
భగ్నం చేసిన ఆ్రస్టియా అధికారులు
వియన్నా: ఆ్రస్టియా భద్రతాధికారులు సకాలంలో స్పందించి పెనుముప్పు నివారించగలిగారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ గురువారం రాజధాని వియన్నాలో తలపెట్టిన కచేరీలో నరమేధానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. 19 ఏళ్ల ప్రధాన సూత్రధారి సహా 17 ఏళ్ల మరో యువకుడిని అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల మరో అనుమానితుడిని ప్రశి్నస్తున్నారు.
ఎర్నెస్ట్ చాపెల్ స్టేడియానికి వచ్చే వారిని పేలుడు పదార్థాలు వాడి లేదా కత్తులతో పొడిచి సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని పథకం వేసినట్లు తేలింది. వీరికి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో టేలర్ పాల్గొనాల్సిన మొత్తం మూడు కచేరీలను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment