World Meteorological Organisation
-
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
2023.. అత్యంత వేడి సంవత్సరం !
దుబాయ్: నెల రోజుల్లో ముగిసిపోనున్న 2023 ఏడాది.. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గురువారం నివేదించింది. నివేదిక తాలూకు వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి పిటేరీ టాలస్ చెప్పారు. ‘‘ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కి సంభవించిన ‘ఎల్‌నినో’ పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రి సెల్సియస్‌ను దాటనుంది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే నాలుగేళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే వీలుంది. ఆ తర్వాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయిదేళ్ళలో ఉష్ణగుండమేనా?
అంచనాలు నిజమవుతాయా, లేదా అంటే... ఎవరి విశ్లేషణ వారికి ఉండవచ్చు. కానీ, అంచనాలు అప్రమత్తం కావడానికి పనికొస్తాయనడంలో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండే అవకాశమే లేదు. ఐరాస ప్రపంచ వాతావరణసంస్థ తాజా అంచనాలు అప్రమత్తం చేస్తున్నాయి. అత్యవసర పరి స్థితిని తలపిస్తున్నాయి. ఉష్ణతాపాన్ని ఒడిసిపట్టుకొనే గ్రీన్హౌస్ వాయువులు, ఎల్‌నినో ఫలితంగా అయిదేళ్ళలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకొనే అవకాశం ఎక్కువుందన్న తాజా అంచనా అలాంటి ప్రమాద ఘంటికే. మన భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగే అవకాశం మూడింట రెండొంతులుందని ఆ అంచనా సారాంశం. ఈ బీభత్స ప్రభావం భవిష్య త్తులో ఆర్థికంగానూ అపారంగా ఉంటుందని సోమవారం ఆ సంస్థ చేసిన హెచ్చరిక తీవ్రమైనదే. కొన్నేళ్ళ క్రితం ఊహించినదాని కన్నా పరిస్థితి దిగజారింది. గత శతాబ్దిన్నరలో పర్యావరణానికి మనం చేసిన నష్టం అలాంటిది. పారిశ్రామికీకరణ కాలాని కన్నా ముందు (1850–1900 మధ్య) సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే, 1.5 డిగ్రీల గరిష్ఠ భూతాపోన్నతిని చరమావధిగా పెట్టుకున్నారు. ఆ లక్ష్మణరేఖ దాటితే ఉత్పాతం తప్పదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. 1.5 డిగ్రీలనే గరిష్ఠంగా ఎందుకు పెట్టుకున్నారంటే, అది దాటితే ఈ అదనపు ఉష్ణం కారణంగా జీవావరణ దుష్ప్ర భావం శరవేగంగా వ్యాపిస్తుంది. తారాజువ్వలా దూసుకుపోతుంది. అందుకే, భూతాపోన్నతిని ఆ గీత దాటకుండా నియంత్రించాలని 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలోనే తీర్మానించారు. ఈ గీతను చేరే అవకాశం తక్కువని 2015లో అనుకున్నారు. తీరా 2020కి వచ్చేసరికి అయిదింట ఒక వంతు ఛాన్సుందని తేలింది. నిరుడు ఆ ముప్పు 50 శాతం ఉండేది. ఇప్పుడు పరిమితిని దాటేసే ప్రమాదం 66 శాతానికి పెరిగిపోయింది. అంటే వచ్చే 2027 రెడ్ ఎలర్ట్ నామవత్సరం. ప్రపంచం ఉష్ణగుండమే. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 2016లో రికార్డయింది. ప్రాతిపదికగా తీసుకున్న 1900 నాటి ముందు కాలంతో పోలిస్తే, ఆ ఏటి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.3 డిగ్రీలు ఎక్కువ నమో దైంది. ఆ ఉష్ణరికార్డును దాటేరోజు ఎంతో దూరంలో లేదన్నదే ఇప్పుడున్న ఆందోళన. పర్యావరణ మార్పుతో పాటు చక్రభ్రమణమైన ఎల్‌నినో ప్రభావమూ అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఈ ఏడాది ఆసియా ప్రాంతాన్ని సాధారణంగా అధికంగా ఈ సెగ వేగిస్తుందని అంచనా. నిజానికి 1970 నుంచి 2021 మధ్య దుర్భర వాతావరణ మార్పులతో దాదాపు 12 వేల ఉత్పాతాలు జరిగాయని లెక్క. వాటి వల్ల 20 లక్షల మందికి పైగా మరణిస్తే, 4.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టాలు జరిగాయి. మరోలా చెప్పాలంటే, ఆ మొత్తం నష్టాలు భారతదేశ జీడీపీలో 25 శాతానికి పైమాటే! మన దేశం సంగతికొస్తే.. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 1901 నుంచి ప్రతి రెండు దశాబ్దాల కాలాన్ని పోల్చి చూస్తే, గత 20 ఏళ్ళ కాలంలో ఎన్నడూ లేనంతగా హెచ్చాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా పరిశోధనా పత్రమే ఆ సంగతి వెల్లడించింది. 1975 నుంచి తుపానులు, వరదలు అధికమయ్యేసరికి వ్యవసాయ ఉత్పత్తి, దరిమిలా ఆహార ధరలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. వాతావరణ ఉత్పాతాలకు ప్రభావితమయ్యే దేశాల జాబితా వేస్తే... ‘ప్రపంచ పర్యావరణ మార్పు ప్రమాద సూచి 2021’లో భారత్ 7వ స్థానంలో ఉంది. స్వాతంత్య్ర కాలంతో పోలిస్తే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, అనుబంధ రంగాల కన్నా సేవారంగం పాలు గణనీయంగా పెరిగినా, ఉష్ణతాపంతో అన్ని రంగాలకూ తిప్పలు తప్పవు. వచ్చే 2030 నాటికి ఎండ వేడిమికి ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాల్ని నష్టపోవాల్సి వస్తుందట. అందులో 3.4 కోట్లు భారత్‌లోనే సంభవిస్తాయని 2020లోనే ప్రపంచ బ్యాంక్ మాట. అలాగే, పెరిగే సముద్రమట్టంతో ప్రపంచంలో అత్యధికంగా చిక్కుల్లో పడేదీ మన దేశమే! ‘పర్యావరణ మార్పుపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సంఘం’ (ఐపీసీసీ) నిరుడు ఆ సంగతి కుండ బద్దలు కొట్టింది. ఈ శతాబ్ది మధ్యకల్లా 3.5 కోట్ల భారతీయులు ఏటా సముద్రతీర ముంపు బారిన పడతారు. ఈ శతాబ్దాంతానికి ఆ సంఖ్య 4.5 నుంచి 5 కోట్లవుతుందని అంచనా. అందుకే, పర్యావ రణంపై అంతంత మాత్రపు విధానాలనే అనుసరిస్తే కష్టమే. 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్య సాధన పెట్టుకున్నప్పటికీ 2050 కల్లా భారత జీడీపీ 8.5 నుంచి 10 శాతం దాకా తగ్గే ముప్పుంది. విధానపర మైన లోచూపును అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ఎకనామెట్రిక్ మోడల్ వేసిన లెక్క ఇది. ఈ లెక్కలు, చెబుతున్న మాటలు అంచనాలే కదా అని అలక్ష్యం చేస్తే కష్టమే. పర్యావరణ విశ్లేషణకు దీర్ఘకాలాల్ని ఎంచుకోవాలి గనక, ప్యారిస్‌లో చేసుకున్న బాసల్ని నిలిపామా, చెరిపామా అన్నది 2040కి కానీ నిర్ధరించలేం. అప్పటికి తెలిసినా పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే దేశాలన్నీ చేతులు కలిపి, ప్రమాద నివారణకు ప్రయత్నించడమే ఏకైక మార్గం. తక్షణమే హరిత ఇంధనం వైపు మరలాలి. భావి బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి. అలా చేయాలంటే ధనిక దేశాలు తమ కర్బన ఉద్గారాల పాపాల శాపాలను అనుభవిస్తున్న అమాయక వర్ధమాన దేశాలకు నష్టపరిహారం చేయాలి. మునుపు మాట ఇచ్చిన వందల కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించాలి. పాశ్చాత్య ప్రపంచం పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తే సరిపోదు. సత్వరమే ఆ మార్పుల నుంచి వెనక్కుమళ్ళి యథాపూర్వ స్థితికి వాతావరణం వచ్చేలా కృషిచేయాలి. ఉష్ణోగ్రతనూ, తద్వారా పర్యావరణ ఉత్పాతాన్నీ, ఆర్థికనష్టాలనూ తగ్గించడమే ఇక కర్తవ్యం. -
అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. 2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్–2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. నివేదికలో ఏం వెల్లడించారంటే.. ► 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్‌హౌజ్ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. ► అంటార్కిటికాలో, యూరప్‌ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి. ► 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది. ► 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. ► పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల భారత్‌లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు. ► అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ళీ గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ పెటిరీ తలాస్ చెప్పారు. ► కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది. -
COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. -
లాక్డౌన్లతో పెరిగిన వాయు నాణ్యత
కరోనాతో మానవాళికి పెనుముప్పు దాపురించింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు కరోనా నివారణకు తీసుకున్న కొన్ని చర్యలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణానికి మేలు చేశాయి. ఇదే విషయాన్ని తాజాగా ఐరాస వాతావరణ ఏజెన్సీ ధృవీకరించింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచి్చనట్లు తెలిపింది. 2020 లాక్డౌన్ కాలంలో గాలిలోకి వాయుకాలుష్యకాల విడుదల భారీగా తగ్గిందని తెలిపింది. ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) తొలి ఎయిర్ క్వాలిటీ అండ్ క్లైమెట్ బులిటన్‌ను శుక్రవారం విడుదల చేసింది. గతేడాది కాలుష్యంలో తరుగుదల అంతంతమాత్రమేనని, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ నిరి్ధష్ట ప్రమాణాల కన్నా అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోందని హెచ్చరించింది. కొన్ని రకాల కాలుష్యకాలు గతంలో కన్నా ఎక్కువగానే విడుదలవుతున్నాయని తెలిపింది. కరోనా లాక్‌డౌన్‌తో అనుకోని విధంగా వాయునాణ్యతా ప్రయోగం జరిగినట్లయిందని, దీనివల్ల స్థానికంగా తాత్కాలికంగా మంచి మెరుగుదల కనిపించిందని సంస్థ ప్రతినిధ/æ పెట్టెరి తాలస్ చెప్పారు. కనిపించని ప్రభావం గాలిలో సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, ఓజోన్‌లాంటి ప్రధాన కాలుష్యకారకాల స్థాయిలను సంస్థ తన నివేదికలో మదింపు చేసింది. సమావేశాలపై నిషేధం, బడుల మూసివేత, లాక్డౌన్ విధింపు తదితర చర్యలు చాలా ప్రభుత్వాలు చేపట్టడంతో ప్రధాన కాలుష్యకాలు అనూహ్యంగా గతేడాది తగ్గాయని విశ్లేíÙంచింది. అయితే ఈ చర్యల వల్ల ఒనగూరిన ప్రయోజనాలు తాత్కాలికమని, తిరిగి జన జీవనం మామూలు స్థాయికి రాగానే కాలుష్యకాలు తిరిగి పెరిగాయని తాలస్ తెలిపారు. పైగా లాక్డౌన్ చర్యలు కీలకమైన గ్రీన్హౌస్ వాయువుల స్థాయిలు తగ్గించలేకపోయాయని, ఇందుకు సంవత్సరాలు పడుతుందని వివరించారు. ఆ్రస్టేలియాలాంటి దేశాల్లో కార్చిచ్చు, సైబిరియాలో బయోమాస్ దగ్ధం, సహారాలో గాడ్జిల్లా ఎఫెక్ట్ వంటివి గతేడాది వాయునాణ్యతపై ప్రభావం చూపాయన్నారు. పర్యావరణంలో అనూహ్య మార్పులకు ప్రధాన కారణాల నివారణకు లాక్డౌన్ విధింపు సమాధానం కాదన్నారు. దేశాల ధోరణిలో మార్పుతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
మంటల్లో మంచు!
మాస్కో: ఏడాది పొడవునా మంచుతో నిండి ఉండే ఉత్తర ధ్రువ ప్రాంతం మండిపోతోంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీ సెల్సియస్‌కు చేరిపోవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ధ్రువ ప్రాంతంలోని ఈ విపరీత పరిణామం భూగోళంపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని రష్యా పట్టణం వెర్కెహెయాన్స్లో గత శనివారం ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం ఒక పరకటన చేస్తూ అనూహ్యమైన ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. -
ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
జెనీవా: హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది. -
ఈ దశాబ్దం చాలా హాట్ గురూ.!
మాడ్రిడ్: చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం(2010–2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది. అలాగే పారిశ్రామికీకరణ ముందు సమయం (1850–1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. మానవ కారణ ఉద్గారాలు, మౌలిక వసతుల నిర్మాణం, పంట సాగు, వస్తు రవాణా వంటివి 2019ని అత్యంత కార్బన్ ఉద్గారాలు వెలువడిన ఏడాదిగా రికార్డుకు ఎక్కించిందని డబ్ల్యూఎమ్‌వో వెల్లడించింది. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ప్రపంచంలో వెలువడిన ఉష్ణోగ్రతల్లో 90 శాతానికిపైగా వేడిని సముద్రాలు గ్రహిస్తాయని, దీంతో అవి ప్రస్తుతం అత్యంత వేడిని నమోదు చేస్తున్నాయని తెలిపింది. గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని డబ్ల్యూఎమ్‌వో వివరించింది. -
రికార్డు సృష్టించిన 2016
మరాకెచ్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మొరొకాన్ నగరంలో సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. భారతదేశంలో రాజస్తాన్ లోని పలోడీలో ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ముందస్తు హెచ్చరికలను గమనించి విపత్తు నిర్వహణను, వాతావరణాన్ని అంచనా వేసే విధానాలను మరింత ధృడపరుచుకోవాలని డబ్ల్యూఎంవో సూచించింది. ఈ ఏడాది వేడి గాలులు కూడా అత్యంత ఎక్కువగా వీచాయని తెలిపింది. -
రికార్డు సృష్టించిన 2016