
న్యూయార్క్: మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు. తాజాగా వియన్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించగా.. 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది.
15 నుంచి 64 మధ్య వయస్సు ఉన్నవారిలో 5.5 శాతం మంది గత సంవత్సరం ఒక్కసారైనా డ్రగ్స్ ఉపయోగించారని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగిందని ఈ నివేదక తెలిపింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా.. 42 శాతం మంది గంజాయి వాడకం పెరిగిందని చెప్పారు. అదే విధంగా ఇతర ఔషధాల వినియోగం కూడా పెరిగిందని వివరించారు. గత 24 ఏళ్లలో, కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.
"మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలియక చాలా మంది ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వాడుతున్నారు. యూఎన్‌ఓడీసీ 2021 ప్రపంచ ఔషధ నివేదిక ఫలితాలు యువతకు అవగాహన కల్పించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి." అని యూఎన్‌ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గడా వాలీ ఆశా భావం వ్యక్తం చేశారు.
చదవండి:
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు
Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment