మాస్కో: ఏడాది పొడవునా మంచుతో నిండి ఉండే ఉత్తర ధ్రువ ప్రాంతం మండిపోతోంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీ సెల్సియస్‌కు చేరిపోవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ధ్రువ ప్రాంతంలోని ఈ విపరీత పరిణామం భూగోళంపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని రష్యా పట్టణం వెర్‌కెహెయాన్స్‌లో గత శనివారం ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం ఒక పరకటన చేస్తూ అనూహ్యమైన ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment