లండన్: క్రిస్మస్, జనవరి 1 మధ్యలో యురోపియన్ దేశాల రాజధాని నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వేటిని లక్ష్యంగా చేసుకుని దాడులుచేస్తారో తెలియదని, ఆయుధాలు లేదా బాంబు దాడులు జరగొచ్చని హెచ్చరికలు వచ్చాయని పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతానికి కొత్త ఏడాది ప్రత్యేక కార్యక్రమాలను రద్దుచేయడం లేదని స్పష్టంచేశారు. ముఖ్యంగా రాజధాని నగరాల్లో రద్దీ ప్రాంతాల్లో దాడులపై నిఘా వర్గాల నుంచి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.
ఉగ్రహెచ్చరికతో వియన్నాలో భద్రత పెంపు
Published Mon, Dec 28 2015 11:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM
Advertisement
Advertisement