record temperature
-
ఎండ వేడి నుంచి ఉపశమనం .. ఢిల్లీని ముద్దాడిన వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్‌పూర్‌లో 52.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు మండిపోతున్నాయి. భయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.అయితే ఉదయం నుంచి భగభగ మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడ్డాడు. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమదైన అనంతరం తేలికపాటి వర్షాలుక ఉరిశాయి. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేడి, ఉక్కపోతతో అల్లాడిన రాజధాని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. చల్లటి గాలలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.ఢిల్లీ, ఖార్ఖోడా, ఝజ్జర్, సోహానా, పల్వాల్, నుహ్, ఔరంగాబాద్, హోడల్ (హర్యానా) జట్టారి, ఖైర్ (హర్యానా)తోపాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాబోయే రెండు గంటలు అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.మరోవైపు ఢిల్లీని తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సంక్షోభం పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.2 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. -
India Meteorological Department: రాజస్తాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్తాన్‌లో ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నా యి. రాజస్తాన్‌లోని ఫలోదీలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికా ర్డు కావడం ఐదేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్తాన్‌లోని చురూలో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండల ధాటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రాజస్తాన్‌లోని బార్మర్‌లో 48.8, జైసల్మేర్‌లో 48, బికనెర్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. పశి్చమ బెంగాల్‌లోని కూచ్ బెహార్లో 40.5 డిగ్రీలు, అస్సాంలోని సిల్చార్‌లో 40, లుమిడింగ్‌లో 43, అరుణాచల్‌లోని ఈటానగర్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
ఇంగ్లండ్‌లో ఎండ దెబ్బకు కరిగిన రన్‌వే
లండన్: ఇంగ్లాండ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వాహనాలకు నిప్పంటుకుంటోంది. గడ్డి భూములు అగ్నికి ఆహూతవుతున్నాయి. రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎండలను తట్టుకోలేక ప్రజలు బీచ్‌లకు పరుగులు తీస్తున్నారు. ఈత కొలన్లలో సేదతీరుతున్నారు. ఎండ దెబ్బకు లూటన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే కరిగిపోయింది! దాంతో విమానాశ్రయాన్ని మూసేయాల్సి వచ్చింది. సోమవారం కేంబ్రిడ్జ్‌లో 38 డిగ్రీలు, లండన్‌లో 37.5 డిగ్రీలు నమోదైంది! సూర్యప్రతాపం వల్ల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. లండన్‌లోని వాక్స్హాల్ ప్రాంతంలో రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. లండన్‌లో వుడ్గ్రీన్ క్రౌన్ కోర్టులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఓ మర్డర్ కేసులో విచారణను వాయిదా వేశారు. యూకేలో వాతావరణం సహారా ఎడారిని తలపిస్తోందంటూ జనం సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఇంకా భయపెడుతున్నాయి. -
మంటల్లో మంచు!
మాస్కో: ఏడాది పొడవునా మంచుతో నిండి ఉండే ఉత్తర ధ్రువ ప్రాంతం మండిపోతోంది. ఉష్ణోగ్రతలు ఏకంగా 38 డిగ్రీ సెల్సియస్‌కు చేరిపోవడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ధ్రువ ప్రాంతంలోని ఈ విపరీత పరిణామం భూగోళంపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని రష్యా పట్టణం వెర్కెహెయాన్స్లో గత శనివారం ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరినట్లు అక్కడి రికార్డులు స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం ఒక పరకటన చేస్తూ అనూహ్యమైన ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. -
రికార్డు సృష్టించిన జూలై
ఇప్పుడైతే శాంతించాయి గానీ.. రెండు నెలల కింద ఎండలు మండిపోయిన విషయం మనకు తెలిసిందే.. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఎన్నడూ లేని స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్, అమెరికాతో పాటు భూ ఉత్తరార్ధ గోళంలోని అనేక దేశాల్లో వడగాడ్పులు ప్రజలను ఠారెత్తించాయి. ఈ ఏడాది తొలి 6 నెలల ఉష్ణోగ్రత రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. జూలైలో భూమి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉన్న ట్లు స్పష్టం చేసింది. 20వ శతాబ్దం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీ సెల్సియస్ ఉండగా.. జూలై ఉష్ణోగ్రత 16.75 డిగ్రీలుగా నమోదైంది. మూడేళ్ల కింద అంటే 2016లో సుమారు 16 నెలల పాటు రికార్డు స్థాయి ఉష్ణో గ్రతలు నమోదైన తర్వాత అంతటి ఉష్ణోగ్రత లు నమోదు కావడం ఇదే తొలిసారి. 1998 తర్వాత జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతూ వస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
బిలాస్పూర్ @ 49.3 డిగ్రీలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో సోమవారం రికార్డు స్థాయిలో 49.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడంతో పరికరాలలో లోపాలు ఏమైనా ఉన్నాయేమోనని నిపుణులు పరిశీలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్నడూ ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీంతో ఉష్ణోగ్రతలను కొలిచే పరికరాలతోపాటు వేడి పెరగడానికి కారణమైన ఇతర అంశాలను కూడా నిపుణులు పరిశీలించారు. అయితే పరికరాలలో తప్పులేవీ లేవనీ, సోమవారం నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందని ఓ అధికారి తెలిపారు. నిపుణుల బృందం బుధవారం మరోసారి ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపనుంది. బిలాస్పూర్లో మంగళవారం 47.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి నుంచి వస్తున్న వేడి గాలుల వల్లే ఉష్ణోగ్రతలు పెరిగి ఉండొచ్చని పలువురు పేర్కొంటున్నారు. -
నడినెత్తిన నిప్పులే..!
-
నడినెత్తిన నిప్పులే..!
- గతేడాది కంటే ఈసారి పెరగనున్న ఉష్ణోగ్రతలు ∙45 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం - వారం ముందుగానే వేసవిలోకి ప్రవేశం ∙గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతోనే అంటున్న శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే మహబూబ్ నగర్లో రెండుసార్లు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండా కాలంలోకి ప్రవేశించామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38 డిగ్రీలు... మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మంలలో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రం అప్పుడే అగ్నిగుండంలోకి వెళ్తోంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే... ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండుతుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన నెలకొంది. గతేడాది ఫిబ్రవరి 23వ తేదీన మెదక్‌లో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 24వ తేదీన హన్మకొండలో 39.1 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.6 డిగ్రీలు నమోదైంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతేడాది కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. వచ్చే వారం నుంచి ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రస్తుతానికి తటస్థంగా ఉందని... రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలని అంటున్నారు. అది కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల నుంచే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అవి మరింత పుంజుకుంటాయని అంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్లలో ఎల్‌నినో? గత రెండేళ్లుగా రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్‌నినో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపనుందా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వాతావరణ మోడళ్లూ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని స్కైమెట్ శాస్త్రవేత్త మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ అంచనాలు ప్రస్తుతానికి మాత్రమేనని, ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మార్చి చివరినాటికి, లేదంటే ఏప్రిల్ 15 నాటికి మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు. -
బెంగళూరు 'మార్కు' మారనుందా?
సూర్యతాపం ఉద్యానగిరిగా పేరొందిన బెంగళూరునూ వదలడం లేదు. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పగటి ఉష్ట్రోగ్రతలు పెరిగిపోవడంతో ఈసారి బెంగళూరులో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యాయి. సాధారణంగా ఈ గార్డెన్ సిటీలో 31 డిగ్రీలు దాటని ఎండలు... ఈసారి తీవ్రంగా పెరిగిపోయి బెంగుళూరు మార్కునే కోల్పోయేలా చేశాయి. ఈ యేడు సూర్యతాపంలో వచ్చిన తీవ్ర ప్రభావం బెంగళూరుపైనా చూపింది. ఉద్యాననగరిగా పేరొందిన బెంగళూరులో సాధారణ ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెల్సియస్ కాగా, ఈసారి 40 డిగ్రీల వరకు వచ్చేసింది. ఆదివారం నాడు అక్కడ 39.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సారి ఏర్పడిన వాతావరణ ప్రతికూల పరిస్థితులు 40 డిగ్రీలను దాటేట్టు చేసి రాకార్డును తిరగరాశాయి. బెంగళూరులోనే కాక కర్ణాటక రాష్టంలోనే ఈసారి అధిక ఉష్ణోగ్రత నమోదౌతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కర్ణాటకలోని వేసవి విడిది ప్రాంతంగా పేరొందిన కలబుర్గీలో కూడా ఈసారి సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సీజన్లో సరైన వర్షాలు కురవకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ఎయిర్ కండిషన్డ్ నగరంగా పేరొందిన బెంగళూరు పరిస్థితే మారిపోయే అవకాశం కనిపిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 80 ఏళ్ల క్రితం 1931 ఏప్రిల్ నెలలో బెంగళూరులో 38.3 డిగ్రీల ఉష్ణోత్రత నమోదై రికార్డును సృష్టించిందని, ఆతర్వాత 2016 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ రికార్డును మించిపోయినట్లు వాతావరణ శాఖ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈసారి బెంగళూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుపుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగుళూరు సంపాదించిన ప్లెజెంట్ వెదర్ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాక రాత్రి సమయాల్లోనూ వేడి అసౌకర్యాన్ని కలిగించడం వాతావరణ అధికారులకు కూడా అంతుబట్టడం లేదు. రాగల రెండు రోజుల్లో బెంగళూరు వాతవరణం కాస్త చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.