కరోనాతో మానవాళికి పెనుముప్పు దాపురించింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు కరోనా నివారణకు తీసుకున్న కొన్ని చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణానికి మేలు చేశాయి. ఇదే విషయాన్ని తాజాగా ఐరాస వాతావరణ ఏజెన్సీ ధృవీకరించింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచి్చనట్లు తెలిపింది. 2020 లాక్‌డౌన్ కాలంలో గాలిలోకి వాయుకాలుష్యకాల విడుదల భారీగా తగ్గిందని తెలిపింది. ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) తొలి ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమెట్ బులిటన్‌ను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది కాలుష్యంలో తరుగుదల అంతంతమాత్రమేనని, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ నిరి్ధష్ట ప్రమాణాల కన్నా అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోందని హెచ్చరించింది. కొన్ని రకాల కాలుష్యకాలు గతంలో కన్నా ఎక్కువగానే విడుదలవుతున్నాయని తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌తో అనుకోని విధంగా వాయునాణ్యతా ప్రయోగం జరిగినట్లయిందని, దీనివల్ల స్థానికంగా తాత్కాలికంగా మంచి మెరుగుదల కనిపించిందని సంస్థ ప్రతినిధ/æ పెట్టెరి తాలస్ చెప్పారు.
కనిపించని ప్రభావం
గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఓజోన్‌లాంటి ప్రధాన కాలుష్యకారకాల స్థాయిలను సంస్థ తన నివేదికలో మదింపు చేసింది. సమావేశాలపై నిషేధం, బడుల మూసివేత, లాక్‌డౌన్ విధింపు తదితర చర్యలు చాలా ప్రభుత్వాలు చేపట్టడంతో ప్రధాన కాలుష్యకాలు అనూహ్యంగా గతేడాది తగ్గాయని విశ్లేíÙంచింది. అయితే ఈ చర్యల వల్ల ఒనగూరిన ప్రయోజనాలు తాత్కాలికమని, తిరిగి జన జీవనం మామూలు స్థాయికి రాగానే కాలుష్యకాలు తిరిగి పెరిగాయని తాలస్ తెలిపారు. పైగా లాక్‌డౌన్ చర్యలు కీలకమైన గ్రీన్‌హౌస్ వాయువుల స్థాయిలు తగ్గించలేకపోయాయని, ఇందుకు సంవత్సరాలు పడుతుందని వివరించారు. ఆ్రస్టేలియాలాంటి దేశాల్లో కార్చిచ్చు, సైబిరియాలో బయోమాస్ దగ్ధం, సహారాలో గాడ్జిల్లా ఎఫెక్ట్ వంటివి గతేడాది వాయునాణ్యతపై ప్రభావం చూపాయన్నారు. పర్యావరణంలో అనూహ్య మార్పులకు ప్రధాన కారణాల నివారణకు లాక్‌డౌన్ విధింపు సమాధానం కాదన్నారు. దేశాల ధోరణిలో మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు.
లాక్‌డౌన్లతో పెరిగిన వాయు నాణ్యత
Published Sat, Sep 4 2021 6:36 AM | Last Updated on Sat, Sep 4 2021 6:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment