మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని వయసుల వారు మహమ్మారి బారిన పడి సామాజిక అశాంతికి కారణమవుతుండటం కలవరపాటు కలిగిస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు పదిశాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నారన్న ఐక్యరాజ్యసమితి అంచనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రతీ యేటా రూ.300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోందన్న గణాంకాలు డ్రగ్స్ విస్తృతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలైయ్యారని, ఏడాదికి 200 కిలోల కొకైన్ వినియోగిస్తున్నారన్న కఠోర వాస్తవాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని విపరిణామాలు తప్పవన్న ఆందోళన అన్ని దేశాల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment