
తెలంగాణ ఇంక్రిమెంటుతో పెన్షనర్లకు మేలు
{పభుత్వానికి విరాళంగా రోజున్నర వేతనం రూ. 64 కోట్లు: దేవీప్రసాద్
అవినీతి ఉండదు, ఆదర్శంగా ఉంటాం: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు ఇస్తామని కేసీఆర్ ప్రకటించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, ఇది పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ.దేవీప్రసాద్ పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా ఒకటిన్నర రోజు వేతనాన్ని (రూ. 64 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ అందజేశామన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం దేవీప్రసాద్ మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులు హెల్త్‌కార్డుల కోసం ఇబ్బందులు పడ్డారని, 40 సమావేశాలకు హాజరైనా కొలిక్కి రాలేదన్నారు.
రాజకీయ అవినీతి ఉండదు: శ్రీనివాస్‌గౌడ్
రాష్ట్రంలో తాము నీతి నిజాయితీతో వ్యవహరిస్తామని, రాజకీయ అవినీతి ఉండదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్నొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామన్నారు. పెన్షన్‌పెంపు, రుణమాఫీ అమలుకు చర్యలు చేపడతామన్నారు. అమర వీరుల స్తూపం వద్ద ఎన్నో ఆటంకాలు ఉండేవని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. కాల్పులు జరిపిన దగ్గరే అధికారికంగా నివాళులు అర్పించామన్నారు.