Vienna
-
టేలర్ స్విఫ్ట్ కచేరీపై ఉగ్రదాడికి కుట్ర
వియన్నా: ఆ్రస్టియా భద్రతాధికారులు సకాలంలో స్పందించి పెనుముప్పు నివారించగలిగారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ గురువారం రాజధాని వియన్నాలో తలపెట్టిన కచేరీలో నరమేధానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. 19 ఏళ్ల ప్రధాన సూత్రధారి సహా 17 ఏళ్ల మరో యువకుడిని అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల మరో అనుమానితుడిని ప్రశి్నస్తున్నారు. ఎర్నెస్ట్ చాపెల్ స్టేడియానికి వచ్చే వారిని పేలుడు పదార్థాలు వాడి లేదా కత్తులతో పొడిచి సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని పథకం వేసినట్లు తేలింది. వీరికి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో టేలర్ పాల్గొనాల్సిన మొత్తం మూడు కచేరీలను రద్దు చేశారు. -
భారత్ వ్యవహారాల్లో కెనడా జోక్యం
న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి. ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే. -
దౌత్యాధికారుల తగ్గింపు వ్యవహారం.. కెనడాకు అమెరికా, యూకేల మద్దతు
లండన్/వాషింగ్టన్: కెనడాకు చెందిన 41 మంది దౌత్యాధికారుల హోదాను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో తాము విభేదిస్తున్నట్లు అమెరికా, యూకేలు ప్రకటించాయి. సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని భారత్ తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపాయి. వియన్నా ఒప్పంద సూత్రాలకు భారత్ ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకమని యూకే పేర్కొనగా, విభేదాల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో దౌత్యాధికారుల అవసరం ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ నొక్కి చెప్పింది. ‘దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం. దౌత్యవేత్తల భద్రత కోసం కల్పించాల్సిన అధికారాలు, ఇతర హక్కులను ఏకపక్షంగా తొలగించడం వియన్నా సూత్రాల విరుద్ధం. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్వతంత్ర దర్యాప్తులో కెనడాతో పాలుపంచుకోవాలని భారత్‌ను కోరుతూనే ఉన్నాం’అని యూకే విదేశాంగశాఖ పేర్కొంది.‘భారత్‌లో దౌత్యాధి కారులను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేయడం, కెనడా తన దౌత్యవేత్తలను వెనక్కి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విభేదాలను పరిష్కరించడానికి క్షేత్ర స్థాయిలో దౌత్యవేత్తలు అవసరం. దౌత్యా ధికారులను తగ్గించాలంటూ కెనడాపై ఒత్తిడి తేవద్దని, నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం’అని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. -
చలో వియన్నా
పారిస్: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్ (న్యూజిలాండ్)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్ పత్రిక ప్రచురించింద కరోనా దెబ్బకు ఆక్లండ్ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్ 19 స్థానంలో, లండన్ 33, మిలన్ (ఇటలీ) 49, న్యూయార్క్ 51వ స్థానంలో నిలిచాయి. టాప్ 10 నగరాలు 1. వియన్నా (ఆస్ట్రియా) 2. కోపెన్హగెన్ (డెన్మార్క్) 3. జ్యురిచ్ (స్విట్జర్లాండ్) 4. కాల్గరీ (కెనడా) 5. వాంకోవర్ (కెనడా) 6. జెనీవా (స్విట్జర్లాండ్) 7. ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ) 8. టొరంటో (కెనడా) 9. ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) 10. ఒసాకా (జపాన్) మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) -
ఈ గ్రహం మీద అదే గొప్పదట, పోదామా,పోదామా.. వియన్నా!
పారిస్: ఆస్ట్రియా రాజధాని వియన్నా ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆస్ట్రేలియా నగరం ఆక్లాండ్ 34వ స్థానానికి పడిపోయింది. అనూహ్యంగా వియన్నా టాప్‌లోకి దూసుకొచ్చింది. అలాగే ఈ ఏడాది కూడా సిరియా రాజధాని డమాస్కస్ ఈ గ్రహం మీద అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 173 నగరాల్లో ఒక వ్యక్తి జీవనశైలికి ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటుంది. కరోనా కారణంగా మ్యూజియంలు, రెస్టారెంట్లు మూవేత కారణంగా 2021 ప్రారంభంలో ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయిన వియన్నా, తిరిగి 2018, 2019 మాదిరిగా టాప్‌లోకి వచ్చిందని నివేదిక పేర్కొంది. వియన్నా తర్వాత డానిష్ రాజధాని కోపెన్హాగన్ రెండు, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, కెనడాలోని కాల్గరీ సంయుక్తగా మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి. కోపెన్హాగన్ వాంకోవర్ ఐదవ స్థానంలో, స్విస్ నగరం జెనీవా ఆరో స్థానంలో, జర్మనీకి చెందిన ఫ్రాంక్ఫర్ట్ ఏడో స్థానంలో, టొరంటో ఎనిమిదో స్థానంలో, నెదర్లాండ్స్‌కు చెందిన ఆమ్స్టర్డామ్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) వార్షిక నివేదికను గురువారం ప్రచురించింది. డమాస్కస్ ఫిబ్రవరి చివరలో రష్యా వార్ తర్వాత ఉక్రేనియన్ రాజధాని కైవ్ ఈ సంవత్సరం ఈ జాబితాలో చోటు కోల్పోయింది. ఈఐయూ సర్వేలో ఈ నగరాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే "సెన్సార్షిప్", పాశ్చాత్య ఆంక్షల ప్రభావంపై రష్యన్ నగరాలు మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ ర్యాంకింగ్‌లలో కిందికి పడిపోయాయి. రష్యా రాజధాని మాస్కో 15 స్థానాలు క్షీణించగా, సెయింట్ పీటర్స్బర్గ్ 13 స్థానాలు దిగజారింది. మొదటి పది నగరాల్లో ఆరు నగరాలు యూరప్‌వి కావడం విశేషం. జపాన్‌కు చెందిన ఒసాకా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్‌లు పదో స్థానాన్ని దక్కించుకోగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ గతేడాదితో పోలిస్తే 23 స్థానాలు ఎగబాకి 19వ స్థానంలో నిలిచింది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ కెనడాలోని మాంట్రియల్ కంటే 24వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్ ప్రపంచంలో అత్యంత నివసించదగిన నగరాలలో 33వ స్థానంలో ఉంది. పారిస్ స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా మాడ్రిడ్ వరుసగా 35, 43 స్థానాల్లో నిలిచాయి. ఇటలీకి చెందిన మిలన్ 49వ ర్యాంక్‌లో, న్యూయార్క్ 51వ స్థానంలో, చైనాలోని బీజింగ్ 71వ స్థానంలో నిలిచాయి. అలాగే 2020 పోర్ట్ పేలుడుతో సర్వ నాశనమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న లెబనాన్, రాజధాని బీరుట్ కూడా ర్యాంకింగ్‌లో జాబితాలో చోటు కోల్పోయింది. -
విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది
Bitpanda CEO Eric Demuth Success Story: ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది’.. ఇదే జరిగింది ఎరిక్ డెమ్యూత్(34) లైఫ్‌లో. వృథా ఖర్చులకు వెనుకాడే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన కలను సైతం వదిలేసుకుని.. మరో దారిలోకి దిగాడు. విజయమో.. ఓటమో ఏదో ఒకటి తేల్చుకుని కెరీర్లో పోరాడాలనుకున్నాడు. అతని ప్రయత్నానికి అదృష్టం తోడైంది. ఒకప్పుడు జేబులో పాకెట్ మనీకి మూడు డాలర్లు పెట్టుకుని తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు మిలియన్ల సంపదతో యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌గా ఎదిగాడు మరి. బిట్‌పాండా.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఓ సంచలనం. యూరప్‌లో క్రిప్టో కరెన్సీని ప్రధానంగా ప్రచారం చేసింది ఇదే. ఆస్ట్రియా-వియన్నా నియోబ్రోకర్గా ఉన్న ఈ కంపెనీ.. కామన్ పీపుల్‌కు క్రిప్టోకరెన్సీని చేరువచేసింది. డిజిటల్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, బిట్‌కాయిన్‌ను హ్యాండిల్ చేయడం, డిజిటల్ ఆస్తుల కొనుగోలు-అమ్మకం, గోల్డ్ దాచుకోవడం, సేవింగ్స్.. ఇలా క్రిప్టో బిజినెస్ తీరుతెన్నులను సాధారణ పౌరులకు సైతం అర్థం అయ్యేలా చేసింది బిట్‌పాండా. ఈ ప్రత్యేకత వల్లే ఏడేళ్లు తిరగకుండానే యూరప్‌లో బిట్‌పాండా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిట్‌పాండా విలువ సుమారు 4.1 బిలియన్ డాలర్లపైనే ఉండగా.. అందులో డెమ్యూత్ వాటా దాదాపు 820 మిలియన్ల డాలర్లు. కష్టజీవి వియన్నాకి చెందిన ఎరిక్ డెమ్యూత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచే పొదుపరిగా ఉండే ఈ కుర్రాడు ఏనాడూ పైసా విదిల్చేవాడు కాదు. పైగా తన చిన్నతనంలో పేరెంట్స్ చేసే వృథా ఖర్చులపై నిలదీసేవాడు. అలాంటి ఎరిక్‌కు షిప్‌కు కెప్టెన్ కావాలని కల ఉండేది. అందుకే చెప్పాపెట్టకుండా 23 ఏళ్ల వయసులో కంటెయినర్ షిప్స్ మీద కూలీ పనికి వెళ్లాడు. చైనా, జపాన్.. నైరుతి ఆసియా ప్రాంతాల్లో పని చేశాడు. షిప్ కెప్టెన్ కావాలన్నది అతని కల. ఆ కల కోసం అలా ఎన్నాళ్లైనా కష్టం భరించాలనుకున్నాడు. ఒక్కపూట తిండి.. చాలిచాలని జీతంతో గడిపాడు. కానీ, రెండున్నరేళ్లు గడిచాక అతని వల్ల కాలేదు. మెకానిక్‌గా, యాంకర్లు వేసే కూలీగా సంచార జీవనం గడపడం అతనికి బోర్‌గా అనిపించింది. అందుకే ఆ ఉద్యోగం వదిలేశాడు. వియన్నాకు తిరిగి వచ్చేశాడు. ఈసారి ఫైనాన్స్ చదవులోకి దిగాడు. పౌల్ క్లాన్స్చెక్తో డెమ్యూత్ కాళ్లు అరిగేలా తిరిగి, ఒప్పించి.. ఫైనాన్స్ కోర్స్ పూర్తి చేశాక.. డిజిటల్ బిజినెస్ ఎక్స్పర్ట్ పౌల్ క్లాన్స్చెక్ను కలిశాడు డెమ్యూత్. వీళ్లిద్దరూ మరో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ క్రిస్టియన్ ట్రమ్మర్తో కలిసి క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పీటర్ థెయిల్ ‘వాలర్’ వెంచర్స్ సాయం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. అయినా టైం వేస్ట్ చేయకుండా వాలర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్ల ప్రయత్నం థెయిల్ను ఆకట్టుకుంది. కొంతమేర పెట్టుబడులకు ముందుకొచ్చాడు. వారం తిరగకముందే 263 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో బిట్‌పాండా కంపెనీ మొదలైంది. ఇందులో డెమ్యూత్ ఖర్చు పెట్టకుండా దాచుకున్న సొమ్మంతా కూడా ఉంది. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఇదొక బిజినెస్ పాఠం కావాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్లకు యూరప్ క్రిప్టో కరెన్సీతో డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తోంది ఆపరేటింగ్ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ బిట్‌పాండా. మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరుగుతాయన్న గ్యారెంటీ ఉందా?. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా మిగతా వాళ్లలాగే నాకు సరదాగా ఉండాలని ఉండేది. కానీ, వృథా ఖర్చులతో ఏం ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్నా. నా లక్క్ష్యం ఒకటి ఉండేది. అది తప్పినా మరోదారిని ఎంచుకుని విజయం కోసం ప్రయత్నిస్తున్నా.(తనది పూర్తి విజయంగా ఒప్పుకోవట్లేదు డెమ్యూత్). నాలాగే చాలామందికి ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కల నెరవేర్చుకునేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. లేదంటే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అలాంటప్పుడే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నవాళ్లం అవుతాం. - ఎరిక్ డెమ్యూత్ చదవండి: బిజినెస్ పాఠాలు నేర్పిన చిరంజీవి సినిమా తెలుసా? -
మత్తు బానిసలు 275 మిలియన్లు!
న్యూయార్క్: మత్తు వదలరా, ఆ మత్తులో పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ అని 50 ఏళ్ల క్రితం ఓ సినీకవి రాసిననట్టుగా యువత పెడదారి పడుతోంది. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం జాతి భవితకే తీరని చేటు. తాజాగా వియన్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురువారం విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించగా.. 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది. 15 నుంచి 64 మధ్య వయస్సు ఉన్నవారిలో 5.5 శాతం మంది గత సంవత్సరం ఒక్కసారైనా డ్రగ్స్ ఉపయోగించారని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగిందని ఈ నివేదక తెలిపింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా.. 42 శాతం మంది గంజాయి వాడకం పెరిగిందని చెప్పారు. అదే విధంగా ఇతర ఔషధాల వినియోగం కూడా పెరిగిందని వివరించారు. గత 24 ఏళ్లలో, కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. "మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలియక చాలా మంది ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వాడుతున్నారు. యూఎన్ఓడీసీ 2021 ప్రపంచ ఔషధ నివేదిక ఫలితాలు యువతకు అవగాహన కల్పించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి." అని యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గడా వాలీ ఆశా భావం వ్యక్తం చేశారు. చదవండి: దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు Hyderabad: 28న ‘స్కిన్ బ్యాంక్’ ప్రారంభం -
ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
-
ఆస్ర్టియా రాజధాని వియన్నాలో ఉగ్రదాడి
వియన్నా :ఆస్ర్టియాలో రాజధాని వియన్నాలో సోమవారం జరిగిన ఉగ్రదాడి జరిగింది. హిల్టన్ హోటల్లోని పర్యాటకులను బందీలుగా చేసుకొని ముంబై తరహాలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వియన్నాలోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆర్మీని రంగంలోకి దించిన ఆస్ట్రియా ప్రభుత్వం.. వియన్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అటోమెటిక్ మొబైల్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వియన్నా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని మంత్రి నెహమ్మర్ తెలిపారు. (కాబూల్ వర్సిటీలో కాల్పులు ) కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ర్టేలియాలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది. అప్పటికే కొన్ని రెస్టెంట్లు, కేఫ్‌లు మూసిఉన్నాయని అధికారులు తెలిపారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టామని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీబావం తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. I’m following with grave concern the violent attacks of terror in Vienna, one of our UN HQ. I condemn these attacks in the strongest possible terms and reaffirm the @UN's solidarity with the people & Government of Austria. https://t.co/WQfbKhsMg6 — António Guterres (@antonioguterres) November 3, 2020 -
జొకోవిచ్‌కు షాక్!
వియన్నా: ప్రపంచ నంబర్ వన్, 17 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఆస్ట్రియా రాజధానిలో జరుగుతున్న వియన్నా ఓపెన్‌లో అనామక ఆటగాడు లొరెంజో సొనెగొ (ఇటలీ) చేతిలో అతను కంగుతిన్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జొకోవిచ్ 2–6, 1–6తో లొరెంజో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2005 ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ ఓటమి తర్వాత జొకోవిచ్‌కు ఎదురైన దారుణ పరాభవం ఇదే కావడం విశేషం. ఈ రెండు మ్యాచ్‌ల్లో జొకోవిచ్ కేవలం మూడు గేములను మాత్రమే సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడ్డ జొకోవిచ్... ఎక్కడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఈ మ్యాచ్‌లో లొరెంజో ఎనిమిది ఏస్‌లను కొట్టగా... జొకోవిచ్ కేవలం మూడు ఏస్‌లను మాత్రమే సంధించాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడి ఈ టోర్నీకి ముందుగా అర్హత సాధించలేకపోయిన 42వ ర్యాంకర్ లొరెంజో...అదృష్టం కలిసొచ్చి ‘లక్కీ లూజర్’గా అడుగు పెట్టడం విశేషం. గతంలో 12 సార్లు ఇలాంటి లక్కీ లూజర్లపై తలపడి ఓటమి ఎరుగని జొకోవిచ్, తొలిసారి పరాజయం పాలయ్యాడు. -
‘నా ముగ్గురు కూతుళ్లను చంపేశా’
వియన్నా: ముగ్గురు కూతుళ్లను చంపిన ఓ తల్లి, ఆ తర్వాత తనను తాను అంతం చేసుకునేందుకు సిద్ధమైంది. కానీ అంతలోనే మనసు మార్చుకుని, స్వల్ప గాయాలతో బయటపడింది. చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. డొనాస్టడ్ జిల్లాకు చెందిన మహిళకు తొమ్మిది, మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమె మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: బాత్రూంలో ప్రసవం.. బిడ్డను విసిరేసింది) ఈ క్రమంలో శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంటికి రావాల్సిందిగా కోరింది. తన కుమార్తెలను చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వారికి చెప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితురాలి ఇంటికి బయల్దేరారు. రక్తపు మడుగులో ఉన్న పడి ఉన్న బాలికల మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. నిందితురాలికి కూడా గాయాలు అయ్యాయని, ఆమె కోలుకున్న తర్వాతే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ముగ్గురు తల్లుల ముచ్చట
కాలేజీ రోజుల నుంచి కన్న కల వారికి పిల్లలు పుట్టిన తర్వాత నెరవేరింది. వియని, పూనమ్, రైనా ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఉండేది ముంబయ్‌లో. ఈ ముగ్గురూ కలిసి ఏదైనా మంచి గుర్తింపు వచ్చే వ్యాపారం చేయాలని కలలు కన్నారు. ముగ్గురూ కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరారు. రోజులో ఎక్కువ సమయం ఉద్యోగానికే కేటాయించేవారు. పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఓ వైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల పనులతో తీరికలేకుండా ఉండేవారు. ఆ సమయంలోనే పిల్లల దుస్తుల బ్రాండ్ ప్రారంభించాలనుకున్నారు. ముగ్గురూ ఒక్కొక్కరూ రూ.30 వేలతో రెండేళ్ల క్రితం ‘ఓయి ఓయి’ అనే పేరుతో కిడ్స్ బ్రాండ్‌ని ప్రారంభించారు. దానర్ధం ఫ్రెంచ్‌లో ‘ఎస్ ఎస్’. ‘నేను తల్లినయ్యాక ఇంటి నుండి ఆఫీసు పని చేసేదాన్ని. ఒక రోజు నా పై అధికారి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు, ఉద్యోగం వదులుకోమని చెప్పారు’ కొన్ని కంపెనీలు ఇప్పటికీ పని చేసే తల్లుల స్థితిని పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ పరిస్థితిని చెబుతూ ‘మేం ముగ్గురం చిన్నప్పటి నుంచీ స్నేహితులం. మాకు ఒకరి స్వభావాలు మరొకరికి బాగా తెలుసు. మా ముగ్గురికీ చిన్నపిల్లలు ఉన్నారు. మేం ఈ వ్యాపారం ప్రారంభించాక ఒక్కొక్కరం ఒక్కోసారి వీలును బట్టి వర్క్ చేసుకునే అవకాశం లభించింది’ అని తెలిపారు వియని. రెండేళ్ల క్రితం ప్రారంభం ‘2018లో ముందు తెలిసిన వారి ద్వారా, ఇన్‌స్ట్రాగామ్ ఆర్డర్ల ద్వారా మా వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాం. ఇందుకు మా బ్రాండ్ దుస్తులను మా పిల్లలకే వేసి ఫొటో షూట్ చేయించాం. వాటిని ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశాం. దీంతో మా ఫ్రెండ్స్, ఇతర కుటుంబ సభ్యులు, తెలిసినవారు మా నుండి బట్టలు కొన్నారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చినప్పుడు మా ఇన్సా ్టగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేస్తూ ఆర్డర్లను పెంచడంపై దృష్టి పెట్టాం’ అని రైనా చెప్పారు. ‘మొదట్లో పెద్దగా డబ్బు సంపాదించకపోయినా ఆర్డర్ రాగానే మెటీరియల్ తేవడం, డిజైనింగ్ చేయడం.. త్వరగా వినియోగదారునికి అందించడం చేసేవాళ్లం. ఎంతోమంది చిన్నారులను మా దుస్తులతో అందంగా ఉంచుతున్నాం అనే ఆలోచన మాలో హుషారుని ఇచ్చింది’ అని వియని చెప్పారు. సెలబ్రిటీల నుంచి... ఇన్స్టాగ్రామ్ ద్వారా త్వరలోనే ప్రముఖుల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇనాయా ఖేము, తైమూర్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మెహర్ బేడి ధుపియా వంటి పిల్లలంతా ప్రముఖ సెలబ్రిటీల పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలే మా ‘బుల్లి క్లయింట్లు’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ముగ్గురు తల్లులు. శోభా డే మనవరాళ్ళు, లిసా రే కుమార్తెలు వీరి ప్రచారంలో ఇప్పుడు భాగమయ్యారు. ‘ఓయి ఓయి’ కి మిగతా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ వేదికగా నిలిచాయి. ట్రిక్స్ అండ్ టిప్స్ సరసమైన ధరలకు స్మార్ట్ క్యాజువల్ బ్రాండ్‌ని అందిస్తూ వచ్చారు. తల్లిదండ్రులకు పెప్పీ ప్రింట్ల నుండి పలాజో సెట్ల వరకు ఒకే చోట దొరికే సదుపాయం కల్పించారు. దీంతో వ్యాపారాన్ని షాపుల ద్వారానూ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో హాప్స్కాచ్తో ‘ఓయి ఓయి’ని విజయవంతంగా ప్రారంభించారు. లిటిల్ మఫెట్, ఫస్ట్క్రీ, మింత్రాతో కలిసి పనిచేయడం ఈ బ్రాండ్‌కు మరింత సహాయపడింది. ఆర్డర్లు .. అవార్డులు రెండుసార్లు కిడ్స్స్ట్రాపెస్, ఇండియా కిడ్స్ బ్రాండ్ అవార్డు, స్మార్ట్ దుస్తులు పిల్లల విభాగంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా పేరు సంపాదించింది ఓయి ఓయి. 2021 నాటికి నెలకు 10,000 ఆర్డర్లు పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ 3 మామ్స్. కోవిడ్–19 ప్రభావం ఈ బ్రాండ్ కార్యకలాపాలపైనా చూపింది. అయితే లాక్డౌన్ ముగిసిన నాటి నుంచి అత్యధిక అమ్మకాలూ జరిగాయని ఈ ముగ్గురు తల్లులూ సగర్వంగా చెబుతున్నారు. -
అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం
వియన్నా : ఆస్ట్రియా రాజధాని వియన్నా సిటీ సెంటర్లో అన్ని రకాల మోటారు సైకిళ్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వియన్నాను మోటార్ సైకిల్ ఫ్రీ సెంటర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ఆస్ట్రియాలోనే అత్యధిక జనాభా కలిగిన వియన్నా ప్రాంతం యూరోప్ ఖండంలోనే అద్భుతమైన రహదార్లను కలిగి ఉండి టూ వీలర్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కాగా ఆస్ట్రియాలోని టైరోల్ రాష్ట్రంలో కొద్దికాలం కిందట పర్యావరణం కాపాడడంపై మోటారు సైకిళ్లపై నిషేధం విధించారు. తాజాగా వియన్నాలో కూడా దీనిని అమలు చేయనున్నారు. అయితే టైరోల్ ప్రాంతంలో ఉన్న నిషేధానికి భిన్నంగా ఇక్కడ అమలు చేయనున్నారు. అందుకు వియన్నాలో ప్రఖ్యాత మోటారు సైకిల్ బ్రాండ్ కెటిఎమ్ తన మద్దతు తెలిపింది. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') అన్ని రకాల టూ వీలర్స్ అంటే పర్యావరణానికి అనువుగా ఉండే బ్యాటరీ, ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో నడిచే అన్ని రకాల వాహనాలను పూర్తిగా నిషేధం విధించనున్నారు.ఇప్పటికే వియాన్నా ప్రాంతంలో అత్యధికులు ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకు మారారు. అంతేగాక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా అక్కడి పౌరులు విస్తృతంగా అంగీకరించారు. అయితే మోటారు వాహనాలను పూర్తిగా నిషేధించాలని చేపట్టిన చర్యలపై వాహనదారులు ఆలక్ష్యం వహించడంతో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వియన్నా సిటీ సెంటర్లో బైక్ పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై కూడా ఈ నిషేధం వర్తించనుంది. అయితే సిటీ సెంటర్ వెలుపల ఉన్న రింగ్‌రోడ్డుపై మాత్రం అన్ని రకాల ప్రైవేట్ కార్లు, వాన్లు, మోటార్ సైకిళ్లు ఆ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వియన్నా సిటీ సెంటర్లో నివసించే వ్యక్తులు, ప్రైవేట్ గ్యారేజీలో పనిచేసే వాళ్లకు మాత్రం ఫ్రీ రోడ్లో తిరిగే అవకాశంతో పాటు వాహన పార్కింగ్‌కు అనుమతులిచ్చారు. -
ఒకే ఒక్కడు... కిప్‌చెగో
వియన్నా: గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇలియుడ్ కిప్‌చెగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కిప్‌చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్‌చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాకపోవడంతో కిప్‌చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్‌చెగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్ మారథాన్‌లో కిప్‌చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్ రేసును తిలకించేందుకు కిప్‌చెగో స్వదేశం కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్‌చెగో ఘనతను టీవీల్లో వీక్షించారు. రెండేళ్ల క్రితం ఇటలీలో కిప్‌చెగో 2 గంటల్లోపు మారథాన్ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం అతను సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు. -
ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్ నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. -
పదే పదే గ్యాస్ వదలుతున్నాడంటూ...
-
గ్యాస్ వదలుతున్నాడంటూ...
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు. డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. -
ప్రపంచంలో ఉత్తమ, చెత్త నగరాలివే
లండన్: అత్యున్నత జీవన ప్రమణాలు కలిగివున్న నగరాల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొదటిస్థానంలో నిలిచింది. ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ మెర్సర్.. ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో అభిప్రాయసేకరణ నిర్వహించి వెల్లడించిన జాబితాలో వియన్నా వరుసగా ఎనిమిదోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ జాబితాలో అత్యంత చెత్తనగరంగా బాగ్దాద్ చివరిస్థానంలో నిలిచింది. రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రైమ్, వినోదం మరియు రవాణా ప్రమాణాలు లాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని మెర్సర్ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో లండన్, పారిస్, టోక్యో, న్యూయార్క్ నగరాలు టాప్ 30లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. వియన్నాతో పాటు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్లు వరుసగా టాప్ 5లో నిలిచాయి. ఆసియా నుంచి అగ్రస్థానంలో సింగపూర్(25వ ర్యాంకు) నిలిచింది. అమెరికా నుంచి ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన నగరం శాన్ఫ్రాన్సిస్కో(29వ ర్యాంకు). -
బొద్దుగుమ్మ 'బుజ్జిమా' కష్టాలు తీరిపోయాయి!
దేశం కాని దేశంలో హ్యాండ్‌బ్యాగ్, పాస్‌పోర్టు పోగొట్టుకొని.. పీకల్లోతు కష్టాల్లో పడిన తెలుగు, తమిళ చిత్రాల హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కష్టాలు తీరిపోయాయి. ఆమెను ఆదుకోవడానికి వియన్నాలోని భారత రాయబార కార్యాలయం ముందుకొచ్చింది. స్వదేశం వచ్చేందుకు ఆమెకు తాత్కాలిక ట్రావెల్ పర్మిట్‌ను జారీచేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపిన విద్యుల్లేఖ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. (చదవండి - చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా') స్నేహితులతో కలిసి వియన్నాలో విహారానికి వెళ్లిన విద్యుల్లేఖను ఊహించని కష్టాలు చుట్టుముట్టాయి. ఆమె ఉన్న హోటల్ లాబీలో ఆమె హ్యాండ్‌బ్యాగును దొంగలు కొట్టేశారు. దీంతో పాస్‌పోర్టు, క్యాష్ కార్డ్స్, డబ్బు అంతా కోల్పోయి విద్యుల్లేఖ చిక్కుల్లో పడింది. స్నేహితులతో కలిసి ఈ దేశానికి రావడమే తప్పయిందని ట్విట్టర్లో వాపోయింది. ఇదంతా తలరాత అయి ఉంటుందని వైరాగ్యం ప్రకటించింది. వియన్నాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో తనకు వెంటనే భారత రాయబార కార్యాలయం సాయం చేసిందని, ఎంతో స్నేహపూర్వకంగా రాయబార సిబ్బంది తనను అర్థం చేసుకున్నారని, ఇది ఎంతో ఆనందం కలిగిస్తున్నదని విద్యుల్లేఖ తాజాగా విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పీఎంవోను ట్యాగ్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. తనకు జరిగింది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనలో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి హాని జరగనందుకు కృతజ్ఞురాలై ఉంటానని, తాను సురక్షితంగా ఉన్నానని విద్యుల్లేఖ తెలిపింది. టూరిస్టులు లక్ష్యంగా ఎప్పుడూ దాడులు జరుగుతాయని, వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తన అనుభవపూర్వకంగా సూచించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'సరైనోడు' సినిమాలో సాంబారు చబ్బీ బ్యూటీగా, 'రాజుగారి గది' చిత్రంలో బుజ్జిమాగా తమిళ నటి విద్యుల్లేఖ రామన్ తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు తమిళ, తెలుగు చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారింది. A big thanks 2 everyone who gave me info and helped me out. The Indian Embassy in Vienna has issued a temporary travel permit 2 travel today — Vidyu (@VidyuRaman) 4 May 2016 .@SushmaSwaraj @PMOIndia the Indian Embassy in Vienna was extremely friendly, understanding and helped me immediately. I am safe. Thank you — Vidyu (@VidyuRaman) 4 May 2016 -
చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా'
చెన్నై: బన్నీ మూవీ సరైనోడులో... సాంబారు చబ్బీ బ్యూటీ, రాజుగారి గది చిత్రంలో బుజ్జిమాగా ఆకట్టుకున్న తమిళ నటి విద్యుల్లేఖ రామన్ గుర్తుందా...డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విద్యు విదేశంలో చిక్కుల్లో పడ్డారు. స్నేహితులతో కలసి ఇటీవల ఆస్ట్రియాలోని వియన్నా పర్యటనకు వెళ్లిన ఆమె బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రిత్వ శాఖను, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ట్విట్టర్ లో వేడుకున్నారు. వియన్నా సందర్శన తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనీ, డబ్బు, పాస్ పోర్ట్ , ఇంకా విలువైన వస్తువులను కోల్పోయానంటూ ట్విట్టర్ లో వాపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఆదుకోవాల్సిందిగా వరుస ట్వీట్ల ద్వారా అభ్యర్థించారు. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు .. వియన్నాలో తాను ఉన్నహోటల్ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగిలించారని అందులో తన పాస్‌పోర్ట్, కార్డులు, డబ్బు.. తదితరాలు ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి అడ్రస్ ఏంటని అడుగుతూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడని ఈ లోపుగా మరో వ్యక్తి వచ్చి బ్యాగును దొంగిలించాడని చెప్పారు. హోటల్లోని సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించడానికి హోటల్ యాజమాన్యం సమ్మతించడంలేదని ఆరోపించారు. దీంతో చెన్నైలోని ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం సహకరించి తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కోరారు. కాగా తమిళ, తెలుగు చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారిన విద్యుల్లేఖా రామన్ 'ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా' భలే మంచి రోజు' తదితర చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించారు. అనంతం ఈ బొద్దుగుమ్మ రాజుగారి గది సినిమాలోని హాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. .@SushmaSwaraj My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna. — Vidyu (@VidyuRaman) 3 May 2016 .@PMOIndia My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna. Sos — Vidyu (@VidyuRaman) 3 May 2016 -
77 ఏళ్ల తర్వాత..
వియన్నా: రెండో ప్రపంచ యుద్ధంలో వేసిన 250 కిలోల బాంబును ఆస్ట్రియాలోని డోయేబ్లింగ్ జిల్లాలో దొరికింది. 1939 సెప్టెంబర్ 1 నుంచి 1945 సెప్టెంబర్ 2 వరకు జరిగిన ఈ యుద్ధంలో ఈ భారీ బాంబు వేసినా పేలకుండా ఉండిపోయింది. ఇటీవల భవన నిర్మాణం కోసం తీస్తున్న పునాదిలో 2.5 మీటర్ల లోతు వద్ద ఈ బాంబు వర్కర్ల కంట పడింది. బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి బాంబు ఉన్న ప్రదేశం చుట్టూ 300 నుంచి 400 మీటర్ల దూరాన్ని బ్లాక్ చేశారు. బాంబు దొరికిన ప్రదేశానికి రైల్వే ట్రాక్ చేరువలో ఉండటంతో రవాణ వ్యవస్థను నిలిపివేశారు. మొదట ఈ బాంబును యూఎస్‌కు చెందినది భావించిన స్క్వాడ్.. దాన్ని అక్కడే నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, బాంబును సురక్షితంగా తరలించేందుకు వీలు కుదరడంతో అక్కడి నుంచి తరలించి రైల్వే వ్యవస్థను పునరుద్ధరించారు. -
ఉగ్రహెచ్చరికతో వియన్నాలో భద్రత పెంపు
లండన్: క్రిస్మస్, జనవరి 1 మధ్యలో యురోపియన్ దేశాల రాజధాని నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేటిని లక్ష్యంగా చేసుకుని దాడులుచేస్తారో తెలియదని, ఆయుధాలు లేదా బాంబు దాడులు జరగొచ్చని హెచ్చరికలు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి కొత్త ఏడాది ప్రత్యేక కార్యక్రమాలను రద్దుచేయడం లేదని స్పష్టంచేశారు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో దాడులపై నిఘా వర్గాల నుంచి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. -
మెల్ బోర్న్ మరోసారి...
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా నగరం మెల్ బోర్న్ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. ఆవాసానికి అత్యంత అనువైన ప్రపంచ నగరాల్లో అగ్రశేణిలో నిలిచింది. ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన గ్లోబల్ సర్వేలో 140 నగరాలను అధిగమించి మెల్ బోర్న్ మొదటి స్థానం దక్కించుకుంది. విక్టోరియా రాష్ట్ర రాజధాని అయిన మెల్ బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. సర్వేలో వైద్యం, విద్య, స్థిరత్వం, సంస్కృతి, పర్యావరణం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 100 పాయింట్లుగానూ మెల్ బోర్న్ కు 97.5 స్కోరు దక్కింది. తక్కువ నేరాలు నమోదు కావడంతో మెల్ బోర్న్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా(97.4), కెనడా నగరాలు వాంకోవర్(97.3), టొరంటో(97.2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో ఆస్ట్రేలియా నగరం అడిలైడ్, కెనడా నగరం కాల్ గారీ సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాయి. టాప్-10లో ఏడు ఆస్ట్రేలియా, కెనడా నగరాలే ఉండడం విశేషం.