
ఏపీలో బస్సు చార్జీల బాదుడు!
బాబు సర్కారు దసరా కానుక
హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ నుంచి చార్జీల పెంపు తప్పదని తెలుస్తోంది. 15 శాతానికి పైగా బస్సు టికెట్ ధరలు పెంచాల్సిందిగా ఆర్టీసీ యూజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది.
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ చార్జీలు 10 శాతానికి పైగా, సూపర్‌లగ్జరీ 15 శాతం, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్ చార్జీలు 15 శాతానికి పైగా పెంచేందుకు ఆర్టీసీ సమాయత్తమవుతున్నట్టు అధికారవర్గాల సమాచారం. 15 శాతం వరకు చార్జీల పెంపుతో ప్రయాణికులపై రూ.556 కోట్ల దాకా భారం పడనుంది.