60 శాతం అవకాశాలు ఉన్నాయన్న ప్రపంచ వాతావరణ సంస్థ
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది.
సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి.
ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్‌సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది.
ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment