వేతనపరిమితి పెంపు యోచనలో ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: వేతన పరిమితిని నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) యోచిస్తోంది. దీని వల్ల మరో కోటి మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోని సామాజిక భద్రతా పథకాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఈ ప్రతిపాదనను చేర్చారు.
అయితే దీనిపై చర్చ జరగలేదు. ట్రస్టీ డీఎల్ సచ్‌దేవ్ మాట్లాడుతూ.. సమయాభావం వల్ల చర్చించలేదని, ఈ నెలాఖరులో జరిగే భేటీలో చర్చిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది.