతి ఉండదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్నొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు. పెన్షన్‌పెంపు, రుణమాఫీ అమలుకు చర్యలు చేపడతామన్నారు. అమర వీరుల స్తూపం వద్ద ఎన్నో ఆటంకాలు ఉండేవని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. కాల్పులు జరిపిన దగ్గరే అధికారికంగా నివాళులు అర్పించామన్నారు.