వియన్నా :ఆస్ర్టియాలో రాజధాని వియన్నాలో సోమవారం జరిగిన ఉగ్రదాడి జరిగింది. హిల్టన్ హోటల్‌లోని పర్యాటకులను బందీలుగా చేసుకొని ముంబై తరహాలోనే ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వియన్నాలోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఈ కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆర్మీని రంగంలోకి దించిన ఆస్ట్రియా ప్రభుత్వం.. వియన్నా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. అటోమెటిక్ మొబైల్ సిస్టమ్ ద్వారా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వియన్నా నగరవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని మంత్రి నెహమ్మర్ తెలిపారు. (కాబూల్ వర్సిటీలో కాల్పులు )
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ర్టేలియాలో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరిగింది. అప్పటికే కొన్ని రెస్టెంట్లు, కేఫ్‌లు మూసిఉన్నాయని అధికారులు తెలిపారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టామని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియో గుట్రెస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్ర్టియా ప్రజలకు, ప్రభుత్వానికి సంఘీబావం తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.
I’m following with grave concern the violent attacks of terror in Vienna, one of our UN HQ.
— António Guterres (@antonioguterres) November 3, 2020
I condemn these attacks in the strongest possible terms and reaffirm the @UN's solidarity with the people & Government of Austria. https://t.co/WQfbKhsMg6
Comments
Please login to add a commentAdd a comment