రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే మహబూబ్ నగర్‌లో రెండుసార్లు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండా కాలంలోకి ప్రవేశించామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.